Wednesday, August 13, 2008

అందమా!నీ చిరునామా ఎక్కడ?





బీజింగ్ ఒలింపిక్స్ మొదటి రోజు వేడుకల సందర్భంగా చైనీయులు సంబరాలని అంబరం తాకేలా చేసారు.స్టేడియం లోకి చైనా జాతీయపతాకం తీసుకువస్తుండగా ఎర్రటి దుస్తులు ధరించిన అందమయిన అమ్మాయి పాడిన పాట మీరందరూ చూసే/వినే ఉంటారు.ఈ 9 సంవత్సరాల వయసున్న అమ్మాయి పేరు "లిన్ మియోకె".ఈ సంబరాలని నిర్వహించిన సంగీత దర్శకుడు నిన్న ఒక ఇంటర్వ్యూలో "పాట పాడింది ఈ అమ్మాయి కాదు" అని అసలు విషయం చెప్పుకొచ్చాడు.ఈ సంబరాల సందర్భంగా పెట్టిన పాటల పోటీలో "యాంగ్ పేయ్" విజేతగా నిలిచినా ఆ అమ్మాయి "తొర్రి పళ్ళు" కారణంగా కెమెరా ముందుకు రాలేకపొయింది. చివరి నిముషంలో రిహార్సల్స్ చూస్తున్న చైనీస్ పొలిట్ బ్యూరో సభ్యుడు యాంగ్ పేయ్ బాగా పాడింది కానీ కెమెరా ముందు అందంగా ఉండదు అని నిర్ణయం తీసుకోవడం దీనికి కారణం.



అసలు అందమంటే ఏమిటి?బయటికి కనిపించే తళుకు బెళుకులే అందమా?అందమనేది బయటకి కనిపించే భౌతిక స్వరూపం కాదు,మనం చేసే పనుల వల్ల,గుణం వల్ల మాత్రమే మనం అందంగా కనిపిస్తాం!తీయగా పాడే కోయిల నల్లగా ఉంటుంది! కానీ అది తన తీయని గొంతుతో పాడుతూ ఉంటే మనకి వినడానికి చాలా హాయిగా ఉంటుంది,చూడడానికి సుందరంగా ఉంటుంది.


ఇదేమీ సినిమా కాదుగా,వెనక బాలసుబ్రహ్మణ్యం పాడుతుంటే ముందు బాలకృష్ణ పెదాలు కదిలించడానికి?యాంగ్ చేత పాడించి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం!

7 comments:

Anonymous said...

im your favorite reader here!

MURALI said...

దేశమేదైనా మానవజాతి ఆలోచనే అంత ఏం చెస్తం లెండి.

సుజాత వేల్పూరి said...

ఒలింపిక్స్ ఒక పబ్లిక్ వ్యవహారం కాబట్టి, ఎంత హంగుంటే అంత ఆర్భాటం. అయినా ఒక పసిపిల్ల లో కూడా అందం కోసం వెదికారంటే ఏమనాలో అర్థం కాలేదు. (పిల్లలు ఎలా ఉన్నా అత్యద్భుతం గా ఉంటారని నా అభిప్రాయం)అసలు ఆ యాంగ్ చేత పాడిస్తే, తొర్రిపళ్ళ వల్ల ఇంకా అందంగా కనపడేది.

మీనాక్షి said...

nenu meeto Ekibhavistaanu Sri gaaru..

శ్రీ said...

మానవజాతి ఎదుగుతున్న కొద్దీ బుద్ధి కుడా పెరిగితే బాగుండేది మురళి గారు.

అవును సుజాత గారు.యాంగ్ లో అమాయకపు నవ్వు ఉంది!అది గమనించలేకపోయారు నిర్వాహకులు.

నెనర్లు మీను గారు.

రాధిక said...

మరీ ఇంత దారుణమా?పాపం ఆ పసి మనసు ఎంత గాయపడి వుంటుందో?

శ్రీ said...

అవును రాధిక గారు.మనిషి అసలు సౌందర్యం గుర్తించే స్థాయికి నిర్వాహకులు ఎదగలేదు.