Sunday, January 17, 2010

2009 లోని 10 అత్యుత్తమ బ్లాగులు


గత నెలలో ఆంధ్రలేఖ నిర్వహించిన ఉత్తమ బ్లాగు పోటీలలో నా బ్లాగు కూడా ఉండడం ఆశ్చర్యకరం,సంతోషకరం! నా బ్లాగుని ఉత్తమ బ్లాగుగా గుర్తించిన ఆంధ్రలేఖ గారికి బ్లాగు ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పండగ పూట ఏమిటో మంచి వార్త చెప్పి నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళారు. ఇంకొక సంతోషకరమైన విషయం ఏమిటంటే మా ఆఫీసులో క్రికెట్ లీగ్ కి నన్నుప్రెసిడెంటుగా నామినేట్ చెయ్యడం. ఇప్పటికే అందరికీ ఫోన్ చేసి చెప్పేసా, ఇపుడే మీ అందరికీ చెప్తున్నా. హమ్మయ్య.. ఇపుడు కొంచెం హాయిగా ఉంది.


మీరందరూ సంక్రాంతికి విడుదల అయిన సినిమాలన్నీచూసారనుకుంటాను. నేనైతే అదుర్స్, నమో వెంకటేశ సినిమాలు చూసేసాను. శంభో శివ శంభో తమిళ్ వర్షన్ మొన్న విమానంలో చూసాను. నేను చూస్తున్న తమిళ్ సినిమా చూసి నా పక్కన కూర్చున్న పటేల్ నన్ను కిందా,మీదా చూసింది ఒకసారి. ఆ సినిమా అలా ఉంది ఏం చేస్తాం! విపరీతమయిన ఏడుపు గొట్టు సన్నివేశాలు ఎందుకు తీస్తారో? ఇటువంటి సినిమాలు తమిళ్లో మామూలే, తెరమీద ఏడుస్తూ ఉంటే మనం చప్పట్లు కోడతామనమాట! కాకపోతే తెలుగులో ఏడుపులు తగ్గించారని విన్నాను.


మీరు కూడా వీలు చేసుకుని ఆంధ్రలేఖ డాట్ కాం కి వెళ్లి నా బ్లాగుకి వోటెయ్యండి.

7 comments:

Vasu said...

అభినందనలు.

ఇక సినిమా అంటారా. తమిళ్ నేటివిటీ అంటే అదేనేమో :)

శ్రీ said...

థాంక్స్ వాసు

రవి said...

అభినందనలు. నేనూ అదుర్స్, నమో వెంకటేశా చూశాను. నమో.. బాగా నచ్చేసింది. శంభో లాంటి సినిమాలు మన వంటికి పడవులెండి.

పరిమళం said...

అభినందనలండీ.....నేనూ అదుర్స్ చూశాను శంభో శివ శంభో కుడా చూశాను ...సినిమా ఎలా ఉన్నా అభినయ ( రవితేజ చెల్లెలు ) గురించి తెలిసి చూద్దామని వెళ్ళా ....

చైతన్య.ఎస్ said...

అభినందనలు

శ్రీ said...

@రవి, నెనర్లు.

@పరిమళం, నెనర్లు. రవితేజ చెల్లెలు ఈ సినిమాలో ఉందా? అయితే నేనూ ఒకసారి చూడాలి.

@చైతన్య, నెనర్లు

Anonymous said...

అడిదం అప్పారావు శాస్త్రి గురించి వాడి నీతి మాలిన బ్రతుకు గురించి క్రింది లింక్ లో చూడండి.

http://telugusimha.blogspot.com/