Thursday, May 29, 2008

శాన్ ఆంటోనియో లో స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు


ఎన్నారై టీడీపీ కో-ఆర్డినేటర్ కోమటి జయరాం, నాదెళ్ళ గంగాధర్ గారి ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య వైభవంగా శాన్ ఆంటోనియో, టెక్సాస్ లో జరిగాయి. ఈ వేడుకలకి అమెరికాలో విజయవంతంగా ప్రదర్శింపపడుతున్న 'కంత్రి' సినిమా వేదిక కావడం విశేషం! ఈ సందర్భంగా సినిమాకి విచ్చేసిన వారందరికి ఎన్నారై టీడీపీ పార్టీ తరపున రాజా సూరపనేని కేక్ మరియు ఎంటీఆర్ టీ షర్ట్స్ పంచిపెట్టారు. " ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపొయే అదృష్టం మహా నటుడు స్వర్గీయ ఎంటీఆర్ కే దక్కింది. అలాగే తెలుగు వాడి సత్తా దేశమంతటా చాటి చెప్పిన ఘనత మన నందమూరిదే!" అని రాజా సూరపనేని అన్నారు. శాన్ ఆంటోనియో పురప్రముఖులు మరియు ఎన్నారై టీడీపీ సభ్యులు అయిన ఫణి అట్లూరి, రాం వెనిగళ్ళ, సరోవర్ వెంకటరెడ్డి, రూప్ చంద్, తరుణ్ చెరుకూరి, నరేష్ రామిరెడ్డి, రవికాంత్ సజ్జా, వినోద్ తదితరులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జన్మదిన నివాళులు అర్పించారు.

No comments: