Monday, December 17, 2007

ఇదుగో...పూలబ్బాయి వచ్చాడు.

నిద్ర నుండి లేవడానికి ఇంకొక పది నిముషాలు ఉంది. హమ్మయ్య.. అనుకుని దుప్పటి పైకి లాక్కున్న. రాత్రి నుండీ నిద్ర పోవడం ఒక ఎత్తు, ఈ పది నిముషాలు ముసుగుతన్ని పడుకోవడం ఇంకొక ఎత్తు!
గడియారం ఇక తప్పదన్నట్టు మోగింది, నన్ను నిద్ర లేపింది. నేను అప్పుల అప్పారావు కాకపోయినా "అప్పు..ఢే తెల్లారిందా?" అని చివరాకరిసారి మనసార ఆవలించి లేచా. కాలకృత్యాలు తీర్చుకుని బట్టలు వేసుకుని ఇక టిఫిన్ తినడానికి తయారయ్యా! తిని కాఫీ తాగుతూ ఈనాడు తిరగేస్తూ కూర్చున్నా.

అపుడు విన్పించింది మా ఆవిడ పిలుపు "ఇదుగో...పూలబ్బాయి వచ్చాడు"..అని. తల
తిప్పి చూస్తే బయట నా కోసం నిరీక్షిస్తూ శేఖర్ కనిపించాడు. మా ఆవిడకి బై చెప్పి శేఖర్ పక్కన కూర్చోగానే కారు ముందుకి ఉరికింది.
పెరుగుతున్న పెట్రోలు ధరలకి ప్రత్యామ్నాయంగా ప్రతి రోజూ విడిగా వెళ్ళే కన్నాకలిసి వెళ్తే నాకూ, ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని నా గట్టి అభిప్రాయం! నా అభిప్రాయాంతో ఏకీభవించిన కారు పూలబ్బాయి రోడ్ మీద ద్రిష్టి సాగించి ఉరుకుతుండగా నేను చిన్నగా కునుకులోకి జారుకున్నా!

8 comments:

teresa said...

హహ! భలే పూలబ్బాయి పొద్దున్నే! బావుంది,short&sweet.

రాధిక said...

పూలబ్బాయి????

శ్రీ said...

పూలబ్బయి అంటే కారు పూల్ చేసె అబ్బాయి.

Anonymous said...

కొత్త ప్రయోగం బావుంది! వారాలబ్బాయి లాగా పూలబ్బాయి. :- ) పెట్రోలు వాడకం తగ్గించాలన్న మీ ఆలోచనా బావుంది.

Prasad Samantapudi said...

మీ రచన బావుంది. నిద్ర మత్తు వదిలినట్టు లేదు.మరీ క్లుప్తంగా రాసారు. :-)

మరిన్ని పూలబ్బాయి అనుభవాలు రాయండి.

కొత్త పాళీ said...

kisukku

నిషిగంధ said...

:)))
పూలోళ్ళు దొరికితే ఇదో లాభం, చక్కగా ఓ కునుకేయచ్చు :-)

mohanraokotari said...

rachanaa saili baagundi marinni raayandi,,,