శ్రీ వెంపటి చినసత్యం గారి శిష్యుడయిన శ్రీ హరిరామమూర్తి గారి నృత్య బృందం ఉత్తర అమెరికాలో మోహినీ భస్మాసుర నృత్య రూపకాన్ని ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా డెట్రాయిట్లో నిన్న సాయంత్రం ప్రీమియర్ షో జరిగింది. ఈరోజు మిషిగన్ కాపిటల్ అయిన లాన్సింగ్లో ప్రదర్శించనున్నారు. తరువాత షికాగో, పిట్స్ బర్గ్ ఇంకా వర్జీనియాలో ఈ నృత్య రూపకం ప్రదర్శిస్తారు. హరి మూర్తిగారితో పాటు సంధ్య ఆత్మకూరి శిష్య బృందం కలిపి ఇంచుమించు ఒక ఇరవైమందితో నృత్య రూపకం సందడిగా జరిగింది.
ఈ నృత్య రూపకానికి తెరలు మార్చడంలో నేను సహాయం చేయడం వలన స్టేజి పక్కన నిల్చుని కొత్తపాళీగారితో కలిసి నాట్యాన్ని తిలకించాను. నాటకానికి అవసరమయినట్టు తెరలు దించడంలో యువ కళాకారుడు సుబ్బరాజు మాకు సహాయం చేసాడు. తెరలని కిందకీ, పైకి పంపడం ఇంకా సౌండ్ పెంచడం, తగ్గించడంలో మాకు సరదాగా సాగింది. హరిరామమూర్తి గారు నాట్యం చేస్తున్నంతసేపు తెరల పక్కనుండి తోటి బాల కళాకారులు చాలా ఆసక్తిగా చూస్తూ, వీలయితే నాట్యం కూడా చేస్తూ ఉండడం నాకు బాగా నచ్చింది. ఒక సన్నివేశంలో భస్మాసురుడు (హరి గారు) శివుడి తలపై చెయ్యి పెట్టడానికి ప్రయత్నిస్తూ తరుముకుంటాడు. ఆ ఇద్దరూ ఒకరినొకరు తరుముకుంటూ హఠాత్తుగా తెరల చాటున్న మా మీదకు దూసుకు వచ్చారు. ఈ సన్నివేశం చాలా సహజంగా అనిపించింది.
నాటకం విజయవంతంగా ముగిసి కళాకారులతో వీడియోలు అయ్యాక కొత్తపాళీగారితో కలిసి ఉడిపి హోటల్ లో భోంచేసాం. నాటకాన్ని చూడడానికి మా వూరికి ఒక ప్రత్యేక అతిధి నిడదవోలు మాలతి గారు వచ్చారు. మాలతి గారితో సరదాగా కబుర్లాడుతూ సాయంత్రాన్ని సరదాగా గడిపేసాం. ఇంకో విశేషం ఏమిటంటే ఈరోజు మాలతి గారి పుట్టినరోజు. ఒక రోజు ముందే అంతే నిన్న మాలతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేసాం. మళ్ళీ ఈరోజు బ్లాగ్ముఖంగా మాలతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
నృత్య రూపకం ముగిసిన తర్వాత అతిథులతో కళాకారుల బృందాన్ని ఇక్కడ చూడండి. కొత్తపాళీగారిని ఈ వీడియో చూడచ్చు. కొత్తపాళీగారు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా ?
హరిరామమూర్తి గారితో నా వీడియో/ఫోటో చూడండి.
కూచిపూడి కళాకారుడు సుబ్బరాజుతో నేను. అద్భుతంగా నాట్యం చేయడమే కాకుండా తెర వెనుక చాలా పనులని సుబ్బరాజే సమర్ధంగా నిర్వహించాడు.
ఫోటోలు దిగుతున్న నాట్య కళాకారులు - 1
ఫోటోలు దిగుతున్న నాట్య కళాకారులు - 2
ముందున్న తాడుని కిందకి లాగితే తెర కిందకి దిగుతుంది. వెనక తాడుని కిందకి లాగితే తెర పైకి వెళ్తుంది.
6 comments:
నాక్కూడా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండీ. మోహినీ భస్మాసుర నృత్యనాటకం విజయవంతం కావడంలో మీ పాత్రకి అభినందనలు. నాకు చాలా ఆనందంగా గడిచింది ఆ సాయంత్రం. మీ విడియోలు కూడా బాగున్నాయి.
నెనర్లు మాలతి గారు.
మాలతి గారికి జన్మదిన శుభాకాంక్షలు..
మోహిని ఎవరన్నది ఇంకా సస్పెన్సేనా అండీ??
సంధ్య ఆత్మకూరి గారు, డెట్రాయిట్లో పిల్లలకి సంప్రదాయ నాట్యం నేర్పిస్తుంటారు.
శ్రీ, సెట్టింగుల భారం మీ భుజస్కంధాలమీద మోపినందుకు, కడు సామర్ధ్యంతో నిర్వహించారు. Thank you. It is always fun working with you. Wish more people came.
మురళి, మోహినిగా సంధ్యగారు నటించారు.
My pleasure Kottapaali gaaru.
Post a Comment