సరే, ఈ ఇంటర్వూలు మనకెందుకూ,నేనెలాగూ సినిమా చూసాను,దాని గురించి రాసేద్దామని ఇటొచ్చాను.
ఇష్టం లేని పెళ్ళి తప్పించుకోవడానికి జెనీలియా పెట్టిన పరుగే ఈ శశిరేఖ పరిణయం! జెనీలియాకి బొమ్మరిల్లు,ఢీ సినిమాలతో తెలుగు సినిమాల్లో కొంచెం పేరొచ్చింది. ఆమె ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కృష్ణవంశీ శశిరేఖ పరిణయం తీసాడు.సినిమా చూస్తున్నంతసేపు మనకి కొత్తదనం ఏమీ పెద్దగ కనిపించదు.ఇవన్నీ ఎపుడో "ఆట,పరుగు" లాంటి చాలా సినిమాల్లో చూసేసినట్టే అనిపిస్తుంది.
ఇంటర్వెల్ ముందు వరకు కొంచెం సరదాగానే సాగినా తరువాత కొంచెం భారం గానే సాగుతుంది కథ.రెండవ సగం తరుణ్ మీద జెనీలియా మనస్సు ఎలా మళ్ళుతుంది అని చూపించడానికి చాలా తంటాలు పడ్డాడు కె.వంశీ.తరుణ్ ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకి ఒప్పుకోవడం అతనికి సినిమా అవకాశాలు లేవు అన్న విషయాన్ని మనకి మరొక్కసారి గుర్తుకు తెస్తుంది.పరుచూరి గోపాలకృష్ణ మాత్రం కట్నం లెక్కపెట్టుకునే ఆశబోతు తండ్రిగా చాలా బాగా చేసాడు.ఆహుతి ప్రసాద్,జెనీలియా "అమ్మనా బూతులు" బాగా తిట్టారు. తరుణ్ ఇంగ్లీషులో బూతులు తిట్టాడు.
"ఏదో...ఒప్పుకోనంది" పాట హాంటింగ్ ట్యూనుతో చాలా బాగుంది.కె.వంశీ కి జెనీలియా మీద పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. పాటలు స్లో గా వూపందుకోవచ్చు. దగ్గిరలో కింగ్ తప్ప వేరే సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా 50 రోజులు గారంటీ!
8 comments:
మీ ఓపిక్కి నవస్తే సోవీ!
చిన్నప్పటి నుండి నాకు సినిమా అంటే ఒక అలవాటండీ!చూస్తూనే ఉంటాను,ఫ్లాప్ టాక్ వస్తే ఎందుకు ఫ్లాప్ అయింది చూస్తాను.
ఓపికని నా అలవాటు డామినేట్ చేస్తుంది!
నేనూ చూసానండీ, పర్లేదు టైంపాస్ సినిమా :)
>>పరుచూరి గోపాలకృష్ణ మాత్రం కట్నం లెక్కపెట్టుకునే ఆశబోతు తండ్రిగా చాలా బాగా చేసాడు
కె.వంశీ సినిమాలు హీరోకి,హీరోవినుకీ బూస్టింగ్ ఇస్తాయో లేదో గానీ, ఒక కేరేక్టరార్టిస్టుకి మాత్ర టర్నింగ్ పాయింట్ ఇస్తాయ్. సింధూరంలో రవితేజ, చందమామలో ఆహుతిప్రసాద్...ఇలా..
శ్రీ గారు, నేనూ మీ టైపే, అయితే ఈ మధ్య సినిమాలు తగ్గిపొయాయి బాగా..
ఇలాంటి సినిమా, రామోజీ రావు ఒకటి అప్పుడెప్పుడో తీశాడు. పేరు గుర్తుకు రావట్లేదు..
బాగా చెప్పారు మధు.రవితేజ,ఆహుతి ప్రసాద్ కి మంచి లైఫ్ ఇచ్చాడు కే.వంశీ.పరుచూరి ఇలాగే కంటిన్యూ చేస్తాడో,లేదో చూడాలి.
రవి గారు,మీకు సూడాన్లో మన సినిమాలు వస్తుంటాయా?
రామోజీ రావు ఇలాంటి సినిమా తీసాడా?నాకు గుర్తుకు రావడం లేదు.
తరుణ్ బాగా చేసాడనిపించింది. ఏదొ సైటులో చూశాను.. పాత ANR నవరాత్రి కాపీ అంట కదా!!
కొంచెం సాగదీసినట్లున్నా పర్లేదనిపించింది. ఏంటో ఈ మధ్య రక్తం కనపడకపోతె చాలు సినిమా బాగానే ఉన్నట్లనిపించేస్తోంది.
-గడ్డిపువ్వు
నవరాత్రి వేరేగా ఉంటుంది బాగా,నాగేశ్వర్రావు 9 వేషాలు వేస్తాడు.ఏమో,ఇంకేమెన్నా కలిసాయేమో?నాకూ పూర్తిగా గుర్తు లేదు.
రక్తం తక్కువే!పాటలతో సినిమా నడిపించెయ్యాచ్చు.
Post a Comment