అఖిలాంధ్ర ప్రేక్షకులు ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న కొత్త బంగారు లోకం ఎంతో దూరంలో లేదు. ఇంకొక 8 రోజుల్లో మన ముందు ఉంటుంది. ఇదేంది, "కొత్త లోకం" రావడం ఏందబ్బా? అనుకుంటున్నారా? అదేనండీ! మన దిల్ రాజు గారి కొత్త బంగారు లోకం,అదీ ఇపుడు వెలింగిందనమాట!
మరి ఈ సినిమా లోని విశేషాలు ఏమిటో చూద్దాం.
1. ఇది యువతరాన్ని ఉర్రూతలూగించబోయే ఒక ప్రేమ కథ! అంతే కాకుండా కుటుంబమంతా హాయిగా కలిసి చూడగలిగిన చిత్రం.
2. బొమ్మరిల్లు, హాపీడేస్ లాంటి విజయవంతమయిన చిత్రాలని అందించిన దిల్ రాజు చేతుల మీదుగా విడుదల అవుతున్న చిత్రం.
3. హాపీడేస్ కి వీనుల విందయిన సంగీతాన్ని అందించిన మిక్కీ జే మాయర్ మళ్ళీ ఈ చిత్రానికి పసందయిన సంగీతాన్ని అందించాడు.
4. మనందరికీ పరిచయమయిన చోటా కే నాయుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
5. హాపీడేస్ చిత్రం ద్వారా మీ అందరినీ మెప్పించిన వరుణ్ సందేష్ హీరోగా మళ్ళీ మీ మెప్పు పొందడానికి వస్తున్నాడు.
6. శ్వేత ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరవబోతుంది. ఈమె ఇప్పటికే బాల నటిగా జాతీయ అవార్డు పొందడం ఒక విశేషం!
7 .కొత్త వారిని ప్రోత్సహిస్తున్న దిల్ రాజు ఈసారి ఆ అవకాశాన్ని దర్శకుడు శ్రీకాంత్ కి ఇచ్చాడు. శ్రీకాంత్ బొమ్మరిల్లు సినిమాకి సహకార దర్శకుడిగా పనిచేయడం ఇంకొక విశేషం.
8.ఇక మిమ్మల్ని విపరీతంగా నవ్వించడానికి బ్రమ్హానందం ఈ సినిమా నిండా కనిపించనున్నాడు.
అవండీ ఈ సినిమా విశేషాలు! అక్టోబరు 8 మీ అభిమాన థియేటర్లో హాయిగా ఈ సినిమా చూడండి.
4 comments:
బాగున్నాయి మీరు చెప్పిన విశేషాలు. సినిమా కోసం ఎదురుచూస్తూ..
మీకు నచ్చినందుకు సంతోషం! పాటలు చాలా బాగున్నాయి,విన్నారా?
ఎం చూడమంటారు?? సినిమాకి వెళ్ళాలంటే ఎకరాలు ఎకరాలు అమ్మాల్సి వస్తోంది ఈ రోజుల్లో.
ఇది పెద్ద హీరోల సినిమా కాదు కాబట్టి టిక్కెట్టు ధర అందుబాటులోనే ఉంటుంది.
Post a Comment