Thursday, March 12, 2009

ఎవడి గోల వాడిది

ఒంటి మీద వేడి సెగలు తగులుతున్నాయి. అంతలోనే ముఖం మీద చన్నీళ్ళు పడ్డాయ్. ఏమి జరుగుతుందో ఊహించే లోపల నాపై బరువుగా ఒక ఆకారం నన్ను ఆక్రమిస్తుంది. నోరు సాగ దీసి మింగడానికి సిద్ధంగా ఉన్న కొండచిలువ లేడి పిల్లను ఆక్రమిస్తున్నట్టుగా ఉంది. ఎర్రగా వెలుగుతున్న సూర్యుడిని తినే పండనుకున్న బాల హనుమంతుడు నోటితో అమాయకంగా కొరకబోతున్నట్టుగా ఉంది. గ్రహణం రోజు వేగంగా దూసుకు వస్తున్న రాహువు లాగా నా మీదకి వస్తుంది ఆకారం. ఏమి జరుగుతుందో తెలిసే లోపలే ఒళ్ళంతా వేడికి కాలిపోతుంది. ముడతలు పడి ఉన్న నా చర్మం అడుగున ఉన్న కొవ్వంతా కరిగి అప్పడంలా మారుతుంది. మూలని వదిలిపెట్టడం లేదు. వళ్ళంతా ఒకటే వాతలు, బాధకి తాళలేక అరుద్దామనుకుంటే నోటి నుండి మాట పెగలడం లేదు. ఎవరో నా గొంతు మీద కాలేసి నొక్కి ఊపిరి ఆడకుండా నొక్కేసినట్టునారు. స్ఫృహ తప్పే ముందు నిన్న జరిగిన సంఘటనలు ఒక దాని వెనక ఒకటి కనిపిస్తూ ఉన్నాయి.



****************** ఫ్లాష్ బాక్ మొదలయింది ********************


ఈ చీకటి గృహంలోకి వచ్చి ఇంచుమించు వారం రోజులయి ఉంటుంది. లోపలంతా ఒకటే ఉక్క. చుట్టుపక్కల అందరూ నా లాంటి వాళ్ళే,ఒళ్ళంతా మురికి పట్టి ఉన్నారని వాళ్ళ నుండి వస్తున్న చమట వాసన చెప్పకనే చెపుతుంది.కొంచెం గాలి తగిలే వైపు చేరి,గోడకి ఆనుకుని కూర్చున్నా.ఎపుడు నిద్రలొకి జారుకున్నానో నాకే తెలియదు.అలా ఎన్ని రోజులయిందో తెలియదు,ఇక్కడ కనీసం కాలెండర్ కూడా తగిలించలేదు. రోజులు లెక్కపెట్టుకుందామంటే సూర్యుడి జాడే లేదు,నాకా వాచ్ పెట్టుకునే అలవాటు లేదు. కొంచెం దూరంగా గజ్జెల చప్పుడూ వినిపిస్తుంది,నిదానంగా ఆ చప్పుడూ పెద్దదవుతూ ఉంది. హమ్మయ్య...ఎవరో ఇటే వస్తున్నారు,ఇక్కడ నుండి బయటపడే సమయం ఆసన్నమయింది.ఆ ఆలోచనే వంద..ఊహూ,వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది.నెమ్మదిగా తలుపు తెరుచుకుంటుంది,ఒక్కసారిగా వెలుతురు కనిపించేసరికి ఉక్కిరి బిక్కిరి ఆయ్యా! ఒక అందాల సుందరి నా చెవి మెలేసి నన్ను అమాంతం ఒక్క ఉదుటున లేపింది. చెవి నొప్పి పెడుతున్నా ఆ సుకుమార చేతుల మధ్య నలగడం కాబోలు, హాయిగా ఉంది.


గాల్లో తేలినట్టునందే...

గుండె పేలి నట్టుందే!

తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే!!

ఒల్లు తూగినట్టుందే...

దమ్ము లాగినట్టుందే!

ఫుల్లు బాటిల్ ఎత్తి దింప కుండా తాగినట్టుందే!!

నాలో నేను హుషారుగా పాడుకుంటూ ఉన్నాను, ఇంతలో ఉన్నట్టుండి పెద్ద బావిలో పడ్డాను. ఊహూ..ఇది బావి కాదు, ఎదో పెద్ద గొయ్యిలాగుంది. మళ్ళీ చీకటి, ఈ గొయ్యిలో నాలాగే చాలా మంది ఉన్నారు. ఒకరి మీద ఒకరు పడుతూ ఉన్నాం.


"అబే......తేరీ మాకీ......."


ఎవడో పాత బస్తీ నుండి అనుకుంటా, వాడి కాలు మీద పడినట్టున్నా. "మాఫ్ కర్నా భాయ్ సాబ్. చీకట్లో కనపడలేదు" అని సారీ చెప్పా.


"ఏంది బా..చానా దినాలయింది. యాడికైనా పూడిసినావేమో అనుకున్నా! ఎట్టుండా?" ఎవరో కాలాస్త్రి నుండి, తెలిసిన గొంతు లాగుండేసరికి మిణుకు, మిణుకు మంటున్న ఆ వెలుతురులో తల వెనక్కి తిప్పి చూడడానికి ప్రయత్నించా.


ఇంతలో గొయ్యి చుట్టు పక్కల నుండి "సుయ్యి" మని నీళ్ళు పడడం మొదలుపెట్టాయి. నీళ్ళు కొంచెం వెచ్చగా ఉన్నాయి, చలి కాలం వెచ్చగా ఒంటి మీద నీళ్ళు పడుతుంటే ప్రాణానికి హాయిగా ఉంది. వంటి మీద జిగురుగా ఎదో అంటుకుంది, మంచి వాసన వస్తుంది. కొంచెం చేతికి తీసుకుని వాసన చూసా. లక్స్ సోపు లాగుంది, ఆలస్యం చేయకుండా ఒంటికి రాసుకోవడం మొదలుపెట్టా. వారం రోజులనుంచీ స్నానం లేదు, గీనం లేదు. ఒంటి నుండి మురికి కిందకి జారుతుంటే ప్రాణం లేచివచ్చినట్టయింది.


"జలకాలాటలలో...

కలకల పాటలలో....
ఏమి హాయిలే హల..

అహ..ఏమి హాయిలే హలా...."

మసక మసక చీకట్లో హోరు మంటూ పడుతున్న నీళ్ళ మధ్య కొంతమంది అమ్మాయిలు వయ్యారంగా స్నానాలు ఆడుతున్నారు.ఒక్కసారిగా గుండె ఝల్లుమంది! కొంచెం దూరంగా ముసలాయన్ వీపు రుద్దుతున్న ఒక ముసలామె,ముసలాయన కూడా అమ్మాయిల వైపు కొంటె చూపులు చూస్తుండడం గమనించి ఒక్క మొటిక్కాయ వేసింది.నేను కూడా ఉలిక్కి పడి ఒళ్ళు రుద్దుకోవడం కంటిన్యూ చేసాను. కాలు సబ్బు మీద పడినట్టుంది,కాలు సర్రున జారి కింద పడ్డా. తల నేల మీద పడుతూ "ఠప్" మని శబ్దం చేసింది. తల తగలేముందు కొన్ని సెకన్ల ముందు పక్కకి చూస్తే అందరూ నాలాగే జారి పడుతున్నారు. తల దిమ్మెక్కింది! ఎందుకని, అందరూ ఇలా పడ్డారు? అదుగో,మళ్ళీ జారుతున్నాను, ఊహూ అందరూ జారుతున్నారు,ఒకరి మీద ఒకరు పడుతున్నారు.అపుడు అర్థమయింది,భూకంపం! భూమి కంపిస్తుంది,ఆ కుదుపులకి అందరూ కిందా,మీదా పడుతున్నారు. ఆశ్చర్యం! పై నుండీ ఇంకేమీ మా మీద పడడం లేదు,మమ్మల్నే ఎవరో తిప్పి,తిప్పి కొడుతున్నారు.కాసేపటికి కంపించడం తగ్గి, ఈదురు గాలి మొదలయింది.ఇది చలి కాలమే కదా? వేడి గాలి ఎందుకు వస్తుంది? ఏమిటో? ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రకృతి వైపరీత్యాలని ప్రిడిక్ట్ చెయ్యలేకపోతున్నాము! కాసేపు వాన,భూకంపం మళ్ళీ అపుడే ఎండాకాలంలో లాగా ఈదురు గాలులు.తుఫాన్ సద్దు మణిగింది ఒక రెండు,మూడు గంటలు గడిచి ఉంటాయేమో.మళ్ళీ గజ్జెల చప్పుడు! దగ్గరవుతున్న గజ్జెల చప్పుడుతో నా గుండె చప్పుడు తోడయింది.


****************** ఫ్లాష్ బాక్ అయిపోయింది ********************

మెలకువ వచ్చి చూసేసరికి అద్దం ముందు నేను! అద్భుతం!! నేనేనా? ఏమిటి ఇంత అందంగా ఉన్నాను? ఇది కలేనా? ఎమో? ఒకసారి గిల్లి చూసుకోవాలి, చేయి మీద గిచ్చి చూసుకుందామని చూస్తే నున్నగా ఇస్త్రీ చేసినట్టుంది !!! "హాచ్...". ముక్కు పగిలిపోయేలా కొడుతున్న సెంటు వంటి మీద చల్లగా పడుతుంది.  


కొసమెరుపు : ఉదయం ఆఫీసుకి వెళ్ళే ముందు చొక్కా ఇస్త్రీ చేసుకుంటుండగా వచ్చింది ఈ అలోచన. చొక్కా ఇస్త్రీ చేసుకుంటూ నేను అలోచిస్తున్నాను,నాలాగే చొక్కా కూడా అలొచిస్తూ ఉండచ్చు కదా! 
ఆ అలోచనలని బ్లాగుదామని చేసిన ఒక చిలిపి ప్రయత్నం!



19 comments:

Naga said...

:)

మురళి said...

చాలా బాగుందండి..

ప్రపుల్ల చంద్ర said...

interesting !!!

మేధ said...

:)

Kottapali said...

wow. very good!!

శ్రీ said...

నాగన్న, మురళి, ప్రపుల్ల చంద్ర, మేధ మరియు కొత్తపాళీ గారికి,

మీకందరికీ నచ్చినందుకు నెనర్లు.

Mahitha said...

excellent narration

జీడిపప్పు said...

Wonderful!! చాలా క్రియేటివ్ గా వ్రాసారు. ఇప్పుడు నా ఎదురుగా కాఫీ కప్పును చూస్తున్నా "ఈ కప్పు ఏమనుకుంటున్నదా" అని :)

Anonymous said...

ayya guruvu garu

paDutuMdi - this is future tense.
paDutOMdi - present tense.

Such mistakes are aplenty in your blog and writing from time immemorial.

How about learning telugu first before writing a great blog? Your story is good but languges just plain SUCKS and inhibits reading.

శ్రీ said...

మహి గారికి,

నెనర్లు.

జీడిపప్పు గారికి,

మరి ఆలస్యమెందుకు, రాసేయండి!

అనానిమస్ గారికి,

పబ్లిష్ చేసేముందు కొంచెం కసరత్తులు చేసి తప్పులు సవరించాను,ఇంకా కొన్ని మిగిలినట్టున్నాయి. తప్పులు ఎక్కడ ఉన్నాయో దయచేసి చూపించగలరు,సరి దిద్దుకోడానికి ప్రయత్నిస్తాను.

నేను తెలుగుని ఇంకా నేర్చుకునే ప్రయత్నం లోనే ఉన్నాను.నా కథ మీకు కూడా నచ్చినందుకు చాలా సంతోషం!

asha said...

great imagination!!
good post

శ్రీ said...

భవాని గారికి,

నెనర్లు.

Anonymous said...

these are the things I can find in the first para itself. Sorry to be blunt and rude but ...

---------- Written -------
నాపై బరువుగా ఒక ఆకారం నన్ను ఆక్రమిస్తుంది.... ఏమి జరుగుతుందో తెలిసే లోపలే ఒళ్ళంతా వేడికి కాలిపోతుంది. ...నా చర్మం అడుగున ఉన్న కొవ్వంతా కరిగి అప్పడంలా మారుతుంది.

--------------------------

-------- To Be written --------
....నాపై బరువుగా ఒక ఆకారం నన్ను ఆక్రమిస్తోంది. ... ఏమి జరుగుతుందో తెలిసే లోపలే ఒళ్ళంతా వేడికి కాలిపోతోంది. .... నా చర్మం అడుగున ఉన్న కొవ్వంతా కరిగి అప్పడంలా మారుతోంది. ....
---------------------------

Prasad Samantapudi said...

Good Attempt. Keep writing.

శ్రీ said...

నిజమే అనానిమస్ గారు.

మీరు మార్చి రాసాక స్పష్టంగా అర్ధమయింది.మీ పాఠాలు గుర్తు పెట్టుకుని ఇక మీద రాసే టపాలు బాగా రాస్తాను.

మీ మాట గట్టిగా ఉన్నా మీరు ఇచ్చిన సలహా చాలా స్నేహపూరితంగా ఉంది.

నెనర్లు ప్రసాద్.

teresa said...

భలే!

శ్రీ said...

నెనర్లు థెరెసా గారు

Unknown said...

Creative writing....

శ్రీ said...

మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ గారికి నెనర్లు.