Tuesday, June 28, 2011

నాకు తెలిసిన ఒక సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణము





నాకు తెలిసిన, బాగా పరిచయం ఉన్న ఒక స్నేహితుని గురించి ఈరోజు మీకు చెప్తాను. నేను కేరళలో ఉన్న రోజుల్లో నాకు రాజు పరిచయం జరిగింది. అక్కడ నుండి ఇద్దరం మద్రాసులో కలిసి పనిచేసాము. టీ నగర్ బస్టాండ్ కి ఆనుకుని ఉన్న మాన్షన్ లో ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం.  రాజుకి భక్తి చాలా ఎక్కువ. నాకు తెలిసినప్పటి నుండి ప్రతి రోజు తెల్లవారు జామున ధ్యానం చేసావాడు.  ఆఫీసులో అందరికీ రాజు మీద గౌరవం ఉండేది. మాకంటే కొంచెం పెద్దవాడు కావడం ఒకటి, ఇక అతని భక్తి చూసి మిగత వాళ్ళకి కొంచెం భయం కూడా ఉండేది.  


మద్రాస్ నుండి ఇద్దరం అమెరికాకి ఎగిరి వచ్చాం. ఇక్కడ ఎపుడూ కలిసి పని చేయలేదు కానీ, ఒకరి గురించి ఒకరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళ ఊరికి నేను, మా వూరికి అతను వస్తూ, పోతూ ఉండేవాళ్ళం. ఇక్కడకి వచ్చాక కూడా అతని భక్తి, ధ్యానం పెరుగుతూనే వచ్చాయి. ప్రాణిక్ హీలింగ్ గురించి నాకు అపుడపుడూ చెపుతూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయాడు. ఎపుడో మొదలు పెట్టిన అతని ఆధ్యాత్మిక ప్రయాణం తిరిగి వెళ్ళాక వేగాన్ని పుంజుకుంది. 


నేను కాలాస్త్రికి వెళ్ళినపుడు వీలయినంతవరకు రాజుని కలుస్తూ ఉండేవాడిని. అతని ప్రయాణం గురించి చెప్తూ ఉండేవాడు. వింతగా, సంతోషంగా, ఆశ్చర్యంగా ఉండేది. మొన్న ఫిబ్రవరిలో కలిసినపుడు అతని అనుభవాలని అందరితో పంచుకోవడానికి ఒక బ్లాగు మొదలుపెడుతున్నట్టు చెప్పాడు. అతని బ్లాగుని ఇక్కడ చూడచ్చు. ప్రస్తుతానికి ఈ బ్లాగు ఆంగ్లంలో ఉంది. తెలుగులో కూడా బ్లాగు మొదలుపెట్టాడు, త్వరలోనే అక్కడ నుండి కూడా టపాలు రావడం మొదలవ్వచ్చు. అతనితో మాట్లాడినపుడు కొన్ని మాత్రమే తెలిసాయి, ఇపుడు బ్లాగులో చూస్తుంటే అంతులేని ఆధ్యాత్మిక సమాచారం ఉంది. శివ యోగా గురించి చాలానే రాసాడు. మా ఆవిడ కూడా శివయోగ బాగా ఫాలో అవుతుంది. ఆధ్యాత్మిక దిశలో వెళ్ళాలనుకునే వారికి, వెళ్తున్న వారికి, వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ బ్లాగు ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. 

4 comments:

Afsar said...

శ్రీ;

ఇది మంచి పోస్టు.

కానీ, ఆ బ్లాగు లింకు ఇవ్వలేదు. దయచేసి ఇవ్వండి.

శ్రీ said...

థాంక్స్ అఫ్సర్ గారు.

సారీ, మీకు లింక్ దొరికినట్టులేదు, ఇదుగోండి.

http://sadhakspiritualjourney.blogspot.com/

Disp Name said...

Unfortunately the readability of the blog design is so poor. please tell your friend to change the font and make it more readable. For a spiritual content a dark colored design is really showing negative feeling

regards
Zilebi

శ్రీ said...

అలాగే జిలేబి. నేను మా స్నేహితునికి మీ అభిప్రాయం చెప్తాను.

మీ కామెంటుకు నెనర్లు.