Thursday, March 8, 2007

9 వ నెల

ఇపుడు మా అవిడకి 9 వ నెల. అరోగ్యం బాగానె ఉంది. మా అమ్మాయి పేరు దియ అని పెట్టుకున్నాం. శోమవారం మా అత్తమ్మ, మామయ్యలు చికాగో మీదుగా మా ఇంటికి వచ్చారు. వారంతం లోనె వేరే ఇల్లు కుడా మారవలసి వచ్చింది. ఇంకొన్ని రోజులు సర్దుకుంటూ ఉంటే ఇల్లు ఒక కొలిక్కి వస్తుంది. మొన్న రాత్రి "కింద నేల ఉంది" అనే కథ చదివాను, బాగా ఉనింది. Career లో పరుగెత్తి పాలు తాగడంలో ఉన్న పర్యవసానాలు బాగా విశ్లేషించాడు రచయిత.

5 comments:

రాధిక said...

డైరీ చదువుతున్నట్టు గా వుంది ఈ పోస్ట్ చదువుతుంటే.మీ శ్రీమతి గారికి డెలివరీ సవ్యం గా జరగాలని కోరుకుంటున్నాను.

కొత్త పాళీ said...

శ్రీ, మీకు, మీ శ్రీమతికి శుభాభినందనలు, చిన్నారి దియకు ఆశీర్వచిన సహిత ఆహ్వానాలు.
మీరూ బ్లాగు రాస్తున్నారని చూసి చాలా ఆనందం వేసింది.

రానారె said...

శుభమస్తు!
నిజం చెబుతున్నాను సర్, మరేమీ అనుకోకండి. మీ ఫోటో చూసి ఏ ఇంజనీరింగ్ కాలేజీలోనో రెండో సంవత్సరం చదువుతుండొచ్చు అనుకున్నాను. క్షమించాలి. ఇంత సాధించారని తెలిసి ఆశ్చర్యపోతున్నాను :)

జ్యోతి said...

శుభాకాంక్షలు....చిన్నారి దియకు ఆశీర్వాదాలు.మీ వివరాలు తెలియజేస్తారా.

Anonymous said...

ఆలస్యపు శుభాకాంక్షలు. చిన్నారికి ఆశీర్వాదాలు.