Tuesday, July 29, 2008

బ్లాగు లేని వాడవని దిగులు చెందరాఆత్మ బంధువు సినిమా లోని "చదువు రాని వాడవని దిగులు చెందకు" పాటకు పేరడీ.ఈ పేరడీ పాట తెలుగువాళ్ళని బ్లాగులు రాయమని ప్రొత్సహిస్తుందని నా చిన్ని ఆశ!
*******************************

బ్లాగు లేని వాడవని దిగులు చెందరా!
బ్లాగు లేని వాడవని దిగులు చెందరా!!
తెలుగువాడివీ, బ్లాగులో సుఖం ఉందిరా!!!


బ్లాగు లేని వాడవని దిగులు చెందరా!
తెలుగువాడివీ, బ్లాగులో సుఖం ఉందిరా!!
బ్లాగు లేని వాడవని దిగులు చెందరా!! !


మంచువంటీ....మల్లెవంటీ....
మంచువంటి,మల్లెవంటి మంచి టపాలతో....
మంచువంటి,మల్లెవంటి మంచి టపాలతో తెలుగువారిని జగతిలో పులకరించరా!

బ్లాగు లేని వాడవని దిగులు చెందరా!
తెలుగువాడివీ, బ్లాగులో సుఖం ఉందిరా!!
బ్లాగు లేని వాడవని దిగులు చెందరా!! !

ఏమి బ్లాగి బ్లాగరు చాలా హిట్లు పొందెనూ?
ఏ బ్లాగు వల్ల రీడర్ కి గిలిగింత కలిగెనూ?
ఏమి బ్లాగి బ్లాగరు చాలా హిట్లు పొందెనూ?
ఏ బ్లాగు వల్ల రీడర్ కి గిలిగింత కలిగెనూ?


తెలుగులోన బ్లాగరికందరు రాత నేర్పెనూ!
తెలుగులోన బ్లాగరికందరు రాత నేర్పెనూ!!
తెలుగులోన బ్లాగరికందరు పాట నేర్పెనూ!!!


బ్లాగు లేని వాడవని దిగులు చెందరా!
తెలుగువాడివీ, బ్లాగులో సుఖం ఉందిరా!!

బ్లాగు లేని వాడవని దిగులు చెందరా!! !


బాగ రాసిన బ్లాగును పొగుడును "ఓహో" అని!
అది చూచిన చంటి బ్లాగరు అరుచును "ఆహా" అని!!
బాగ రాసిన బ్లాగును పొగుడును "ఓహో" అని!
అది చూచిన చంటి బ్లాగరు అరుచును "ఆహా" అని!!


తెలుగొచ్చీ పని ఏమీ? మంచి బ్లాగు ఉన్న చాలు!
తెలుగొచ్చీ పని ఏమీ? మంచి బ్లాగు ఉన్న చాలు!!
ఊసుపోక సొల్లు కన్న ఒక్క తెలుగు బ్లాగు మేలూ!!!

బ్లాగు లేని వాడవని దిగులు చెందరా!
తెలుగువాడివీ, బ్లాగులో సుఖం ఉందిరా!!

బ్లాగు లేని వాడవని దిగులు చెందరా!!!


తెలుగు ప్రజలారా!తెలుగు లో రాయండి!తెలుగులో మాట్లాడండి!!

అలాగే బ్లాగులు చదవండీ,రాయండీ మరియూ రాపించండీ!


గమనిక: ఈ టపాలో "మెగాస్టార్ చిరంజీవి" చాయాచిత్రాన్ని ఒక బ్లాగు లేని తెలుగువాడికి మోడల్ గా వాడుకోవడం జరిగింది.అంతే కాని మెగాస్టార్ ని ఉద్దేశించి కాదని తెలివయిన బ్లాగర్లు గమనించగలరు!జై చిరంజీవ!!

11 comments:

కొత్త పాళీ said...

పేరడీలు అదరగొడుతున్నారుగా? :)

ఊసుపోక సొల్లు కన్న ఒక్క తెలుగు బ్లాగు "మేలూ"!!!
అంటే బావుంటుందేమో?

అన్నట్టు నాకోసారి మెయిల్ చెయ్యండి.
kottapali at gmail dot com

Purnima said...

too good :-)

శ్రీ said...

"మేలు" అనడం చాలా బాగుంది! మంచి సూచన కొత్తపాళీ గారు!ఇక అదరగొట్టడం అంటారా? అంతా మీ అభిమానం!

నెనర్లు పూర్ణిమ గారు.

శ్రీ said...

కొత్తపాళీ గారి సూచన మేరకు టపా సవరించబడినది! మంచి సూచన చేసినందుకు కొత్తపాళీ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

కనిత చాలా బావుంది. Fun is the sign of youth.

రాపించండి = రాపిడి గుర్తొస్తోంది.
"రాయించండి" అంటే బావుంటుందేమో ఆలోచించగలరు.
అదే మీ మాండలికమైతే సరే !

రవి said...

ఆ పక్కన చిరు బొమ్మ చూసి చచ్చేంత నవ్వొచ్చింది...

శ్రీ said...

నెనర్లు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు!
రాపించండి, రాపియ్యండి ఇవన్నీ మా సీమ మాండలికం అనుకుంటా!ముందుగా నా నోటికి వచ్చిన మాటలు,వీటినే మాండలికం అంటారేమో కదా!


రవి గారికి,పాట రాసిన తరువాత ఫొటో కోసం అంతర్జాలంలో వెతికా.ఆత్మ బంధువులో రామారావు గారి లాగా దిగులుగా ఎవరు దొరుకుతారా అని చూస్తే మన "చిరు" గడపలో కూర్చుని కనిపించాడు!నాకు కుడా చిరు దొరకగానే మంచి సరదాగ అనిపించింది!మీకు కుడా గిలిగింతలు కలిగించింది అని విని సంతోషించాను!

మీనాక్షి said...

బా రాసారు..:)

శ్రీ said...

నెనర్లు మీనాక్షి గారు.

చైతన్య said...

బాగుంది మీ పేరడీ.

శ్రీ said...

నెనర్లు చైతన్య.