సోమవారం అఫీసుకి వచేసరికి శీక నుండి టపా వచ్చింది. లేకు మిచిగన్ కి 400 అడుగుల దూరంలో పిజిన్ హిల్సు రిసార్టు లొ 5 రూములు బుక్ చేసడు, ఇక 4,5 బెడ్ రూములు ఉన్న పెద్ద ఇల్లు కుడా. టపా లొనె ఫొటోస్ కుడా పంపాడు, రూములు కొండ మీద ఉన్నాయి, మెట్లు దిగి నడిస్తే కింద లేకు మిచిగన్.....చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక అప్పటి నుండి మొదలయింది అందరికి అవేశం! ముందు రమణ అందరికి మైల్ కొట్టాడు "కాంపింగు లొ ఏమి చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని!". తర్వాత రాజశేఖర్ పక్కనే ఉన్నటువంటి జెట్ స్కీయింగ్, స్పీడ్ బోట్సు వివరాలు సేకరించి అందరికి లింకులు పంపాడు. నెను అరున్, మూర్తీ, విజయ్ కి ట్రిప్ గురంచి చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేసాను. మా ఇంట్లో నుండి నేను, షాలిని, దియ, అత్తమ్మ, మామయ్య, నిఖిల్ బయలుదేరుతున్నం, మా అందరికోసం ఒక పెద్ద రూము బుక్ చేసేసాం. ఒక్కొక్క రూములో 2 లేక 3 బెడ్సు, ఒక కిచెన్, చిన్న లివింగ్ రూము, ఇంక ఒక బాత్ రూము ఉన్నాయి.
బుధవారం శీక నుండి ఇంకొక తపా వచ్చింది. శుక్రవారం నుండి ఆదివారం సాయంత్రం వరకు ప్లాన్ చేసిన అక్టివిటీస్, దెట్రాయిట్ నుండి ఎంత ఫూడ్...ఎక్కడ నుండి తీసుకుపోవాలి, ఇంక వాలీబాల్, బింగో (తంబోలా) లాంటి అటలకి ఎవరెవరు ఆర్గనిజెర్స్, ఎవరెవరు ఎవరి కార్లో వెళ్తారు ఇలా అన్ని డిటైల్సు పంపాడు
(సశేషం)
(సశేషం)
1 comment:
bavudhi andi.....
Post a Comment