Wednesday, January 13, 2010

అదుర్స్ - నాకైతే అదిరింది, మరి మీకో?





ప్రతి సారీ సినిమా బాక్సు డెట్రాయిట్ ఏర్ పోర్టు నుండి తీసుకు వచ్చే నేను ఈసారి రెండు అడుగులు ముందుకు వేసాను.ఎలాగంటారా? అదేనండీ,ఈసారి అమెరికాకి కావల్సిన బాక్సులన్నీ నేనే మోసుకు వచ్చాను. భలే సరదాగా,సందడిగా సాగింది నా ప్రయాణం! ఏ నిముషానికి ఏమి జరుగుతుందో తెలియదు, ఎలాగయితేనేమి, 16 బాక్సులు తీసుకు వచ్చాను మన అందరి కోసం!



ఎపుడో క్రీస్తు పుట్టిన రోజుకి విడుదల అవ్వాల్సిన సినిమా కేసీఆర్,లగడపాటి పుణ్యమా అని నిన్నటికి కుదిరింది.నా ప్రయాణం కూడా ఆలస్యమయి మిత్రులు, కుటుంబంతో కొంచెం ఎక్కువ సమయం కేటాయించగలిగాను. 10 రోజులు అనుకున్న నా ట్రిప్ 30 రోజులయి బాగా గిట్టుబాటు జరిగింది. అత్తగారి ఇల్లు (తెలంగాణా), అక్కయ్యల ఇల్లు (కోస్తా ఆంధ్ర), కాలాస్త్రి (రాయలసీమ)లో బాగా తృప్తిగా ఉన్నాను. ఒక పరిపూర్ణ ఆంధ్రుడిగా అన్ని ఏరియాలని టచ్ చేసి అందరినీ తృప్తి పరిచాను. నా తెలంగాణా, ఆంధ్రా, రాయలసీమ అనుభవాలు ఇంకొక టపాలో రాస్తాను. ప్రస్తుతానికి అదుర్స్ విషయాలు మాట్లాడుకుందాం.




యూసఫ్ గూడలో మిరపకాయ బజ్జీలు తింటూ, తర్వాత ఏమి తినాలా అని అలోచిస్తూ ఉంటే త్రిలోక్ అదరాబాదరాగా వచ్చి "బాబాయ్! బాక్సులు రెడీ అంట, పోదాం పద" అని నన్ను తొందర పెట్టాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికుడిలాగా నా బాగ్ ఎపుడో సర్దేసుకుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్న నాకు బయలుదేరడానికి అట్టే సమయం పట్టలేదు. ఒక 5 నిముషాల్లో తయారయి ఆటో బేరాలు మొదలుపెట్టాం.ఎక్కడ చూసినా షేర్ ఆటో తప్పితే మమూలు ఆటో దొరకలేదు. ఏదో ఒకటి ఎక్కేసి శంషాబాద్ వైపు బయలుదేరాను.



ఈలోపల నాకు బాక్సులు ఇచ్చేవాళ్ళు ప్రతి రెండు నిముషాలకు ఫోన్ చేసి "ఎక్కడుడున్నారు సార్ మీరు" అని ఆందోళన ప్రకటిస్తూ ఉన్నారు! ప్రతి 3 నిముషాలకు అమెరికా నుండి "బాబాయ్! నువ్వెక్కడున్నావు?" అని అబ్బాయ్ ఆందోళన ప్రకటించడం మధ్య ఆటోలో నా ప్రయాణం సాగింది. నీకంటే నాకు ఎక్కువ టెన్షన్ గా ఉంది త్రిలొక్ అంటూ నన్ను టెన్షన్ పెట్టడానికి తన వంతు కృషి చేసాడు. శంషాబాదు ఏర్ పోర్టుకి టాక్సీలో బయలుదేరుంటే పీవీ నరసింహా రావు బ్రిడ్జి ఎక్కి కొంచెం తొందరగా చేరుకుని ఉండేవాళ్ళం, ఆటో కాబట్టి నిదానంగా వెళ్ళాము. "ఏర్ పోర్టు దగ్గరకి చేరుకున్నాం!" అనుకుంటుండగా ఆటోని ఆపేసారు అక్కడ ఉన్న సెక్యూరిటీ!


కొత్త ఏర్ పోర్టులొకి ఆటోలు వెళ్ళకూడదు కదా! అని అంతకు ముదే మేము ఆటోలో చర్చించుకున్నాము.

"ఆపినపుడు ఎదో ఒక కారులో వెళ్ళచ్చు సార్!" అని ఆటొ డ్రైవరు మాకు ధైర్యం చెప్పాడు. అతను చెప్పినట్టే రెండు నిముషాల్లో ఒక టాక్సీ ఎక్కి అంతర్జాతీయ డిపర్చర్స్ కి చేరుకున్నాము. నా కోసం అక్కడ 16 బాక్సులు ఎదురు చూస్తూ ఉన్నాయి.




బాక్సులు పికప్ చేసుకుని పేపర్ వర్కు రెడీ చేసుకుని ఏర్ ఇండియా కి చెక్-ఇన్ కి వెళ్ళాను. స్టాఫ్ అంతా సరదాగా నన్ను చెక్-ఇన్ చేసారు.



ఒక కౌంటరి "ఇక్కడ మేము పెద్దగా సినిమాలు చూడం, మీరు మాత్రం తెలుగు సినిమాని బాగా ఆదరిస్తున్నారు" అని అభినందనలు కురిపింది.



"అమెరికాలో ఇన్ని థియేటర్లలో తెలుగు సినిమాలు ఆడుతాయా" అని కూడా కొంత మంది ఆశ్చర్యపడ్డారు.



"అవునండీ!, మనవాళ్ళందరూ ఈ సినిమాకోసం ఎప్పటినుండో ఎదురుచూస్తూ ఉన్నారు" అని నేను ఇంకొంచెం హైప్ ఇచ్చా.




లగేజికి డబ్బులు కట్టి ఇమ్మిగ్రేషన్ దాటి బండి ఎక్కేసాను. బాంబేలో దిగి మళ్ళీ సెక్యూరిటీ చెక్ అయ్యాక పెద్ద బండి లోకి ఎక్కించారు. ఇక్కడ నుండి జేఎఫ్కే కి నాన్-స్టాప్! కొత్త ఏర్ ఇండియా విమానం, ఇతిహాడ్ ఏర్వేస్ ఏమాత్రం తక్కువ కాకుండా ఉంది మన విమానం! 15 గంటల ప్రయాణం తర్వాత నెవార్క్ చేరుకున్నాను. బాగేజ్ క్లైములో అందరి కంటే అదుర్స్ డబ్బాలు ముందు దిగాయి. 16 డబ్బాలు, ఇంకొక 4 పోస్టరు డబ్బాలు తీసుకుని కస్టంస్ క్లియర్ చేసి బయటపడ్డాను. డెట్రాయిట్ కి ఒక డబ్బా తీసుకుని మిగతా 15 డిస్ట్రిబ్యూట్ చేసి మా ఊరు చేరుకునేసరికి సాయంత్రమయింది. అభిమానుల ఈలగోలల్లో రాత్రి 8.30 కి అదుర్స్ ప్రివ్యూ సందడిగా జరిగింది.అభిమానుల కోలాహలం చూసి నాకు చాలా సంతోషం వేసింది.
నిండుగా, కోలాహలంగా ఉన్న సినిమాహాలు చూస్తూ ఉంటే కోతకి సిద్ధంగా ఉన్న పంటని చూసుకునే రైతులా ఫీల్ అయ్యాను.


అదుర్స్ సినిమా వీవీ వినాయక్ మార్కు హింస లేకుండా శ్రీను వైట్ల సినిమాలాగా సరదాగా ఉంది. జూ పక్కన బ్రహ్మానందం నిలబడి గట్టి సపోర్టు ఇచ్చాడు. జూ డైలాగులు సరదాగానే ఉన్నాయి, నయన తార ఆంజనేయులు సినిమా కంటే పరవాలేదనిపించింది. షీలాకి పెద్దగా మార్కులు వెయ్యలేకపోతున్నాను. ఆర్య సినిమా తర్వాత వచ్చిన ఈ సినిమాలో స్టెప్పులు బాగా ఉండచ్చని ఊహించా! కొన్ని పాటల్లో స్టెప్పులు ఫరవాలేదు, స్టెప్పుల రేటింగ్ లో అల్లు అర్జున్ కే వోటు!

9 comments:

శరత్ కాలమ్ said...

ప్రసిద్ధమయిన సినిమా డబ్బాలు ఇండియా నుండీ పట్టుకురావడం థ్రిల్లింగ్ కలిగించే విషయమే! అయితే మా షికాగోకి డబ్బాలూ మీరే తెచ్చివుంటారు. సినిమా చూస్తే గనుక మిమ్మల్ని గుర్తుకుతెచ్చుకుంటాములెండి :)

శ్రీ said...

అవును,చాలా థ్రిల్లింగ్గా ఉనింది.
అమెరికాలో బాక్సులన్నీ నేనే తెచ్చాను.

కొత్త పాళీ said...

ఒక్కడుగేం ఖర్మ, చాలా అడుగులే వేశ్శారు. ఐతే సినిమా థియెటర్లో చూడచ్చన్నమాట. ఈ వారంతం ముహూర్తం పెడతా.

శ్రీ said...

:)

ఈరోజు శంభో శివ శంభో సినిమా కూడా రిలీజ్ అవుతుంది.
రేపు నమో వెంకటేశ రెలీజ్ అవుతుంది.

ఈ వారంతం సినిమాలే సినిమాలు!

3 ఇడియట్స్ చూసారా? చాలా బాగుంది సినిమా.

SRRao said...

ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html

శ్రీ said...

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

Unknown said...

me adurs coment bagundi adi chadivaka cinema chudoddankunnanu

Rama Prasad said...

మీ బ్లాగు " ఇంతింతై వటుడింతై " అన్నట్లు గా ఉన్నది. మీ రచనా శైలి, బాషా ప్రయోగము మరియు భావవ్యక్తీకరణ లో ఎంతో మార్పు కనిపిస్తుంది. ఈ ఒరవడి ఇలాగే ఉంటూ ఇంకా అభివ్హృద్ది లోనికి రావాలని ఆకాంక్షిస్తున్నాను. ఒకానొక ఉత్తమ బ్లాగుగా ఎన్నిక అయ్యినందులకు నా అభివందనలు

శ్రీ said...

థాంక్స్ రాం ప్రసాద్ గారు.