నెట్ ఫ్లిక్సులో సినిమాలు చూస్తున్న వాళ్ళకి ఈ విషయం బాగా అర్ధమవుతుంది. నెట్ ఫ్లిక్సులో ఆన్ లైనులో సినిమాలు చూస్తుంటే మనం చూస్తున్న సినిమాలని బట్టి మనకి చూడబోయే సినిమాలని పరిచయం చేస్తుంది. అసలు ఈ నెట్ ఫ్లిక్సు ఏమిటి, దీని గురించి కొద్దిగా తెలుసుకుందాం.
ఆన్ లైనులో సినిమాలు చూసే అవకాశం లేనపుడు షాపుకి వెళ్ళి వీడియోలు రెంట్ చేసేవాళ్ళు. ఈ షాపుల్లో (బ్లోక్ బస్టర్) కొత్త వీడియోలు, పాత వీడియోలు దొరుకుతాయి. కొత్త సినిమాలయితే చూసిన రెండు రోజులకి ఇచ్చెయ్యాల్సి వచ్చేది. లేటుగా ఇస్తే ఫైన్ వేసేవాడు. ఇలా అపొలో 13 సినిమాకి ఒకసారి ఫైన్ కట్టాక రీడ్ హేస్టింగ్స్ కి వచ్చిన అలోచనే నెట్ ఫ్లిక్స్.
1997 లో నెట్ ఫ్లిక్స్ కంపెనీ మొదలయ్యాక పోస్టులో డీవీడీలు తెచ్చుకునే సదుపాయం కలిగింది. ఉత్తరానికి కావలసిన స్టాంపులు, కవరు కంపెనీనే ఇస్తుంది. సినిమా చూసాక సినిమా పంపితే మళ్ళీ కొత్త సినిమా వస్తుంది. 2000 నాటికి నెలకి ఎన్ని సినిమాలన్నా చూసే కొత్త ప్లాన్ వచ్చింది. దీని ద్వారా నెలకి కొంత డబ్బులు కడితే మనకి ఓపిక ఉన్న సినిమాలు చూడచ్చు. కాకపోతే సినిమాలు పొస్టులో తెచ్చుకోవలసిందే! పొస్టులో సినిమాలు తొందరగా డెలివరీ చేయడానికి నెట్ ఫ్లిక్స్ అన్ని రాష్ట్రాలలో బ్రాంచులు పెట్టి కస్టమరు అడ్రెస్ ని బట్టి దగ్గర ఉండే వూరు నుంచి సినిమా డెలివరీ అయ్యేది. సప్లయ్ చైన్ మేనేజ్ మెంటులో ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయి.
సినిమాలని చూసిన తర్వాత మనమిచ్చే రేటింగ్ ద్వారా మనకి ఎటువంటి సినిమాలు నచ్చుతున్నాయో తెలుకోగలిగేది నెట్ ఫ్లిక్స్. రేటింగ్ ద్వారా మన టేస్ట్ తెలుసుకోవడానికి నెట్ ఫ్లిక్స్ సినీ మాచ్ అనే సాఫ్ట్ వేరుని వాడేవారు. 2006 లో ఈ సాఫ్ట్ వేరు కంటే బాగా పనిచేసే సాఫ్టువేరు తయారుచేసిన వాళ్ళకి ఒక మిలియన్ డాలరు బహుమతి ప్రకటించింది నెట్ ఫ్లిక్స్.
అంతర్జాలం వాడకం పెరగడం, ఆన్ లైనులో సినిమాలు చూడడం మొదలయ్యాక నెట్ ఫ్లిక్స్ సినిమాలని పొస్ట్ ద్వారానే కాకుండా కంప్యూటరులో కానీ, స్ట్రీమింగ్ టీవీలలో కానీ సినిమాలు చూసే అవకాశాన్ని కల్పించింది. స్ట్రీమింగ్ బ్లూ రే ప్లేయర్స్ ద్వారా కూడా సినిమాలని టీవీలోకి బఫర్ చేసుకుని ఇంట్లో నుంచే సినిమాలని చూడచ్చు.
2009 లో ఏటీ & టీ కి చెందిన కొన్ని టీములు కలిసి కొత్త సాఫ్ట్ వేరుని కనిపెట్టి నెట్ ఫ్లిక్స్ మిలియన్ డాలరు బహుమతి గెలుచుకుంది. కస్టమర్లు చూసిన సినిమాల సమాచారాన్ని పరిశీలించి, పరిశోధించి వారికి నచ్చే సినిమాలని రెకమెండ్ చేస్తుంది. ఉదాహరణకి నేను ఇండియా, పాకిస్తాన్ దేశ విభజనకి సంబంధించిన సినిమా చూసాననుకోండి. నాకు అటువంటి సినిమా అంటే జెరూసెలెం, పాలస్తీనా కి సంబంధించిన సినిమాలు రెకమెండ్ చేస్తుంది.
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ అమెరికా, కెనడాలలో మాత్రమే వ్యాపారం చేస్తుంది. ఈ సంవత్సరం చివరికల్లా లాటిన్ అమెరికా, కరీబియన్ లో నెట్ ఫ్లిక్స్ విస్తరించవచ్చు.
9 comments:
నేను మొన్ననే నెట్ఫ్లిక్స్ ఎకవుంట్ క్యాన్సిల్ చేసా. ఈమధ్య తెలుగు ఛానల్స్ కి చందా కట్టాం. తెలుగు సినిమాలు చూడ్డానికే సమయం సరిపోవడం లేదు - ఇంకా ఇంగ్లీషు సినిమాలు ఏం చూస్తాం లెమ్మని.
మీకు తెలుగు చానల్స్ బోరు కొట్టాక మళ్ళీ నెట్ ఫ్లిక్సు చేరండి. ఇక్కడ మంచి సినిమాలు దొరుకుతాయి.
nice summary Sree ..keep it up
Rgds
Venkat Aekka
Thanks Venkat garu.
మొన్నామధ్య ఇండియాకి వెళ్ళినప్పుడు, స్ట్రీం చెయ్యడానికి ట్రై చేసాను. కాని రాలేదు. వాళ్ళకు కాల్ చేస్తే చెప్పారు, త్వరలో ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్రారంభిస్తారని, అప్పటివరకు Licensing Terms ఒప్పుకోవని. It will be good if they start international streaming too :-)
వీకీ ప్రకారం లాటిన్ అమెరికా,కరీబియన్ లోకి మాత్రమే ఈ సంవత్సరంలో రావచ్చు. ఇండియాకి ఇంకా అనుకోలేదు. నెట్ ఫ్లిక్స్ వచ్చేలోపల ఎవరన్నా పెట్టుకోవడానికి మంచి అవకాశం.
ఇపుడే అందిన వార్త, నెట్ ఫ్లిక్స్ 60 శాతం రేట్లు పెంచింది!
"2009 లో ఏటీ & టీ కి చెందిన కొన్ని టీములు కలిసి కొత్త సాఫ్ట్ వేరుని కనిపెట్టి నెట్ ఫ్లిక్స్ మిలియన్ డాలరు బహుమతి గెలుచుకుంది."
ఈ విషయం నాకు ఇంతకూ ముందు తెలియదు. మళ్ళీ నెనర్లు.
థాంక్స్ రామ.
నెట్ ఫ్లిక్సులో సినిమాలు చూస్తూ ఉంటే మన అభిరుచి బట్టి భలే సినిమాలు చూడమంటాడు. ఈ విషయం నాకు నచ్చి నెట్ ఫ్లిక్స్ గురించి వీకీలో చదివితే అపుడు తెలిసింది.
Post a Comment