Friday, October 16, 2009

మహాత్మ - కాలాస్త్రి పరిశీలన




రెండు రోజుల ముందు నా 100వ టపాని రాద్దామని మొదలుపెట్టా.రెండు లైన్లు రాసాక ఆ టపాకి ఇపుడు సందర్భం కాదనిపించింది. ఇపుడు మార్కెట్లో ఉన్న గణేష్,మహాత్మా సినిమాల గురించి రాద్దామనుకుంటే వాటి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. వాటికి అంత చిత్రం (సీన్) లేదేమో అని వదిలేసాను. నిన్న మహాత్మా సినిమా చూసాక మంచి ఫీలింగ్ కలిగింది. ఇది 100వ టపాకి ఇంచుమించు సరిసాటి అని అమోదించేసా. ఇపుడే కూడలిలో చూస్తే పరిమళం గారి 100వ టపా కనిపించింది. మహాత్మ శ్రీకాంత్ కి 100వ సినిమా కావడం ఇంకొక విశేషం! ఇక విశేషాలు పక్కన పెట్టి సినిమా గురించి మాట్లాడుకుందాం.




శ్రీకాంత్ ఇప్పటివరకు చేసిన సినిమాల వల్ల అతని కంటే అతని పక్కన వాళ్ళకి బాగా పేరు వస్తూ ఉండింది. రొటీన్ గా చేస్తూ ఉంటాడు, రొటీన్ గా సినిమాలు ఆడుతూ ఉండేవి. కొన్ని సంవత్సరాల క్రితం ఆపరేషన్ ధుర్యోధన లో కొంచెం కొత్తగా బాగా చేసాడు. "అబ్బో...ఫరవాలేదే! శ్రీకాంత్ కూడా బాగనే చేసాడు" అనుకున్నా. ఈ సినిమాలో అతని పరిథి దాటి ఇంకొంచెం బాగా చేసాడు. సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా బాగనే సాగింది. అందరిలాగే ఇతను కూడా సన్నబడి కొత్త లుక్ లో కనిపించాడు. ఇలా చిక్కి సగమయిన వాళ్ళందరి నెగటివ్ పాయింటు శ్రీకాంత్ కి పాజిటివ్ పాయింటయ్యింది. అది ఎలాగంటే జూ.ఎంటీయార్ సన్నబడి గ్లామర్ ఇంతకు ముందు కంటే తగ్గింది. నయనతార,ప్రభాస్ కి కూడా ఇదే పరిస్థితి. శ్రీకాంత్ కి కూడా అలాగే జరిగింది. సాఫ్ట్ గా ఉండే శ్రీకాంత్ ముఖం ఇపుడు కళ తగ్గి ముదురుగా అయింది. ఈ పాత్రకి అది సరిగ్గా సరిపోయింది.




స్క్రీన్ నిండా మనుషుల్ని పెట్టి గోల గోలగా సినిమాలు తీసే కృష్ణవంశీ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఒక మంచి విషయమేమిటంటే టైంపాస్ అయితే అయిపొతుంది. ఇతని సినిమాల్లో పాటలు బాగా తీస్తాడు. సినిమా చివర కొచ్చేసరికి కొంచెం సాగదీసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకి మాత్రం కథ చాలా పకడ్బందీగా రాసాడు. పరుచూరి డైలాగ్స్ సినిమాకి బాగా హెల్ప్ చేసాయి. ఎవరినీ వదిలి పెట్టకుండా అందరికీ వాతలు పెట్టారు. సినీ ఇండస్ట్రీలో వారసత్వం, పార్టీ కొక పేపర్,టీవీ చానెళ్ళు,రాజకీయ వారసత్వం, సామాజిక వర్గం మీదా చెణుకులు దీపావళి టపాకాయల్లాగా బాగా పేలాయి. సినిమా క్లైమాక్స్ కూడా రొటీన్ గా కాకుండా కథలో ట్విస్ట్ పెట్టి బాగా తీసాడు.




హైటెక్ సిటీ సెట్ బాగా ఉంది. జయప్రకాష్ రెడ్డికి మంచి పాత్రే లభించింది. దొరికిన పాత్రకి అతను బాగనే న్యాయం చేసాడు. ఈ సినిమాలో ఇంకొక పాత్ర గురించి చెప్పుకోవాలి, అది ఎవరంటే "రాం జగన్". సినిమా అంతా ప్రముఖ తెలుగు నాయకుల వేషాలు వేసుకుని కథని నడిపించడంలో బాగా సాయపడతాడు. టైటిల్స్ లో కూడా తెలుగు ప్రముఖుల గురించి ప్రస్తావించడం ముచ్చటగా ఉంది. హీరోయిన్ గా సాదా దోస లాగుండే భావనని ఎందుకు తీసుకున్నారని అనిపించింది మొదట్లో. కొంచెం ఆక్టింగ్ చెయ్యాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈమెని తీసుకోవల్సి వచ్చిందని తరువాత తెలిసింది. చాలా మంది రివ్యూస్ లో భావన గురించి నెగటివ్ గా రాసారు, దీన్ని నేను విపరీతంగా ఖండిస్తున్నాను. ఈమెని ఇంతకు ముందు యాడ చూసానబ్బా? అని వెతికితే ఒంటరి సినిమాలో గోపీచంద్ తో పాటూ నటించిందని తెలిసింది. ఈ సినిమా చూసానో, లేదో నాకు గుర్తు రావడం లేదు. సినిమా రివ్యూ చదివినా ప్రస్తుతం గుర్తుకు రావడం లేదు. ఉత్తేజ్ కూడా ఫరవాలేదనిపించాడు.




నేను వెళ్ళేసరికి సినిమా కొంచెం మొదలయి టైటిల్స్ పడుతూ ఉన్నాయి. ఆ పాట లో తెలుగు ప్రముఖులని గుర్తు చేసుకోవడం బాగుంది. "కొంత మంది ఇంటి పేరు కాదురా గాంధి" పాట మనల్ని అలోచింపచేస్తుంది. కృష్ణవంశీ సినిమాలకి సిరివెన్నెల మంచి పాటలు రాస్తాడు. ఇంతకు ముందు చక్రం సినిమాలో "జగమంత కుటుంబం నాది" అని అద్భుతమయిన పాట రాసాడు. ఆ పాట రాసిన తరువాత సినిమా మొదలుపెట్టానని కృష్ణవంశీ చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఈ సినిమా కూడా "కొంతమంది ఇంటిపేరు కాదురా గాంధి" పాట చేతికి వచ్చినపుడు కథ మొదలుపెట్టాడేమో? ఈ సినిమా ఆడియోని గాంధి మనవడు తుషార్ గాంధి ఆవిష్కరించడం గమనార్హం. పై ఫోటోలో గాంధి విగ్రహం పక్కన శ్రీకాంత్ తో తుషార్ గాంధిని చూడగలరు. గాంధీ గారి ఆశయాలని గుర్తు చేయడానికి తీసిన ఈ సినిమాని తప్పక చూడండి.




ఇప్పటివరకు నా టపాలని చదివి నన్ను ప్రోత్సహించి కామెంట్లతో దీవించిన మీకందరికీ నా వందనములు. టపా రాయగానే చదువుతూ ఉండే మిత్రులు విష్ణు కోటమరెడ్డి, చంద్ర శేఖర్ గ్రంధి, రాం ప్రసాద్ పిళ్ళారిశెట్టి, అనిల్ కూరపాటి, సుబ్బారావు కొత్తమసు, "బాగా రాస్తున్నారు " అంటున్న మూర్తి బొబ్బిలి, తెలుగు చదలేకపోయినా ప్రయత్నించే జయరాజు కృస్ణం రాజు, వెంకట ప్రసాద్, జగన్ రెడ్డి, చెన్నై నుండి చదివే ప్రత్యేక మిత్రుడు దంపేటి కళ్యాణ్, సూళ్ళూరుపేట నుండి చదివే పెమ్మారెడ్డి త్రిలోక్ చంద్రారెడ్డి, "ఈ మధ్య చాలా పెద్దవిగా రాస్తున్నారండీ" అనే సత్య తిరుమలశెట్టి, శ్రీనివాస్ బోధనపాటి, రెడ్డివారి రమణ, కుమార్, "శీనూ, ఏమిటి నువ్వు రాసావా ఇదంతా?" అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచిన కదిరి ప్రసాద్, అల్లాబక్ష్ కి నా బ్లాగుని ప్రోత్సహిస్తున్న తోటి బ్లాగరు "గాలి బాబు" గణేష్ కి నా వందనములు. నా ప్రతి టపా చదివి ప్రోత్సహిస్తున్న పెద్ద బావకి, చిన్న బావకి వందనములు. రాసిన ప్రతి సారీ నా టపా గురించి వినే పూలబ్బాయిలకి వందనం! వంద టపాల నా ప్రయాణంలో నాకు సహకరించి, ప్రోత్సహించిన బ్లాగర్లు కొత్తపాళీ గారికి, సాదు డ్రీంస్ బ్లాగరు ప్రసాద్ గారికి నా ప్రత్యేక వందనములు.



18 comments:

Bhãskar Rãmarãju said...

శతపోస్టుల సంబరం!!!భేష్!! అభినందనలు...

శ్రీ said...

థాంక్స్ భాస్కర్ గారు.

Anonymous said...

బాసూ సెబాసూ.

-- విహారి
http://blog.vihaari.net

జ్యోతి said...

శతటపోత్సవ శుభాకాంక్షలు శ్రీ..

మేధ said...

Congrats for the 100th post...

ravi pydi said...

దీపావళి శుభాకాంక్షలు, అలాగే 100వ టపాకి శుభాకాంక్షలు, శ్రీకాంత్, క్రిష్నారెడ్డి సినిమాలొ అర్జునుడు గా గెటప్ బాగ ఉనింది, అన్ని పాత్రలకు సరిపొతాడు అనిపించింది

శ్రీ said...

@విహారి,జ్యోతి,మేథ,మామయ్యకి నెనర్లు!

మాలా కుమార్ said...

మీ వందవ టపాకు అభినందనలు .
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .

Prasad Samantapudi said...

వంద టపాలు పూర్తి చేసినందుకు అభినందనలు.

వంద టపాలు పూర్తిచేయాలంటే బుర్రలో ఆలోచనలతో పాటుగా కొంచెం జబ్బపుష్టి కూడా ఉండాలి. రాసినది చదవడానికి పాఠకులూ ఉండాలి. ఇవన్నీ వందశాతం మీకున్నాయి.

కొత్త రచనల కోసం వస్తువు ఎంపికలో మునుపటి స్వేచ్ఛతో బాటుగా కొత్త భాధ్యత కూడా మీలో నేనూహిస్తున్న మార్పు.

మరోసారి అభినందనలు.

శ్రీ said...

నెనర్లు మాలాకుమార్. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

@ ప్రసాద్, నెనర్లు. తప్పక కృషి చేస్తాను.

పరిమళం said...

శత టపోత్సవ శుభాకాంక్షలు !అలాగే నావందవటపా గురించి ప్రస్తావించినందుకు కృతఙ్ఞతలు . మహాత్మ సినిమా నేనూ చూశాను టైటిల్ కి పూర్తి న్యాయం జరగలేదేమో అని నా ఉద్దేశ్యం( నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే !అన్యదా భావించొద్దని మనవి ) సినిమాకి టైటిల్స్ ...జగన్ గాంధీ వేషధారణతో పాడే పాట హైలెట్ . మీ రివ్యు బావుంది ఎప్పటిలాగే ...దీపావళి శుభాకాంక్షలు.

శ్రీ said...

పరిమళం గారికి నెనర్లు. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు!

మురళి said...

వంద టపాలు పూర్తి చేసినందుకు అభినందనలు.. మీ బ్లాగులో నేను తప్పక చదివే సినిమా రివ్యూనే మీ వందో టపా కావడం యాదృచ్చికం కాదన్న మాట... బ్లాగింగ్ ఇలాగే కొనసాగించండి...

రవి said...

మీ టపాలు రెగ్యులర్ గా చదివే వాళ్ళలో నేనొకణ్ణి. ఎందుకంటే, అవి కత్తి, కసక్కు అని అనవసర మాటలు చెప్పను, అయితే, సింపుల్ గా, నేను రాయాలనుకునేలా ఉంటాయి.

keep going మాస్టారు.

అన్నట్టు, post a comment లంకె, వెనుక రంగుతో కలిసి, దాగుడుమూతలు ఆడుతూంది. ఓ కంట కనిపెట్టి, బయటకు లాక్కురండి.

శ్రీ said...

@ మురళి, నెనర్లు. తప్పకుండా బ్లాగుతూ ఉంటాను

@ రవి, రవి, మీ ప్రోత్సాహానికి నెనర్లు.

కామెంటు పని చూస్తాను.

కొత్త పాళీ said...

అర్రె, అర్రెరె ఇదెట్ట మిస్సయ్యాను. చిన్నప్పటి మిత్రులతోసైతం చదివించ గలుగుతున్నారంటే మీ రచనల్లో వుంది ఆ విశేషం. అభినందనలు.

శ్రీ said...

థాంక్స్ కొత్తపాళీ గారు

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

అబ్బా దీనికి కామెమ్టు మిస్సయ్యానబ్బా. అభినందనలన్నోయ్. ఇంతకీ ప్రయాణం ఎలాసాగింది? అన్నట్టొ ఆసూళ్ళూరుపేటాయనకీ, చెన్నయ్యాయనకి, మొగతా రెడ్లకి నాబ్లాగుగురించి చెప్పొచ్చుగా. జస్ట్ కిడ్డీంగ్.