Thursday, June 30, 2011

మా ఇంట్లో వంట - బేంగన్ భార్యనాకు బాగా వచ్చిన, నచ్చిన వంటలలో ఇది ఒకటి. వంకాయ బజ్జీ లాగా చెయ్యడం నాకు అలవాటు. ఈ వంకాయ బజ్జీ ఇంచుమించు బేంగన్ బర్తా లాగుంటుంది. కాకపోతే నేను చేసే ఈ వంకాయ కూర కొంచెం వేరుగా ఉంటుంది. నిన్న రాత్రి ఈ వంట కోసం బ్లాగులూ, యూ ట్యూబులూ చూసాను. వారెవా సంజయ్ వంట చూస్తే నా వంటకి అతని వంటకి కొంచెం తేడా ఉంది. ఇక ఈటీవీ, మీటీవీలు చూస్తే అందరూ గుత్తి వంకాయ కూరనే చూపిస్తున్నారు. ఎంతసేపూ గుత్తి వంకాయేనా? అలాగని నాకు ఇష్టం లేక కాదు. కొంచెం కొత్తగా, బాక్సు బయటకి వచ్చి అలోచించచ్చు కదా! నాకు మటుకు నేను ఎపుడూ కొత్తగా, అపుడపుడూ చెత్తగా అలోచిస్తూ ఉంటాను.  

నా ఈ కొద్దిపాటి పరిశోధనలో తేలిందేమంటే నేను చేసే ఈ వంకాయ కూర కొంచెం కొత్త ఏమో? ఆలస్యం విషం, ఇక ఆగలేక కడుపు నిండా వంకాయ కూర లాగించి ఇలా బ్లాగుతున్నా. నేను చేసే ఈ వంకాయ కూరకి కొత్త పేరు పెట్టాను, అది ఏమిటంటే "బేంగన్ భార్య". ఈ పేరు ఎందుకు పెట్టానంటే ఈ కూర బేంగన్ బర్తా లాగనే ఉంటుంది, కాకపోతే పూర్తిగా మెత్తగా ఉండదు. కొంచెం కరుకుగా,గరుకుగా అందంగా ఉంటుంది.


ఇకపోతే బేంగన్ భార్య గురించి వస్తాను. ముందుగా మనకి కావలసినవాటి గురించి చూద్దాం.

1) కావలసినన్ని వంకాయలు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి)
2) ఒక పెద్ద యర్రగడ్డ (కాలస్త్రి అమ్మా మాది, మేము ఇట్టనే మాట్లాడుతాం), చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి
3) పచ్చి మిరపకాయలు
4) కొంచెం తెల్ల గడ్డ (ఇందాకే చెప్పా కదా), అల్లం
5) గరం మసాల
6) కొబ్బరి పొడి
7) ఉప్పు
8) చింతపండు (ఇక్కడే కాలాస్త్రి కొత్తగా అలోచించాడు)


ఇక బేంగన్ భార్య ఎలా చేద్దామో చూద్దామా!


పొయ్యి వెలిగించి గిన్నె వేడెక్కాక ఒక రెండు స్పూనులు నూనె వెయ్యండి. నూనె కాగాక జిలకర, అవాలు గిన్నెలో వెయ్యండి. ఆవాలు చిటపట లాడకముందే ఇందులో దంచిన తెల్లగడ్డ,అల్లం వేసి కాసేపు వేగిన తర్వాత యరగడ్డలు వేసెయ్యండి. యర్రగడ్డలు కాసేపు వేగాక పచ్చిమిరపకాయలు వేసి గరిటెతో కాసేపు తిప్పండి. ఇపుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలని గిన్నెలో వేసి మూత పెట్టండి. చాలా వంటలలో ఈ మూత పెట్టడం అనేది చాలా అవసరం. కొన్ని వంటలలో మూతలు పెట్టం మనం, మీకు తెలుసనుకుంటాను. ఈ వంటలో మనకి వంకాయలు బాగా మెత్తగా ఉడకాలి, కాబట్టి మూత పెట్టి ఆ అవిరితో ఉడికిస్తాము. 


వంకాయలు కొంచెం ఉడికాక, అంటే అయిదు నిముషాల తర్వాత గిన్నెలో గరం మసాల, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొబ్బరి పొడి వేసి కలపండి. వంకాయలు ఉడికేలోపల చింతపండు కొంచెం వేడి నీటిలో తీసుకుని చింతపండు రసం చేయడం మొదలుపెట్టండి. బేంగన్ బర్తాలో టమోటాలు వేస్తాము. నేను ఇందులో టమోటాలకు బదులు చింతపండు వేస్తాను. ఇక్కడే బర్తకి భార్యకి తేడా మీకు కనిపిస్తుంది. నాకు చింతపండుతో వచ్చే పులుపంటే బాగా ఇష్టం, అందుకే చేపల పులుసు, కోడిగుడ్డు పులుసు ఇష్టం. బేంగన్ భార్యలో కూడా నాకు నచ్చిన చింతపండు కలిపి నా మార్కు వంట చేసుకుంటాను. 


నా మాటల్లో పడి వంకాయలు కలపడం మర్చిపోవద్దు. ఇపుడు చింతపండు పులుసు కూరలో వేసి మూత పెట్టి ఉడకనివ్వండి. వంకాయలు బాగా మెత్తగా అయ్యాయని అనిపించగానే మంట తగ్గించి ఒక పది నిముషాలు ఉంచండి. ఇక్కడ నేను ఇంకొకటి చేస్తూ ఉంటాను. మెత్తగా ఉడికిన వంకాయలని గరిటెతో దంచుతూ మెత్తగా చేయండి. బేంగన్ బర్తాలో వంకాయలు మెత్తగా అవడానికి ఒవెన్లో ఉంచుకుంటాము. మనకి అంత మెత్తగా అక్కరలేదు, కొంత చాలు. ఉప్పు సరిపోయిందో లేదో ఒక సారి రుచి చూసి దుకాణం బంద్ చెయ్యండి.

24 comments:

భాస్కర్ రామరాజు said...

http://en.wikipedia.org/wiki/Baba_ghanoush

ఈసారి బాబా ఘనుష్ ప్రయత్నించు. బాగుంటుంది!!

శ్రీ said...

అలాగే. బాబా ఘనుష్ మాకు డీర్ బోర్న్ లో బాగా దొరుకుతుంది. అక్కడ పూర్తిగా అరబ్బులు ఉంటారు. ఇంటిలో చెయ్యడానికి ఎపుడూ ప్రయత్నించలేదు. వంకాయ్ పచ్చడి లాగే ఉంటుంది కదా!

Kanaka Byraju said...

Habbo, pogalu kakkutundi video. Kaani modata ee vanta karuku ga, garku ga annaru, chivarana metthaga munginchaaru. Ekkadaina porapaatu jariginda saru?

Afsar said...

"ఈ పేరు ఎందుకు పెట్టానంటే ఈ కూర బేంగన్ బర్తా లాగనే ఉంటుంది, కాకపోతే పూర్తిగా మెత్తగా ఉండదు. కొంచెం కరుకుగా,గరుకుగా అందంగా ఉంటుంది."

- ఎంత ధైర్యము? ఈ వంటకం నాకు అన్నీ విధాలా నచ్చిన ప్పటికీ మరింత సరదా పుట్టించు సరదాతో కొందరు ఫెమినిస్టులకి పోస్టు చెయ్యబోతున్నాను...శ్రీ, ఇక మీ ఖర్మము!

Rakesh Reddy said...

@ కనక, నెను దంచేటపుడు వంకాయలు పూర్తిగా మెత్తబడవు, కొంచెం ఆటు,ఇటుగా ఉంటుంది.

@ అఫ్సర్, ఫెమిస్టులకోసమే ఈ కూరకి 'అందంగా' అని కూడా చెప్పాను. ఇది వాళ్ళని తృప్తి పరస్తుందనుకుంటాను.

శ్రీ said...

పై కామెంటు నాదే, మా తమ్ముడి అకౌంట్ నుండి వచ్చింది.

ఆ.సౌమ్య said...

హహహ బేంగన్ భార్యా...పేరు బావుంది....చూడడానికీ బావుంది...ఈసారి ప్రయత్నిస్తా.

హమ్మయ్య ఆడవాళ్లు కరుకుగా, గరుకుగా ఉంద్డగలరని ఒప్పుకున్నారు, సంతోషం....తరతాలనుండి ఆడవారంటే సున్నితం, సుకుమారం అని వినీ వినీ విసుగెత్తిపోయాం :)))

Sujata said...

Very Funny. చాలా బావుంది. మీ చెత్తాలోచన (మీరే అన్నారు.:D నేననట్లేదు) చాలా కొత్తగా వుంది. Three Cheers!

btw భార్యా, భర్తా... పిల్లలూ.. ఎవరైనా సరే - వంకాయ చూపిస్తే చాలు ... మా హీరో లాంటి మాహానుభావులకి.

శ్రీ said...

@ సౌమ్య, తప్పక ప్రయత్నించండి.

ముందే చెప్పా కదా, నేను కొత్తగా అలోచిస్తానని --)

@ సుజాత, థాంక్స్ సుజాత గారు.

కృష్ణప్రియ said...

LOL. పేరు బాగుంది. వంట కూడా బాగానే ఉన్నట్టనిపిస్తుంది.

శ్రీ said...

థాంక్స్ కృష్ణప్రియ గారు. వంట కూడా బాగా రుచిగా ఉంటుంది, ట్రై చెయ్యండి.

thrill said...

నాకు మటుకు నేను ఎపుడూ కొత్తగా, అపుడపుడూ చెత్తగా అలోచిస్తూ ఉంటాను. ..


idimatram correctga cheppav...

ikapote , nuvvu twaraga bench nunchi bayatapadalani aa devudni vedukuntunna...lekunte .. nee blogultho memu mancham ekkettunnam ....

itlu
edarilo bidari

శ్రీ said...

థాంక్స్ పెద్దారెడ్డి.

కొత్త పాళీ said...

hilarious

శ్రీ said...

థాంక్స్ కొత్తపాళీ గారు

మురళి said...

No garnishing???

శ్రీ said...

పొగలు, సెగలతో నోరూరించే వంట కంటే వగలు ఇంకోటుందంటారా?

రసజ్ఞ said...

పేరు బాగుందండి. ప్రయత్నించి చెప్తా.
నాకొక ధర్మ సందేహం కలిగింది. ఇది కేవలం భార్యలే చెయ్యలా? విద్యార్ధినులు కూడా చెయ్యచ్చా?

శ్రీ said...

నెనర్లు రసజ్ఞ!

హహహ, ఎవరన్నా చెయ్యచ్చు.

Rama Prasad said...

Sir mee "bengan bharya" Vantakamu tayaarilo meeru vaadina maandaleekamu chaalaa baagundi. Mee tamashaagaa vivarinchadamu chaalaa anchchindi

శ్రీ said...

Thanks mastaru!

sapna said...
This comment has been removed by the author.
sapna said...

Sri garu,Eee Bharya vantakam,Bharthalu chesthene Ruchi ani isthe inka bavundedi..
Thanks for the recipe.

శ్రీ said...

You are welcome Sapna garu