Thursday, May 22, 2008

బుజ్జిగాడు - వీడు చెన్నైలో తయారయ్యాడు


ప్రభాస్ , పూరీ కలయికలో బుజ్జిగాడు తయారయ్యి నిన్ననే విడుదల అయింది. ప్రభాస్ కి ఇంతకూ ముందు ఛత్రపతి తప్పితే హిట్స్ లేవు. తరువాత వచ్చిన పౌర్ణమి, మున్నా రెండూ పోయాయి. పూరీ మాత్రం పోకిరి తర్వాత దేశముదురు ఒక మాదిరిగా హిట్ అయింది, చిరుతని కుడా పరవాలేదు అన్న టాక్ వచ్చింది. ఇటువంటి తరుణంలొ తెలుగు ప్రేక్షకులు వీళ్ళిద్దరి కాంబో గురించి బాగానే మాట్లాడుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే, సినిమా గురించి మట్లాడుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. పూరీ యధాతధంగా విలన్ల మద్య పరుగులు, తుపాకీలతో కాల్చుకోవడం, కత్తులతో పొడుచుకోవడం బాగా చూపించాడు. సగం సినిమా అయిపొయాక ఇవి చాలా రొటీన్ గా జరుగుతూ ఉంటాయి. ఈ సినిమా రిలీజ్ కాకముందు ప్రభాస్ వీక్ పాయింటు ఏందబ్బా అని చర్చ జరిగినపుడు చాలా మంది అతని డైలాగ్ డెలివరీనే అని ఏకగ్రీవంగా తేల్చారు. పూరీ బాబాయి కుడా ఇదే తేల్చినట్టున్నాడు, అందుకే ప్రభాస్ చేత గోదావరి యాస లో చెప్పించాడు. ఇదొక్కటే సినిమాలో బాగా పండింది. ఇక త్రిష నాకయితే బోరు కొట్టేసింది, రెండో హీరోయిన్ బాగా నచ్చింది నాకు. ఆమెకి ఇంకొంచెం పెర్ఫామన్సె ఉండే పాత్ర ఇచ్చి ఉంటే బాగా తోమి ఉండేదని నాకు ఎందుకో అనిపించింది. మోహన్ బాబు ని మాత్రం "ఇంట్లో ఉండి ఏమి చేస్తావ్? ఇలా షూటింగ్ కి రాకపొయావా?" అని పూరీ అడిగినట్టున్నాడు. సందీప్ చౌతా కి మంచి ఆడియో కాసెట్లు దొరికినట్టులేవు, సినిమాలో సంగీతం అంత బాగ అనిపించలేదు. కాసెట్లన్ని మణిశర్మ, దేవి ప్రసాద్ రెంట్ చేసినట్టున్నారు, సందీప్ అంతర్జాలంలో వెతికినా మంచి ట్యూన్స్ దొరికేవేమో? సినిమాలో పాటలు బాగున్నా నాలాంటి వాళ్ళు రెండు సార్లన్నా చూసి ఉండేవాళ్ళు.

3 comments:

రామ said...

చెప్పాల్సిన విషయం కరెక్టు గా చెప్పేశారు! (ముఖ్యం గా మోహన బాబు గురించి). శుభం.

Kathi Mahesh Kumar said...

హమ్మయ్యా...దూలతీరింది. ఇంకానయం బెంగళూరులో కనీసం 200 రూపాయలు పెట్టి ఈ సినిమా చూద్దామనే ధైర్యం చెయ్యడానికి సిద్దమైపోయా. ఇక ఈ సినిమా ఉన్న ధియెటర్ దగ్గరికెల్తే ఒట్టు.

శ్రీ said...

మంచి పని చేసారు.