Sunday, October 2, 2011

మీ కాలాస్త్రి రేడియో జాకీ అయిపోయాడోచ్!యాహూ ... నిన్నటి నుండి నేను రేడియో జాకీనయిపోయానోచ్! రేడియో జోష్ అనే కొత్త రేడియో స్టేషన్ వాళ్ళు నన్ను జాకీగా తీసుకున్నారు. నేను కూడా ఇక "గుడ్ మార్నింగ్ వియత్నాం" సినిమాలో రాబిన్ విలియంస్ లాగా, "లగే రహో మున్నా భాయ్"లో విద్యా బాలన్ లాగా ఇంకా మా స్నేహితుడు కనక బైరాజు లాగా మీ ముందుకు వచ్చేస్తున్నా. 

మా ఈ కొత్త రేడియో స్టేషన్ రేడియో జోష్ అంతర్జాలంలో నడుస్తుంది. మీరందరూ ఇక్కడకి వచ్చి మా కబుర్లు వింటూ, మీకు నచ్చిన పాటలను అడిగితే వేసేస్తూ ఉంటామనమాట.  ఈ స్టేషన్ పుట్టి ఇంకా పట్టుమని పది రోజులు కూడా కాలేదు. త్వరలో వెబ్ సైటు పూర్తి హంగులతో మీ ముందుకు వచ్చేస్తుంది. ఇంక కొన్ని రోజుల్లో తెలుగు సినీ రంగంలో పేరున్న మీ అభిమాన కథానాయకుడు మా ఈ రేడియో జోష్ వెబ్ సైటు లాంచ్ చెయ్యబోతున్నారు. 

అసలు నేను ఇలా రేడియోకి రావడానికి చిన్న కథ ఉంది. మా కాలేజీలోనే చదివిన మా కనక బైరాజు నాకు ఈమధ్య ఫేస్ బుక్కులో తారసపడ్డాడు. ఇద్దరికీ వాకాడులో పెద్దగా పరిచయం లేకపోయినా ఇక్కడ ఫేస్ బుక్కులో బాగానే మాట్లాడుకునే వాళ్ళం. కనక రేడియోజాకీలాగా చేస్తూ ఉంటారు. నేను ఒకసారి కనకతో మట్లాడాను, మంచి సరదాగా ఉండేసరికి కనకకి ఫోన్ చెయ్యడం లేకపోతే వాళ్ళ పాటలు, మాటలు వింటూ ఉండడం అలవాటయిపోయింది.    

ఇలా మిగతా జాకీలతో కూడా "స్నేహమేరా జీవితం" పాట పాడేసాను. అలా ఒక జాకీ "అగ్ని పుత్ర" తో నా పరిచయమయిపోయింది. మా కనక లాగే అగ్ని కూడా మంచి సరదా మనిషి. పేరులో నిప్పు ఉంది కానీ మనిషి విపరీతమయిన కూల్ అనమాట. ఇద్దరం వీలున్నపుడంతా ఫేస్ బుక్కులో "హలో బ్రదర్" చెప్పుకునేవాళ్ళం. మా అగ్ని, జమదగ్నిగారు కొత్తగా ఒక రేడియో జోష్ పెట్టేయడం దానికి నా జోష్ కూడా కావాలనడం నా ఎంట్రీకి కారణమయ్యింది.  

ఇన్ని రోజులూ నా రాతలతో మిమ్మల్ని అహ్లాదపరుస్తున్నాననుకునే నేను ఇక నుండి మాటలతో కూడా అలరించగలను. ఈ అవకాశంతో నన్ను మీరు ఇంకొక కోణంలో చూసుకునే సౌభాగ్యం కలగబోతోంది మీకు, అబ్బా...మీరు భలే లక్కీ అండీ! ఇంక ఒక వారం, పది రోజులు ఓపిక పట్టండి! నా షో టైమింగ్స్, స్కెడ్యూల్స్ వివరాలు రాగానే మీకు అందిస్తాను. మీరందరూ మా ఈ రేడియో స్టేషన్ అందించే పసందయిన పాటలు వింటూ మా సేవలందుకుని పండగ చేసుకోండి. 

ఈ మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించిన మా స్టేషన్ మాస్టారు అగ్ని, జమదగ్ని గారికి వందనములు! నాకు లాటరీ టిక్కెట్టు తీసి నన్నిలా భాగ్యలక్ష్మి వరించేలా చేసి పుణ్యం కట్టుకున్న కనక బైరాజుకి శతకోటి వందనాలు!! లింగు లిటుకు అనుకుంటూ ఒక్క జాకీనే అనుకునేరూ! లేదండీ, ఇంకా నాలుగు జాకీలున్నారు. నందూ, సనా, లక్కీలతో అద్భుతమయిన టీం, మీతొ జల్సా చేయిస్తాం!  Trust me, you will have fun!!

23 comments:

ఆ.సౌమ్య said...

wow....congrats!

విజయ క్రాంతి said...

కాస్త మీరన్నా తెలుగు మాట్లాడండి. మాకు తెలుసు మీరు మాట్లాడుతారు . :-)

All the best.

రసజ్ఞ said...

మీకు అభినందనలు.

శ్రీ said...

థాంక్స్ సౌమ్య!

తప్పకుండా విజయ క్రాంతి గారు!

థాంక్స్ రసజ్ఞ!

శరత్ 'కాలమ్' said...

:)

శ్రీ said...

థాంక్స్ శరత్!

Rama Prasad said...

Congatulations Sir

bathi said...

Good enjoy kalasthree.

Total monkeys are five (5). Only one (1)monkey making all noice other four monkeys just listening. Two monkeys are one place, two other monkeys are in another place and the monkey makes noice stays one place.
What is this and where are the places.

శ్రీ said...

Thanks Mastaru.

శ్రీ said...

పజిలా అన్నయ్యా! భలే తమాషాగా ఉంది!!

శ్రీ said...

అరిచే కోతి నేను. మీరూ, చంద్ర ఒక చోట ఉన్నారు. తిలక్, మధు అక్కడ ఉన్నారు. అంతేనా?

ఇందు said...

Congrats! :)

శ్రీ said...

థాంక్స్ ఇందు గారు

శశి కళ said...

కంగ్రాట్స్.ఆల్ ది బెస్ట్..

శశి కళ said...

వాకాడు అంటున్నారు.కొంప తీసి నెల్లూరు జిల్లా వాకాడు
కాదు కదా.నెను n.b.k.r.vidyanagar student ni.oka vela nellore jilla ayite ye batch tondaragaa reply ivvandi.

శ్రీ said...

థాంక్స్ శశికళ గారూ! కొంప తియ్యకుండానే మన వాకాడేనండి. నేను విద్యానగరులో 94 లో చదువు ముగించాను. మీ బాచ్ ఎపుడు?

వనజ వనమాలి said...

congrats.. All the Best.. Nellore poragallu yedunnaa maanchi telivikalollani Gonupalli lo maa banduvula aavida antuntaadi. nijam anipisthaa undi ippudu.

శశి కళ said...
This comment has been removed by the author.
శ్రీ said...

బాగా చెప్పారు వనజ వనమాలి గారు. గోనుపల్లె అంటే పెంచలకోన, పొదలకూరు దగ్గర ఊరేనా?

వనజ వనమాలి said...

yes,aa GONUPALLE.

ravi sankar pydi said...

congrats seenu, can we watch

శ్రీ said...

@వనజ వనమాలి, నేను చిన్నపుడు పొదలకూరు, రాపూరులో ఉండేవాళ్ళమండీ. పెంచలకోనకి చాలా సార్లు వెళ్ళాను గోనుపల్లి మీద.

శ్రీ said...

మాటలు మాత్రమే మామయ్యా! ఈ నెల చివరలో మొదలవుతుంది. మీరు కాల్ చేస్తూ ఉండండి.