Saturday, February 12, 2011

వస్తాడు నా రాజు

సమయం: సాయంత్రం 5 గంటలు
స్థలం: మోహాన్ బాబు గారి ఇల్లు, ఫిలిం నగర్, హైదరాబాద్




రామానాయుడు స్టూడియో నుండి నేరుగా ఫిలిం నగరులోని మోహన్ బాబు గారి ఇంటికి చేరుకున్నాక క్వాలిస్ నుండి దిగి ఇంటిలోకి నడిచా. ఇంటి గడప ముందు తెల్ల చొక్క, తెల్ల పాంటులో మోహన్ బాబు, పక్కన సతీమణి శుభలేఖ అందుకుంటూ కనిపించారు. నేను షూ విప్పి ఇంటి చుట్టూ చూస్తూ నిలబడ్డాను. ఇంటి ముందు మామిడి చెట్టు నిండుగా పూత పూసింది. గరాజులో ఆడి కారు, దాని వెనుక పోర్షే ఎస్యూవీ ఠీవిగా పార్క్ చేసి ఉన్నాయి.




రెండు నిముషాలకి పూజ గదిలో నుండి మోహన్ బాబు బయటకి వచ్చి "శ్రీనివాస్" అంటూ పిలిచారు. నేను లోపలకి వెళ్ళగానే నాకు షేక్ హాండ్ ఇస్తూ "సినిమా బంపర్ హిట్టమ్మా! గుడ్ లక్" అన్నారు.






నేను థాంక్స్ చెపుతూ అక్కడ నుండి సెలవు తీసుకున్నా. డ్రైవరు పూజ చేసిన రెండు మూవీ బాక్సులు కారులో పెట్టగా మోహన్ బాబు గారి సతీమణి కారు ఎదురొచ్చి నాకు వీడ్కోలు పలికారు.


**********************************************************************************


కట్ చేస్తే గురువారం ఉదయం పదిన్నరకి ఎడిసన్ లో దిగాను. మిత్రుడు పవన్ కుమార్ లంకతో కలిసి సాయంత్రం డెలావేర్ లో "వస్తాడు నా రాజు" సినిమా ప్రీమియర్ షో చూసా.




**********************************************************************************

సినిమా కథ కోస్తే హీరో విష్ణుకి మంచి కిక్ బాక్సర్ అవ్వాలని ఆశయం అన్నమాట. హీరోయిన్ టాప్సీ కాలేజీలో చదువుకునే అమ్మాయి, ఈమెకి అన్న ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ కి ఎమ్మెల్యే అవ్వాలని కోరిక. హోం మిన్సిస్టర్ కొడుక్కి (అజయ్) టాప్సీని పెళ్ళి చేసుకోవాలని కోరిక. అందరి సమీకరణాలు కలిసి అజయ్ కి టాప్సీతో పెళ్ళి నిశ్చయిస్తారు.  


అన్న, అజయ్ ల కోరిక తీరిందా ? విష్ణు ఆశయం తీరిందా? ఇవి తెలుసుకోవడానికి మీ దిక్కుమాలిన కంప్యూటర్ లో చూడకుండా వెండి తెర మీద సినిమా చూడండి. నటన విషయానికి వస్తే విష్ణు నటనలో కొంత పరిణతి కనిపించింది. టాప్సీ 'ఝుమ్మంది నాదం" లో ఉన్నంత అందంగా ఈ సినిమాలో లేదు.  కామెడీ మీద ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండేది. కథలో కొత్తదనం లేదు, ఉన్న కొంచెం కామెడీనే సినిమాని అవరేజ్ సినిమాగా నిలబెట్టింది. 



2 comments:

Indian Minerva said...

ఎట్టా.... వీరోదైతే ఆశయమా? ఇంకోటోళ్ళాదైతే కోరికా? :)

శ్రీ said...

హీరో కోరిక గొప్పది! అందుకే అది ఆశయం అయింది, మిగతా వాళ్ళ కోరికలలో సొంత లాభాలు ఉన్నాయి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వెండి తెర మీద చూడండి