నెల్లూరులో ట్రంకు రోడ్ ఉన్నట్టే కావలిలో కూడా ఒక ట్రంక్ రోడ్ ఉంది. ఊరిలో ఎవరికి ఏమి కావాలన్నా ట్రంకు రోడ్ కి రావలసిందే. బైసాని వెంకటసుబ్బయ్యకి తండ్రి ద్వారా సంక్రమించిన అంగడి ఈ ట్రంక్ రోడ్ మీదనే ఉంటుంది. రోడ్ కి రెండు వైపులా ఉన్న మార్జిన్ లో చిన్నా, చితకా వ్యాపారస్థులు ఉంటారు. ఖాదర్ కి కూడా ఇలాంటి మార్జిన్ షాపే ఉంటుంది. కొన్ని సైకిళ్ళు అద్దెకి ఇచ్చుకుంటూ రిపేర్లు చేస్తూ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు ఖాదర్.
వీళ్ళిద్దరకీ పరిచయం గమ్మత్తుగా జరుగుతుంది. బైసాని వయసులో ఖాదర్ కంటే చిన్నోడు. పిలకాయలు తొక్కుకునే సైకిళ్ళు ఖాదర్ దగ్గరే దొరుకుతాయి. బైసాని తరచూ సైకిలు అద్దెకి తీసుకుంటూ ఉండడముతో ఇద్దరికీ పరిచయం పెరుగుతుంది. సైకిల్ షాపులో ఖాళీ దొరికితే ఖాదర్, బైసాని షాపు దగ్గరకి వచ్చి కూర్చునేవాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ ఖాళీ సమయాల్లో. బైసాని, ఖాదర్ కి కొన్ని వ్యాపార సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు. ఖాదర్ కూడా వాటిని పాటిస్తూ వ్యాపారం పెంచుకుంటూ ఉంటాడు.
ఒక రోజు ట్రంకు రోడ్ వెడల్పు చేసే పనిలో మార్జిన్ షాపులన్నిటినీ పీకేస్తారు అధికారులు. బైసాని అంగడిని కూడా కొంచెం రోడ్ మీదకు ఉందని బుల్ డోజర్లతో కొంత పడగొట్టేసారు. ఖాదర్ షాపు పూర్తిగా పీకి పారేస్తారు. నాలుగురోజులూ బజారు వెళ్ళిన బైసాని ఒక్క ఆదివారం మాత్రం వెళ్ళడు. అన్ని రోజులూ కనపడిన ఖాదర్ ఆదివారం నుండి కనపడడు. ఖాదర్ ఎటు వెళ్ళాడో తెలియదు, బజారులో కనిపించిన వాళ్ళనంతా అడుగుతూ ఉంటాడు.
కథ ముచ్చటగా ముప్పయ్ పేజీలు కూడా ఉండదు. నాకు చదవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, తొందరగా చదివే వాళ్ళకయితే సరిగ్గా అరగంట కూడా పట్టదు. చదవడానికి అరగంట పట్టినా పూర్తి చేసాక దీని జ్ఞాపకాలు చాలా సేపు వెంటాడుతాయి. బజారులో పెద్ద అంగడి వ్యాపారాలు వేరు, రోడ్ పక్కన చిన్న చిన్న వ్యాపారు వేరు. ఈ చిన్న వ్యాపారస్తుల జీవితాల గురించే ఈ కథ. వీళ్ళ పెట్టుబడులంతా చూస్తే వెయ్యి, రెండు వేల కంటే ఎక్కువ కాదు. ఆరోజుకి గడిస్తే చాలు అని జీవిస్తూ ఉంటారు.
రోడ్ వెడల్పు చేయడం మంచిదే, కాకపోతే ఖాదర్ లాంటి చిన్న వ్యాపారస్థులు చేసుకునే వ్యాపారాలు పీకేయడం మంచిది కాదు. ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపిస్తే మంచిదని రచయిత మనకి చెప్పాలని ప్రయత్నించాడు. వీళ్ళకి ఉండడానికి ఇళ్ళు ఉండదు, ఎక్కడో ఒక చోట కొంత స్థలం ఆక్రమించి అక్కడ ఉండిపోతారు. అప్పటికి ఇందిరమ్మ ఇళ్ళు లేవు, లేకపోతే ఖాదర్ ఒక ఇంటివాడయి ఉండేవాడేమో!
చిన్నపుడు రాపూరులో నేను కూడా చిన్న సైకిళ్ళు అద్దెకి తీసుకున్నాను. అందరిదగ్గరా ఈ సైకిళ్ళు ఉండవు, ఊరిలో కొంత మంది దగ్గరే ఉంటాయి. బైసాని చిన్న సైకిల్ రెంటు చేయడం నన్ను నా చిన్నప్పటి జ్ఞాపకాలకి తీసుకువెళ్ళింది. కథలో నెల్లూరు యాస చూసి కడుపు నిండింది. ఈ పుస్తక రచయిత మొహమ్మద్ ఖదీర్ బాబు రాసిన దర్గామిట్ట కథలు కూడా బాగుంటాయని విన్నాను.
9 comments:
మీ పరిచయం బాగుంది.ఇదే కథాంశంతో మానేపల్లి గతంలో ఒక కథ రాసారు,చూడబోతే అదే బాగున్నట్టుంది.
nellore anagane naa vollu pulakinchindi tambi ...
romalu nkkaboduchukunnai...
kadha ni nuvvu seppina teerulone naaku kallu chemma gillai...
but starting matram .. nellore lo lane kavali lo kuda trunk road entehe ...chennai to culcutta varaku unna high way n.h 5 ni grand trunk road antaru danne short cut lo trunk road ..
sare ika naaku daaham tage time aindi nenu unta
itlu
MUDO PULAKESI uraf THRILL
(veediki alakinta takkuva pulakinta ekkuva )
శ్రీ గారూ....ఖదీర్ నాకు మంచి మిత్రుడు....మీ ఈ 'రాత' గురించి తనకు చెబుతాను....తన 'దర్గా మిట్ట కథలు' [కాపీలు వున్నాయో, లేవో..]...'పోలేరమ్మ బండ కథలు' తప్పకుండా చదవండి....మొత్తం కథలన్నీ మీ నెల్లూరు యాసలో సాగుతాయి...
ఇప్పుడూ 'దర్గా మిట్ట కథలు'రాసింది ఖాదిర్ బాబే గదూ. అద్జవుతుంటే మనం కావలి, నెల్లూర్రోడ్ల మీద తిరిగినట్టే ననుకోండి.ఆ లీలమహాలూ..జవహరభారతి మన పక్కన్నే ఉన్నట్టే అవుపిస్తా వుంటాయ్.
బావుందండీ మంచి రచయితను గుర్తు చేశారు. థాంక్ యు.
థాంక్స్ రాజేంద్ర గారు.
థ్రిల్, మనిద్దరం నెల్లూరోళ్ళం కదా, అందుకే పులకరిస్తుంది. ట్రంక్ రోడ్ అంత పొడుగుంటుందని మా నాన్న కూడా చెప్పాడు. అలా నెల్లూరు నుండి కవర్ చెయ్యడం నా స్టెయిల్ అనుకోరాదే?
అద్భుతం విజయ్ కుమార్ గారు. ఈ రెండు పుస్తకాలు చదువుతాను. ఖదీర్ గారికి నా నమస్కారాలు అందజేయండి.
థాంక్స్ జ్యోతిర్మయి గారు, నేనూ దర్గామిట్ట కథల గురించి విన్నాను. ఒక కథ చదివినట్టు గుర్తు కూడా. మళ్ళీ కూర్చుని చదవాలి.
నెల్లూరు నాకు తెలియదుగాని,కావలి 2 సార్లు వెళ్ళానండి.ఎప్పుడో డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంటర్-కాలేజియేట్ నాటకపోటీలకు వచ్చాము,జవహర్ భారతికి,ఇంగ్లీషు డిపార్ట్మెంటు స్టాఫ్ రూం లో బస,మూడు రోజులున్నాము.ఈ మధ్య 2009 లో కూడ ఒకసారి వెళ్ళాను.
అబ్బ..కావలి మా అమ్మమ్మ గరి ఊరు.చదువుతుంటె
మనసు గన్తులు వెస్తున్ది.యెలాగైనా ఖధీర్ గారి కదలన్ని
చదవాలనిపిస్తున్ది..చాలా బాగా వ్రాసరు.
తప్పకుండా చదవండి. నేను కూడా మిగతా పుస్తకాలు వెతికి పట్టుకోవాలి.
Post a Comment