Sunday, May 11, 2008

కంత్రి - ఇంకొంచెం బాగా తీసుండాల్సిందిఅబ్బా.. కంత్రి అంట, మొన్ననే యమదొంగ సూసినట్టుంది అపుడే ఇంకో సినిమాలో వచ్చాడా ఈడు...ఈడి బండ బడా, బలే ఉందే ఈడి యవ్వారమా! సరే, ఇంక చేసేదేముందీ! మనం మొదట ఆట చూడబళ్ళా! టయం చూస్తే మద్దానం 3 అయింది, నెల్లూరిలో ఉంటే మద్దినాల సినిమా చూడాలంటే బలే ఇసుగు, ఈడేముంది చల్ల గుంటాది ఎపుడయినా, ఈ ఆటకే పోదాం అని ఇంటి కాడి నుండి బయటికొచ్చా. నేను హాలు కాడికి యెల్లేసరికి మొదలయిపొయింది ఆట, దీని పాసుగాలా...మళ్ళీ లేటే అనుకుని టిక్కెట్టు ఇచ్చే పిలకాయ్ ని అడిగా, "అబ్బాయా..ఎంతసేపయింది మొదలయ్య..." అని. పిలకాయ్ ఉషారుగా "ఇపుడేనా...ఇపుడే ఎత్తినారు తెర" అంటూ ఇహిహి అని నవ్వాడు. నీకు బలిసిందిరా, నా కొండె అనుకుంటూ చీకటిగా ఉన్న హాలులొకి వెల్లి ముందు సీట్లో కూచున్నా. ముందు కూచ్చుంటే బొమ్మ ముందు మనకే కనిపిస్తాది. అమ్మయ్య...పర్వాలేదు, లేటు అయినా ఇంకా జూ. ఎన్.టీ.ఆర్ రాలేదు (ఇక పైన జూ అని పిలస్తా). రాగానే ఫైటు తర్వాత పాట. యెంది వీడు, డైలాగులు మహేష్ బాబు లాగా చెప్పాలని చూస్తున్నాడే. అట్టా, ఇట్టా చూసేసరికి ఇంటర్వెల్లు అయింది. తిండానికి మనుగుబూలు ఉంటే బాగుండేది, సరేలే ఎదోఒకటి తిందాం అని బయటకి వచ్చా. బయటరాగానే బుచ్చిరెడ్డిపాళెం పిల్లోడు కనిపించాడు, యేమినా..సినిమా కొచ్చా? అని అడిగాడు. నేను పగలబడీ నవ్వుతూ సినిమాకి కాకపొతే కూరగాయలు కొన్నాటికి వచ్చానా? అన్నా. "సినిమా కొంచెం పోకిరి, చిరుత లాగుండ్లా" అంటే, "నిజమేనా, అట్టనే ఉంది" అన్నాడు మా బుచ్చి పిల్లోడు. మిగతా ఎట్టుందో చూద్దాం అని లోపలకి వెళ్ళాము ఇద్దరం. ఈసారి సినిమా విపరీతమయిన మలుపులు తిరిగింది. రెండో హీరొయిన్ కుడా వచ్చేసింది, యెంది ఈమె? షెడ్డులో బండి లాగుందే అనిపించింది. కాజొల్ కజిన్ అంట, బొంబాయి లో పనికిరాదని ఈడకి పంపించినట్టుంది వీళ్ళ అమ్మ!

సినిమా మొత్తానికి పాటలు బాగ తీసాడు, జూ డాన్సు అయితే తుక్కులేపాడు. సినిమా ఇంకొంచెం జాగర్తగా తీసుంటే బాగుండేదేమో? సునీల్, క్రిష్న భగవాన్ కామెడీ అయితే అదిరింది. సునీల్ "శివాజి" లాగ బలే చేసాడు, నవ్వలేక చచ్చా. దర్శకుడు కొత్తోడంట తెలిసిపొతుంది బాగా, పూరీ జగన్నాథ్ దగ్గర రెండో సారి ట్యూషన్ చెయ్యాల, లేకపొతే సినిమాలు తీయడం కష్టం! మనకి చూడడానికి కష్టం!!

9 comments:

Kathi Mahesh Kumar said...

బాగుందయ్య నీ కత.బాగాతీసి పారేస్తే ఎట్లా.మలబోటోల్లు బలవ్వద్దా. ఐనా ఒక టికెట్టు పై రెండాటలు సూయించుండ్లే? పండగజేస్స్కో మల్లా ఇంకేంది.

మాదీ సిత్తూరే,మదనపల్లి పక్కన వాయలపాడు.

కొత్త పాళీ said...

శ్రీ .. ఈ చిత్తూర్ ఇష్టైల్ బ్రహ్మాండం..

"రెండో హీరొయిన్ కుడా వచ్చేసింది, యెంది ఈమె? షెడ్డులో బండి లాగుందే అనిపించింది."

యేంఇ పోలిక చెప్పినావబ్బా

రానారె said...

కాలాస్త్రి పిలకాయ నెల్లూరియాసలో మాట్టాడతాండాడేందబ్బా!?

జల్సా సినిమా గురించి మీర్రాసింది చదివి, వెళ్లి చూశాను. ఈ వారాతం కంత్రియార్ జీనియర్ చూసొస్తా.

:-)

శ్రీ said...

కత్తి మహేష్ కుమార్ గారికి, అవునండీ, మనకి ఒక్క టిక్కెట్టు మీద రెండు సినిమాలు. మా పెద్దక్క, బావ మదనపల్లె లో ఉండేవాళ్ళు. వాయల్పాడుని బస్సులో పోతూ చూసా.

థాంక్స్ కొత్తపాళీ గారు.

రానారె గారికి,

నేను పుట్టింది కాలాస్త్రిలో అయినా పెరిగిందంతా నెల్లూరు జిల్లాలో. అందుకే బాగా అలవాటయిన బాషలో రాసా. ఒకసారి చూడచ్చులేండి కంత్రీ.

Niranjan Pulipati said...

భలే రాస్తా వుండావు అప్పా... నేనూ జూసినా కంత్రీ.. బాగానే వుండాది. :)

శ్రీ said...

మీ అభిమానానికి థాంక్స్ నిరంజన్ గారు.

fazlur said...

మీరు వ్రాసే యాస చాలా బాగుంది ... :)

bolloju ahmad ali baba said...

బాగుంది. మీ రివ్యూ
బొల్లోజు బాబా

శ్రీ said...

థాంక్స్ ఫజ్లూర్ గారూ!
బొల్లోజు అహ్మద్ ఆలి బాబా గారూ మీకూ థాంక్స్.