Thursday, April 19, 2007

ఇంటి ముఖం పట్టిన సంజయ


American Idol లో సంచలనం స్రుష్టించిన సంజయ మొత్తానికి ఇంటి ముఖం పట్టాడు. వచ్చిన కొత్తలో సిగ్గు పడుతూ పాడే సంజయ కొన్ని రోజులకి కొత్త వేషాలు వెయ్యడం మొదలుపెట్టాడు. పాటగాడి కంటే మంచి వేషగాడిగా బాగా పేరు వచ్చింది. సంగీత కుటుంబం నుండి వచ్చిన సంజయ పాట మన సంగీతంలాగ ఉందనిపించేది. Smooth Jaaz కి ఐతె బాగా సరిపొతాడేమో? నాకైతే ప్రతి వారం ఈ వారం వెళ్ళిపొతాడేమో అనుకుంటూ ఉండేవాడిని. ఇన్ని రోజులు ఉండడం అనేది నిజంగా మనకి గర్వ కారణమే! సంజయ యువతకి స్పూర్తిగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సంజయకి ఇపుడు లభించిన ఆదరణతో మునుముందు సంగీత సామ్రజ్యంలో అతని తాహతుకు తగినంత కొల్లగొడతాడని అశిద్దాం!

2 comments:

spandana said...

ఇతన్ని గురించి విని American Idol చూశాను, అదేవారోజు ఇంటిముఖం పట్టాడు. ప్చ్!

అయినా ఈతని పాపులారిటీ ఇంకొన్ని నెలలు తరగదు అనుకుంటా!

--ప్రసాద్
http://blog.charasala.com

rākeśvara said...

నేను ఆఖరిరోజు మాత్రమే చూసా.

ముందు ముందు మంచి అవకాశాలు వస్తాయని ఆశిద్దాం