Wednesday, January 18, 2012

బిజినెస్ మాన్ - అబ్బో....సూపర్!



ఉదయం ఎండకి పవన్ కళ్యాణ్ బయటకి వచ్చాడు. పవన్ గొడవకి నాగ చైతన్య కూడా బయటకి వచ్చి "బాబాయ్, ఇంట్లో వాళ్ళు లేచారా?" అన్నాడు.

పవన్ కళ్యాణ్: నిన్న భోగి పండగ కదా అబయా! అందరూ లేచి స్నానం చేసారు, ఈరోజు సంక్రాంతి కదా! స్నానం చెయ్ బళ్ళా?

నాగ చైతన్య: నిన్న నన్ను పిలవకుండానే సినిమాకి దొబ్బిచ్చుకున్నావ్! నేనూ వచ్చి ఉండేవాడిని కదా! 


పవన్ కళ్యాణ్: నాకు టైము లేకుండినింది అబయా...ఒక్కసారి బయటపడి లగెత్తి సినిమా చూసేసా. మహేష్ ఒక్కడే విరగదీసి యాక్టింగ్ చేసాడు. నా సామిరంగా! డైలాగులు ఉన్నాయి, వింటుంటే బల్బులు పగిలిపోయాయి.

నాగ చైతన్య: అయితే ఈసారి ఆస్కార్ మనకేనంటావా?

పవన్ కళ్యాణ్: అంతే కదా! అసలు మన తెలుగు సినిమా హాలీవుడ్ ని ఎపుడో దాటేసింది. వాళ్ళు అసలు మనకి పోటీనే కాదెహే! సార్...వస్తారు పాటకి మహేష్ స్టెప్పులు ఉన్నాయీ...అసలు హాలీవుడ్ లో ఎవడూ అలాగ వెయ్యడం నేనింతవరకూ చూడలేదు.

నాగ చైతన్య: ఫైట్స్ ఎలా ఉన్నాయ్?

పవన్ కళ్యాణ్: భీభత్సం! మహేష్ కొట్టే దెబ్బలకి ఒక్కొక్కడు ఎక్కడో పడుతుంటారు!జాకీ చాన్, బ్రూస్ లీ కూడా ఎపుడూ ఇంతలా ఫైట్ చేసి ఉండరు!!

నాగ చైతన్య: పూరీ దర్శకత్వం ఎలా ఉంది బాబాయ్!

పవన్ కళ్యాణ్: అదిరింది! ఉపేంద్రకి ఈ సినిమా పిచ్చ,పిచ్చగా నచ్చేసిందట! నా నెక్స్ట్ సినిమా పూరీతోనే అని శపధం చేసాడట!

నాగ చైతన్య: కాజల్ ఎలా ఉంది బాబాయ్!

పవన్ కళ్యాణ్: కాజల్ కూడా చాలా బాగా చేసింది. అసలు ఇన్ని రోజులు ఆమెని కాలీవుడ్ కి పంపి చాలా తప్పు చేసాం. ఇక మన దగ్గరే ఉంచేసుకుంటాం.

నాగ చైతన్య: ఇంతకీ కథ ఏమిటి బాబాయ్!

పవన్ కళ్యాణ్: నీ ఎంకమ్మ! ఇదేమన్నా అరం, మళయాళం సినిమా అనుకున్నావా? కథ ఏందిరా నీ ...(బీప్..బీప్...బీప్)! 

నాగ చైతన్య: సారీ బాబాయ్! నిన్న రాత్రి తమిళ్ డీవీడీ ఒకటి చూసాను, అందుకే అనుకోకుండా కథ అనేసాను.

పవన్ కళ్యాణ్: మన తెలుగు సినిమా సూపర్ ఎహే! మనం ఎన్ని సినిమాలని కాపీ కొడుతున్నా ఒరిజినల్ కంటే మనవే బాగుంటున్నాయ్!! అసలు మనకే ఈ ఐడియాలు వచ్చేసి ఉండాలి, కాకపోతే అందరం ఎపుడూ బిజీగా ఉంటాం. మనం హాలీవుడ్ వాళ్ళ లాగా ఖాళీగా ఉండం కదా!

నాగ చైతన్య: అవును బాబాయ్! మన సినిమాలు ప్రపంచం ప్రతి మూలలో రిలీజ్ అవుతున్నాయ్. మనం సూపర్ బాబాయ్!

పవన్ కళ్యాణ్: అవునురా అబ్బాయ్! 

***

బావిలోకి బక్కెట్టు పడడం చూసి నాగ చైతన్య చెంగున ఎగిరి అందులోకి దూకాడు.

'టాటా బాబాయ్' అని బెక బెక భాషలో చెప్పి నాగ చైతన్య బయట పడ్డాడు.











5 comments:

thrill said...

HMMM..! BAVUNDI SUBBARAO GARU , BUT EE NAGACHAITANYA , PAWAN KALYAN 'BABAI' TWIST ENTI ?..

Sujata said...

Chi chetta sinima..

Mahesh Babu lost his mind. :D

:D :D What a story ??? ! Where is story ?!!

Narayanaswamy S. said...

brilliant as usual.
పనిల్ పనిగా ఓ నందమూరి మేనల్లుణ్ణిగూడా చేర్చి ఉంటే వృత్తం పూర్తయేది.

శశి కళ said...

sree...)))))))what a narration.

శ్రీ said...

@ థ్రిల్, థాంక్స్ బాబాయ్!

@ సుజాత గారూ, థాంక్ యూ!

@ కొత్తపాళీ గారూ, అవును సుమీ!

@శశికళ గారూ, థాంక్ యూ!