Tuesday, October 5, 2010

రోబో కష్టాలు 2.0

ఆమె:      ఏమండీ! తలుపు తీయండీ..
అతడు:    ....


ఆమె:      మూడు రోజులుగా గదిలో ఉన్నారు, ఒక్క రోటీ కూడా తినలేదు. బయటకు రండీ!
అతడు:    ....


ఆమె:       మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే చెప్పండి.
అతడు:    నాకు నీ మీదే కోపం!


ఆమె:       నా మీదా! నేనేం చేసానండీ!!
అతడు:    వాడితో ఇక ఇకలు, పకపకలూ! (అర్ర్....అర్ర్...)


ఆమె: :       ఏమిటో శబ్దం, అత్తయ్య మసాలా నూరుతుందా ?
అతడు:    నేనే..కోపంతో పళ్ళు కొరుకుతున్నా..


ఆమె:        ఓ మీరా...నా మీద కోపం ఎందుకండీ! మిమ్మల్ని నేనాడయినా పళ్ళెత్తు మాటన్నానా?
అతడు:   నన్నేమీ అనక్కరలేదు. పరాయి మగాడితో సిగ్గు లేకుండా..చీ చీ..


ఆమె:       పరాయి మగాడా! ఎక్కడండీ!! ఈ రాధ ఏనాటికీ మీదేనండీ!!!
అతడు:    రాధా..అదెవరు ?


ఆమె:       నేనేనండీ, మాట వరసకి అన్నాను.
అతడు:    అవును, నీకు మాటవరసలెక్కువ! వావివరసలు తక్కువ!!


ఆమె:       ఎందుకండీ నన్నింత చిత్రవథ చేస్తున్నారూ? మీరు మూడు రోజులుగా ఏమీ తినకపోయేసరికి ఇంట్లో వండినవన్నీ నేనే తినేస్తున్నా. నా డైటింగంతా మీ పుణ్యమానీ గంగలో కలిసి పోయింది.
అతడు:    ఈ మూడు రోజులుగా నేనెంత చిత్రవధ అనుభవిస్తున్నానో నీకేం తెలుసు?


ఆమె:        ఏమిటో మీ గోల ఎదో ఒకటి చెప్పి చావండి.
అతడు:     చెప్పక చస్తానా....నీ తండ్రి వయసు వాడితో ఆ కులుకులూ, ముద్దులూ...చీ.. చీ...తలుచుకుంటేనే టాం అండ్ జెర్రీలు పాకుతున్నట్టుంది.


ఆమె:        ఓ....అదా విషయం! మీకు తెలిసిందే కదా, మనకి ఇలాంటివి మామూలే కదండీ. ఏదో చూసీ చూడనట్టు పోవాలి.
అతడు:      ఎలా? ... ఎలా?...కళ్ళు మూసినా, తెరిచినా అదే నాకు కనిపిస్తూ నన్ను చంపుతుంది.

(ఇంతలో ముసలి తండ్రి అటువేపుగా వచ్చి...)


ముసలి తండ్రి:         ఏమయిందమ్మా? ఎందుకు షేకు అలా తలుపేసుకున్నాడు?

(దూరంగా మనవడికి స్వెట్టరు అల్లుకుంటున్న ముసలి అత్త మొగుడిని పిలిచింది)

ముసలి అత్త:            ఇదుగో..మొగుడూ, పెళ్ళాల జోలికి నువ్వెందుకూ? అన్నిట్లో తల దూరుస్తావ్.. అసలు విషయం నేను చెప్తా రా.. మీ పుత్ర రత్నానికి అన్నీ మీ బుద్దులే...

(స్వెట్టరు అల్లుకుంటూ మొగుడికి అసలు విషయం చెప్పింది.)

(నల్ల జుట్టు, తెల్ల గడ్దం లోకి మార్చి, మార్చి చేతులు దూర్చి అలోచిస్తూ కూర్చున్నాడు ముసలి తండ్రి. ఇంతలో సెల్ ఫోను మోగేసరికి ఫోన్ ఎత్తుకున్నాడు.)

ముసలి తండ్రి:          హలో...
సూపర్ స్టార్ రజనీకాంత్:                       తూ నిన్నా, మొన్నా కిదర్ గయా రే ?


అమితాబ్ బచ్చన్:         అబ్బా...నీ విషయం మీదే షేకూ, ఐసూ కొట్టుకుంటున్నారు. నీతో మళ్ళీ కుదురుగా
ఉన్నపుడు ఫోన్ చేస్తాలే...

(ఫోన్ పెట్టేసి జయబాధురి వైపు సిగ్గుతో చూసాడు.)

9 comments:

కొత్త పాళీ said...

మజా మజా :)

jaggampeta said...

ilaaga kooda rayavachchani telsukonna.thank you

శ్రీ said...

@ కొత్తపాళీ, -)

@ జగ్గంపేట, ఆ ముక్క తెలుగులో రాయచ్చుగా మేష్టారూ?

రవి said...

hahhahha

పరిమళం said...

:) :)

మురళి said...

:-) :-)

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

నానుంచి ఇంకో వీరతాడు

శ్రీ said...

అందరికీ నెనర్లు

కొత్త పాళీ said...

శ్రీ, త్వరలో మీ రిపోర్టు రావాలి