తెలుగు బ్లాగర్లందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!ఈరోజు మనకి ఈ స్వేచ్చా వాయువులు పీల్చగలుగుతున్నామంటే ఇది మన స్వాతంత్ర సమర వీరులు మనకి ఇచ్చిన వరం.ఈ సందర్భంగా ఆ సమర యోధూలకి నా నమస్కారాలు.స్వాతంత్ర్య సమరవీరుల స్పూర్తితో మన దేశాన్ని శాంతియుతంగా ముందుకు నడిపించాలని నేను యువతని కోరుతున్నాను.
కొద్ది రోజుల ముందే మనకి "స్వర్ణ పతాకం" సాధించి ఈ వేడుకలకి మరింత అందాన్ని కూర్చిన "అభినవ్ బింద్రా" కి కుడా నా అభినందనలు! అభినవ్ బీజింగ్ లో అడుగుపెట్టునఫుడు నుండి రాస్తున్న బ్లాగు మీరు చూసారా? వీలయితే మీ "అభినందనలు" తెలపండి అభినవ్ కి.
హర్యానా బాక్సర్ అఖిల్ కుమార్ కుడా పతకానికి చేరువలో ఉన్నాడు.ఇతను కుడా తన వంతు కృషి చేసి ఒక పతకాన్ని తెస్తే బాగుంటుంది.
ఈరోజు ఇంకొక విశేషం కుడా ఉంది,ఈ రోజుతో నా టపాల సంఖ్య "50" కి చేరుకుంది.ఇన్ని రోజులూ నన్ను ఆదరించిన తెలుగు బ్లాగర్లకివే నా ధన్యవాదాలు! మరిన్ని టపాలతో మీ ముందుకు వస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.మళ్ళీ మీరు నా బ్లాగులో కలిసేంతవరకు సెలవ్!
7 comments:
ఈ స్వేచ్ఛావాయువులు బ్రిటిషువాళ్ళ వరం. మనం మళ్ళీ దారిలోకి రావాలంటే ఈ దేశాన్ని ఎవరైనా ఆక్రమిస్తేనే !
స్వాతంత్ర్య సమరవీరుల స్పూర్తితో మన దేశాన్ని శాంతియుతంగా ముందుకు నడిపించాలని నేను యువతని కోరుతున్నాను."
కోపం తెచుకోవద్దు... మీ వరకు మీరు యువకుడిగా (లేక యువకుడిగా ఉన్నప్పుడు) ఏమి చేసారో చెప్పండి ముందు... ఇలా ముందుకి నడ్పించడంలో.. మిగతా వారు స్ఫూర్తి పొందుతారు కదా??
తాడేపల్లి గారు,మనం స్వేచ్చగా ఉంటేనే ప్రగతి సాధ్యం!ఇంకొకడు వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు అనేది గాలిలో దీపం పెట్టి "దేవుడా..నీదే భారం!" అన్నట్టుంది.
మీ ప్రశ్న అర్ధమయింది క్రిష్ణారావు గారు.
ప్రతి మనిషి తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహిస్తే దేశానికి అదే పెద్ద సేవ.యువత ఏ రంగంలో ఉన్నా వాళ్ళ పని వాళ్ళు సమర్ధంగా నిర్వహిస్తే చాలు,ఇదే నా సందేశం!
You got me wrong. మనం భారతీయుల్లా ఎప్పుడు ప్రవర్తిస్తామో చెప్పానంతే !
అర్ధమయింది.
నమస్కారం శ్రీ గారూ. నేను ఈమధ్యనే బ్లాగింగ్ మొదలెట్టాను. అందుకే నేను ఇంతవరకు మీ బ్లాగ్ చూసే అవకాసం రాలేదు. ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. వీలు దొరికినప్పుడు చదవడానికి ప్రయత్నిస్తాను.నేను ప్రస్తుతం లాన్సింగ్లో ఉంటున్నాను. ఇంతకుముందు ఫార్మింగ్టన్ లో ఉండేవాడిని.
నమస్కారం శ్రీనాధ్ గారు.తెలుగు బ్లాగు ప్రపంచంలోకి మీకు స్వాగతం!
Post a Comment