Tuesday, July 24, 2007

కాలాస్త్రికి వచ్చేసానోచ్!!!


మొన్న శుక్రవారం దిగాను కాలాస్త్రికి, ఇంట్లో అందరూ బాగా ఉన్నారు. శనివారం ఉదయం తిరుమలకి వెళ్ళి శ్రీనివాసుడుని దర్శించి తలనీలాలు సమర్పించా! 3 వారాలు మద్రాసులో ఉంటాను, ఒక వారం కాలాస్త్రిలో ఉంటాను. కాలాస్త్రి 2,3 సంవత్సరాల్లో పెద్ద మారలేదు, అలాగే ఉంది. చిన్నప్పటినుండీ చూస్తూ ఉన్న అమ్మమ్మ ఇల్లు బదులు కొత్త ఇల్లు వచ్చింది. ఎండలు పెద్దగా ఉన్నట్లనిపించడం లేదు. ఈ శుక్రవారం విజయవాడకి వెల్లి అక్కడ విశేషాలతో మల్లీ రాస్తా. పక్క ఫొటో శుక్రవారం ఉదయం 5:30కి బెసంట్ నగర్ లో తీసినది

4 comments:

రాధిక said...

బాగా ఎంజోయ్ చెయ్యండి.ఇండియా ప్రయాణం అనేబదులు తీర్ధయాత్రలకి వెళుతున్నాము అని చెప్పుకుంటే బాగుంటుందేమో? వెళ్ళిన 3 వారాల ట్రిప్ లో రెండున్నర వారాలు గుళ్ళు గోపురాలు చూడడానికే సరిపోయాయి నాకు.

oremuna said...

పనిలో పని మన తెలుగు బ్లాగుల గురించి ఈ కాలాస్త్రిలో ఓ నలుగురి చెవిలో ఊదవచ్చు కదా!

శ్రీ said...

కాకపొతే రాధిక గారు, నేను అఫీసు పని మీద రావడం వల్ల 3 వారాలు చెన్నైలోనే ఉంటాను.

శ్రీ said...

నిజమే మూనా! అందరికి చెవినిల్లు కట్టుకుని మరీ చెప్తున్నాను నా కాలాస్త్రి గురించి...