Saturday, August 25, 2007

నీచమయిన స్థితిలో ఉన్న వెంకటగిరి - రాపూరు రోడ్



ఆగష్టు 15 , మా చిన్నపుడు స్కూలుకి బయలుదేరాను కాలాస్త్రి నుండి. బయలుదేరేముందు మా మామయ్య చెప్పాడు, "ఒరేయ్! కాలాస్త్రి ఇంజినీరింగ్ కాలేజి దాటంగానే ఎడమవైపు వెల్లు, నీకు 10 కి.మీ కలిసివస్తుంది" అన్నాడు. అల్లగె అని నా చిన్ననాటి స్నేహితుడు శేఖర్ తో టాటా ఇండికాలో బయలుదేరాను. కాలాస్త్రి నుండి వెంకటిగిరి వరకు సింగిల్ రోడ్ అయినా ట్రాఫిక్ లేక చాలా హాయిగా ప్రయాణం జరిగింది. వెంకటగిరి చేరిన తర్వాత ఎదురుగా హీరో హోండాలో వస్తున్న అతన్ని రాపురుకి ఇలాగేనండీ వెల్లడం? అని అడిగితే...ఇలాగే కాకపొతే రోడ్దు బాగాలేదు అన్నాడు. నిజమే, రోడ్దు ఎపుడు బాగుంది అని, ఫస్టు గేరు వేసి రాపురు వైపు బండిని ఉరికించాను. ఇక అప్పటినుండీ మొదలయింది మా సాహసయాత్ర! నమ్ముతారో, నమ్మరో రోడ్డు మీద కనీసం 2 అడుగుల గుంటలు ఉన్నాయి. ఇంచుమించు 28 కి.మీ ఇటువంటి రోడ్డే! ప్రతి గుంటకీ ఆ నియోజకవర్గం నుండి మంత్రిగా వెలగబెడుతున్న నేదురుమల్లి రాజ్యలక్ష్మిని తిడుతూనే ఉన్నాను. అశ్చర్యకరంగా ప్రతి కొత్త ఊరు రాగానే మంత్రిగారు వేసిన శంకుశ్తాపన బండలు మాత్రం ఇస్త్రీ చేసిన రాజకీయనాయకుడు చొక్కా లాగా ముద్దుగా ఉన్నాయి. బండల పక్కనే అమాయక ప్రజలు చెట్టుకింద చుట్టలు పీలిస్తూ జీవితాన్ని సున్నితంగా అనుభవిస్తూ ఉన్నారు!
రాపూరు చేరాక సూర్యా(కొత్త పత్రిక) రిపొర్టరు చెపితే తెలిసింది, ఆ రోడ్డు చాలా సంవత్సరాలుగా అలాగే ఉందని, ఇది ఎంత వరకు నిజమో తెలియదు కాని ఆ గుంటల్లో ప్రయాణిస్తున్న నా ప్రజల ఓర్పుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ గుంటలు ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టవని అశిస్తున్నాను.

3 comments:

Gems Of Hindupur said...

ilantivi andhra desam lo chaala vunnayi...

శ్రీ said...

నిజమే! కాకపొతే ఈ ఊరికి చుట్టుపక్కల రోడ్డు చాలా బాగుంటుంది, ఇక్కడ మాత్రమే గుంటలు! నాకు మా స్నేహితుడు చెపితే తెలిసింది ఎమిటంటే రాపూరు, వెంకటగిరి రెండు వర్గాలకి చెందినవి. విషయమేమిటంటే వాల్లకు, వీల్లకు పడదు మద్యలో రోడ్డుని గాలికి వదిలేసారు.

Anonymous said...

పేరులోనే ఉంది కదండీ, రా'పూర్' రోడ్డని. వేస్తే రోడ్డుకు చెడ్ద పేరొస్తుందని వేయటం లేదేమో. మీరు ఇప్పుడే శాసనసభ్యురాలు, మంత్రి ఐన ఆవిడ గురించి చెప్పారు. అసలాయన వున్నారు . తిరిగి నామినేషన్ వేస్తే ఓడిస్తారని వేసినచోటినుంచి వేయకుండా బాపట్లలో మొదలెట్టి విశాఖలో తేలాడు. ఈ సారి బరంపురం వెళ్తాడేమోచూడాలి.