Thursday, December 10, 2009

జై తెలంగాణా!


చూస్తూ ఉండగానే సంవత్సరం చివరలోకి వచ్చి పడ్డాం. ఇంక గట్టిగా 2 పని వారాలు ఉన్నట్టున్నాయి. ఉన్న శెలవులన్నీ వాడుకుని కాలాస్త్రిలో సేద తీర్చుకుందామని ఇంక కొన్ని గంటల్లో బయలుదేరబోతున్నాను. పెట్టెలు సర్దుకోవడం ఇంచుమించు అయినట్టే! శెలవల్లో ఈ-తెలుగు స్టాలుకు వచ్చి వీలయినంత మంది బ్లాగర్లని కలుస్తాను. కొత్తపాళీ గారు కొత్త పుస్తకం విడుదల చేసారట, విజయవాడలో కొనుక్కుని చదవాలి. దారిలో నెల్లూరు బ్లాగర్లని కూడా వీలుంటే కలిసేస్తా!



గత కొన్ని రోజులుగా రాస్ట్రంలో చాలా మార్పులు జరిగాయి. కేసీఆర్ పంతం నెగ్గించుకుని తెలంగాణా సాధించాడు. సరదాగా మా ఆవిడ ఒక రాస్ట్రానికి, నేనొక రాష్ట్రానికి చెందిన వాడుగా అయిపోయాం! నా కాలు ఇంత వరకు తెలంగాణాలో పెట్టనేలేదు, అపుడే పరాయిదయిపోయింది. ఎపుడో ఖమ్మంలో ఒక విధ్యార్థి దగ్గర పుట్టిందనుకుంటా ఈ తెలంగాణా ఉద్యమం,ఇపుడు మళ్ళీ ఉస్మానియా విధ్యార్థుల పట్టుదల వల్ల అందరి ఆశలు ఫలించాయి. గత వారం రోజులుగా సాగుతున్న, బలపడిన ఉద్యమం చూస్తూ ఉంటే మళ్ళీ "సలాం హైదరాబాద్" చదివినట్టనిపించింది. కనీసం ఆంధ్ర, రాయలసీమ అయినా కలిసి ఉంటాయో, లేదో చూడాలి.


పోయిన వారం ఆర్య-2 చూసాను.మా ఇంటి పక్కన ఉన్న సినిమా హాలులో కాకుండా ఎక్కడో దూరంగా వేసారు. అయినా లెక్క చెయ్యకుండా సినిమా చూసేసాను. చూసే ముందు మా స్నేహితుడిని అడిగాను "ఎలా ఉంది సినిమా" అని. ఇక్కడ రాయలేని మాటల్లో చెప్పాడు. నా ఫీలింగ్స్ నాకుంటాయ్ కాబట్టి, సినిమా చూసేసా. డాన్సులు నాకు విపరీతంగా నచ్చేసాయి. కొత్త హిప్,హాప్ మూవ్మెంట్స్ బన్నీ అద్భుతంగా చేసాడు. సెకండాఫ్ సరదాగా అనిపించింది. ఈ వారం ప్రవరాఖ్యుడు చూసాను. జగపతి, ప్రియమణి పెళ్ళయిన కొత్తలో సినిమా తర్వాత కలిసి నటించిన సినిమా ఇది. ఈ సినిమా కూడా ఆ సినిమా లాగే ఉంది. తేడా అంతా పాత సినిమాలో వీళ్ళు పెళ్ళి అయిన తరువాత గొడవ పడతారు, ఈ సినిమాలో పెళ్ళి ముందే గొడవ పడతారు. సినిమా చివరలో నేను నిద్ర పోతూ ఉంటే మా ఫ్రెండు లేపాడు. ఇంక 2 వారాల్లో అదుర్స్, లీడర్ విడుదల కాబోతున్నాయి. రెండింటికీ మంచి అంచనాలే ఉన్నాయి. జూకి యమదొంగ తర్వాత పెద్ద హిట్ లేదు, ఇది కూడా హిట్ కాకపోతే ఇతన్ని జనాలు మర్చిపోవచ్చు. వీవీవినాయక్,జూ కాంబినేషన్ కాబట్టి సినిమా టూమచ్ గా ఉంటుందని అభిమానులు ఊగుతూ ఉన్నారు. అలాగే సురెష్ బాబు కొడుకు,రామానాయుడు మనవడు లీడర్ ద్వారా మన ముందుకు వస్తున్నాడు. రాష్ట్రంలో ఇపుడు జరుగుతున్న రాజకీయ సంక్షోభాన్ని దాటుకుని ఈ సినిమాలు మనల్ని చేరగలావా? ఏమో, కాలమే నిర్ణయించాలి.


1 comment:

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

telangaanaa udyama geetaalu/paatalakai..
plz visit www.raki9-4u.blogspot.com