Tuesday, December 30, 2008

తెలుగు బ్లాగర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఇన్ని రోజులూ మనతో కలిసి ప్రయాణం చేసిన 2008 సంవత్సరం అలిసిపోయి ఇంటికెళ్ళిపోయింది.2009 సంవత్సరం ద్విగ్విజయంగా పురుడు పోసుకుని మన ముందుకు వచ్చేసింది.ఈ సంవత్సరానికి నేను "2009" అని పేరు పెట్టుకున్నాను,మీకందరికీ నచ్చిందనుకుంటాను!

ఈ సందర్భంగా తెలుగు బ్లాగర్లందరికీ "కాలాస్త్రి" తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనకెన్నో అందమయిన అనుభవాలని పరిచయం చేస్తుందని భావిస్తున్నాను.

తెలుగు బ్లాగర్లందరికీ ఎదో ఒక కబుర్లు అందిస్తూ ఆనందిస్తూ వచ్చాను ఇప్పటివరకూ.ఈ కొత్త సంవత్సరం కూడా ఇలాగే కొనసాగిస్తాను.

ఈ చిన్న టపా ముగించేముందు మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

4 comments:

Unknown said...

మీరు పెట్టుకున్నారు కదా పేరు 2009 అని. ఇంక చేసేదేముంది.. ఇష్టమైనా కష్టమైనా కేవలం మీ కోసం మేము కూడా అదే పేరు వాడుతాము లెండి.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో
-గడ్డిపువ్వు

శ్రీ said...

చాలా సంతోషం!
ప్రపంచంలో అందరూ మీలా అలోచిస్తే ఎక్కడా గొడవలు ఉండవ్! అంతా శాంతిమయమవుతుంది.

Anonymous said...

కొత్త సంవత్సరం పేరు శుభ్రంగ ఉంది. ...వై.నో.రాజ శెఖర రెడ్డి లాగ సంక్షేమ నామ సంవత్సరం అదీ ఇదీ అని గందరగోళంగా కాకుండా.

నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొద్దిగా లేటుగా..

శ్రీ said...

వై.నో.రాజశేఖర్ రెడ్డి అని తమాషాగా చెప్పారు.

లేటుగా ఏముంది లేండి!ఈ జనవరి అంతా చెప్పుకోవచ్చు మనం.