Tuesday, September 8, 2009

జోష్ - నాగ చైతన్య ఆరంగేట్రం

టీవీలో సీ.ఎన్.బీ.సీ చూస్తూ ఉన్న సినీ నటుడు నాగార్జునతో కాలేజి నుండి అపుడే ఇంట్లోకి వచ్చిన కొడుకు నాగా చైతన్య ఇలా అన్నాడు.

నాగ చైతన్య: నానా..నేను సినిమాల్లో యాక్ట్ చేస్తా నానా

నాగార్జున: అలాగే నీ ఇష్టం. "ఈ మధ్య నా సినిమాలు ఏవీ సరిగ్గా ఆడడం లేదు. నువ్వు కూడా సినిమాలు మొదలుపెడితే వేణ్ణీళ్ళకి చన్నీళ్ళు లాగా కొంత వెనకేసుకోవచ్చు" అని గొణుక్కున్నాడు.

నాగ చైతన్య: ఏంది నానా, గొణుక్కుంటున్నావ్

నాగార్జున: ఏమీ లేదురా. మనింట్లో తాత సినిమాలు,నా సినిమాలు ఉన్నాయి. రోజూ వాటిని బాగా చూస్తూ ఉండు. నీకు యాక్టింగ్ అలవాటవుతుంది.

నాగ చైతన్య: అలాగే నానా.


నాగ చైతన్య ఒక 10 రోజులు తాతా,నాన్న సినిమాలు విరగ చూసాడు. తాత సినిమాల్లో బాగా ఓవర్ గా చేస్తున్నాడనిపించింది. నాన్న విషయంకి వస్తే ఫేసులో ఏమీ ఎక్స్ ప్రెషన్ కనపడ్డంలేదు ఎంత జూం చేసినా. అసలు విషయం నాన్ననడిగి తెలుసుకోవాలని నాన్న సెల్ ఫోనుకి కాల్ చేసాడు.

నాగ చైతన్య: హలో నానా

నాగార్జున: ఆడగొంతుతో "హలో ఎవరూ?"

నాగ చైతన్య: హలో, నేను చైతుని మాట్లాడుతున్నాను.

నాగార్జున: ఓ..చైతూ! నేను టాబూని.ఎలా ఉన్నావ్? సినిమాల్లోకి వస్తావంట కదా! నాగ్ చెప్పాడు.

నాగ చైతన్య: అవును పిన్నీ (సిగ్గు పడ్డాడు చైతు)

నాగార్జున: "అంతొద్దులే కానీ, ఇదుగో నానతో మాట్లాడు" అని టాబూ ఫోను నాగ్ కి ఇచ్చింది. నాగ్ మాట్లాడుతూ "ఏందిరా..ఫోన్ చేసావ్?" అన్నాడు.

నాగ చైతన్య: ఏమీ లేదు నానా.నేను 10 రోజుల నుండీ తాతవీ,నీవీ సినిమాలు చూస్తూ ఉన్నా.తాతేమో వంకర్లు తిరుగుతూ టూమచ్ యాక్టింగ్ చేసాడు. నువ్వేమో నీరసంగా ఎక్స్ ప్రెషన్ లేకుండా ఉన్నావ్? అలా ఉండడం ఇప్పటి ఫాషనా నానా?

కిసక్కు మంటూ నవ్వింది టాబూ.

నాగార్జున: తాత రోజుల్లో నాటకాలు బాగా ఉండేవిరా. అప్పట్లో ఒక రూపాయకి 10 రూపాయల యాక్షన్ చేసేవారు.నాకా యాక్షన్ పెద్దగా రాదు. నీరసంగా ఉండేవాడినని నిలబడడానికి ఒక కుక్క ని కూడా ఇచ్చారు ఎదో సినిమాలో.

నాగ చైతన్య: ఆ...విక్కీదాదా సినిమా నానా. మూడు రోజుల ముందు చూసా. బాగా దారుణంగా యాక్టింగ్ చేసావ్ నానా ఆ సినిమాలో నువ్వు.

నాగార్జున: ఏమి చెయ్యమంటావ్! నాకంతే వచ్చు. ఇపుడు చూడూ, మొన్న కింగ్ లో చింపేసాను అని ఫాన్స్ అందరూ విపరీతంగా అన్నారు. చేస్తూ ఉంటే అదే వచ్చేసద్ది. యాక్టింగ్ ఏమన్నా రాకెట్ సైన్సా?

నాగ చైతన్య: నేను యాక్టింగ్ బాగా నేర్చుకుంటాను నానా. పూణే కి వెళ్ళమంటావా?

నాగార్జున: ఈ పూణా ఇన్స్టిట్యూట్స్ మన లాంటి వాళ్ళకి కాదురా. అవన్నీ ఎవడో అనామకులకి. ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్నాం మనం, మనం కాకపోతే ఇంకెవడు ఉంటాడు హీరోగా ఇక్కడ?

నాగ చైతన్య: సరే. నేను ఫైటింగు, హార్స్ రైడింగు నేర్చుకుంటా నానా.

నాగార్జున: మళ్ళీ ఇదెక్కడి గొడవరా నాకూ. ఫైటింగ్,హార్సు రైడింగ్ చెయ్యడానికి డూప్ ఉంటాడు కదా. నువ్వెందుకు కెళుక్కుంటావ్? నాకు ఖాళీగా ఉన్నపుడు నాకు తెలిసింది నీకు నేర్పిస్తాలే.

నాగ చైతన్య: ఒద్దులే నానా. నేనే నేర్చుకుంటా.

నాగార్జున: సరేలే. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావ్ కానీ.


కొన్ని రోజుల తర్వాత నాగ చైతన్య "జోష్" సినిమాలో నటించడం మొదలుపెట్టాడు. అది చివరకి రిలీజ్ కూడా అయింది. చూసిన వాళ్ళందరూ "నాగ చైతన్య లో జోష్ లేదు" అన్నారు. "వీడి నాన్న లాగే వీడు కూడా" అని కొందరు పెదవి విరిచారు. "ఇంత కష్టపడి యాక్టింగ్ చేస్తే ఇలాగెలాగయ్యింది" అనుకుని నాన్నతో మాట్లాడుదామని నాన్న రూముకి వస్తే నాన్న లేడు.

టామీకి తలస్నానం చేపిస్తూ ఉన్న అమలతో "అమా..నానెక్కడా" అనడిగాడు.
"పతా నహీ బేటా!" అని పెదవి విరిచింది అమల.

ఫోన్ చేద్దామని నాన నంబరు డయల్ చేసి "హలో" అన్నాడు.

"హలో, యారప్పా?" అవతల ఆడ గొంతు.

నాగచైతన్య: నేను చైతూని. నీ యార్?

త్రిష: నా త్రిషప్పా. నీ ఎప్పుడి ఇరిక్కే చైతూ?

నాగచైతన్య: పరవా ఇల్లే. అప్పాకి ఫోన్ కుడుంగా

త్రిష: "ఎన్నంగో, నింగ పయ్యా" అని ఫోను నాగార్జునకి ఇచ్చింది

నాగార్జున: ఏందిరా? సినిమా అలాగయింది

నాగచైతన్య: ఏమో నానా. అందరూ నాకు ఇంకా యాక్షన్ రాలేదు అంటున్నారు

నాగార్జున: నా దగ్గర కాకుండా ఎవడో పుడింగి దగ్గర కెళ్తానన్నావ్. వాడు సరిగ్గా నేర్పించలేదా?

నాగచైతన్య: ఎవరో పుడింగి కాదు నానా. నీకు సరిగా రాదని, సుమంత్ మామయ్య దగ్గర నేర్చుకున్నా

నాగార్జున: ఎంత పని చేసావ్ రా! వాడికి నేర్పించింది నేనే కదా ???


నాగచైతన్య: అయ్యో నానా.....

42 comments:

వీర said...

సెటైర్ అదిరింది

Nanda said...

కేక..
మొన్నాదివారం జోష్ కెళ్లాను. ఒక్క సీన్ ఒకలాగ యాక్ట్ చేశాడేంటా అనుకుంటున్నా. ఇదన్నమాట సంగతి.

పరిమళం said...

:) :)

శ్రీ said...

@ వీర, నంద, పరిమళం,

నెనర్లు!

Sravya V said...

Superb !

శ్రీ said...

@ శ్రావ్య వట్టికుటి,

నెనర్లు!!

Venky said...

అదిరింది :) :) :)

Unknown said...

bagundhi

శ్రీ said...

@ వెంకీ, జగన్,

మీకు నచ్చినందుకు సంతోషం!

gaalibabu said...

బబ్బబ్బా బాగుంది... త్రిష బదులు అనుష్కా ని పెట్టి వుంటె ఇంకొంచెం బాగుండెది...

శ్రీ said...

@ గాలిబాబు,

నిజమే!

క్లైమాక్స్ రాయడంలో సహకరించినందుకు మీకు థాంక్స్.

కొత్త పాళీ said...

హ హ హ. భలే.
త్రిషకి బదులు అనూష్క ఎందుకుండాలో నాకర్ధం కాలేదు.
కానీ మనలో మాట, నాకు సుమంత్ నటన బానే ఉందనిపిస్తుంది.

శ్రీ said...

@ కొత్తపాళీ,

ఉత్తినే! నాగార్జునకి త్రిష కంటే అనూష్క క్లోజ్ అని మన గాలిబాబు (ఎవరో కాదు, మన గణేష్!) గాసిప్.

నిజమే! సుమంత్ కొంచెం పరవాలేదు.

Anonymous said...

కేక, మంచి హాస్యభరితంగా రాసారు.

శ్రీ said...

థాంక్స్ అనానిమస్

చైతన్య.ఎస్ said...

హ హ సూపర్

శ్రీ said...

థాంక్స్ చైతన్య

భావన said...

:-) :-) మీరు మరీనూ

లక్ష్మి said...

నటన సంగతి పక్కన పెట్టండి, హీరో కాదు కదా వాడి పక్కన సైడు కారక్టర్ వెయ్యగలిగే మినిమం గ్లామర్ లేని ఈ తేడా ఫొటోలని మనమీదకి సంధించి హింసిస్తున్నారు. నిన్న రాం చరణ్, ఈ రోజు నాగ చైతన్య, రేపెవడో... హతవిధీ

శ్రీ said...

@ భావన, --)

@ లక్ష్మి, వెంకటేష్ అన్న కొడుకు దిగబోతున్నాడు తొందరలో

మంచు said...

బావుంది .
BTW
నాగ చైతన్య కి అమల కూడా పిన్నేకదా :-)
త్రిష బదులు అనుష్కా ని పెట్టి వుంటె బాగుండెది...

Anonymous said...

Good one buddy

Kiran said...

Rocks..keep it up

శ్రీ said...

@ మంచుపల్లకి,

థాంక్స్. పై కామెంట్స్ లో గాలిబాబు కూడా మీలాగే చెప్పారు.

@ అనానిమస్,

నెనర్లు అనానిమస్

@ కిరణ్,

థాంక్స్

శ్రీ said...

జోష్ మీద మీరు రాసింది బాగుంది... మీరు detriot లో నే ఉన్నట్టు గా ఉన్నారు ... మీటింగ్ లో కలుస్తారు అనుకుంటా అయితే ...

శ్రీ said...

థాంక్స్ శ్రీ గారు. మీరు నన్ను మీటింగ్ లో చూసే ఉంటారు. వచ్చే వారాంతం కలుద్దాం.

కొత్త పాళీ said...

తెలుగు సినిమా శ్రీ! కాలాస్త్రి శ్రీ మీరు అటెండయిన ఉమామహేశ్వర్రావుగారి సభలోనూ ఉన్నారు ఆ రోజు. ఈ సారి పరిచయం చేస్తాను.

jeevani said...

అదరగొట్టారు సర్! నవ్వు తెరలు తెరలుగా వస్తూనే ఉంది....

Bhãskar Rãmarãju said...

కె కె!!
రాణా, రాణా రాబోతున్నాడు. జాగ్రత్త!!!

శ్రీ said...

@ జీవని, సంతోషం!

@ భాస్కర్ రామరాజు, అతను చూస్తే ఆర్నాల్డ్ లాగా 6అడుగుల పైనే ఉన్నాడు.

భవధీయుడు said...

అదిరింది మామా!నీలో గొప్ప విమర్శకుడున్నాడు,బాగుంది.

శ్రీ said...

నెనర్లు హిందూపూర్ కుమార్

oremuna said...

సూపరో సూపర్

శ్రీ said...

నెనర్లు కిరణ్

GKK said...

the write-up has been uncharitable to ANR,Nag and sumanth. I am not a great fan of them. Still ANR is a legend. They are not born actors. Still, they have developed over years. Don't we come up in life being imperfect? Nag, in spite of his limitations has excelled in some roles. Everyone cannot be SVR and Savitri. Satire is one thing. Being derogatory is another. There is a thin line. ఈ పోస్టు ఆనందించలెక పోయాను. సారీ

Anonymous said...

చాలా బాగా రాశారు. కానీ చెణుకులలా ఉంచి వాస్తవానికొస్తే నాగార్జున మీద సుమంత్ చాలాచాలా నయం. బహుశా అవకాశాలిస్తే భవిష్యత్తులో విఱగదీసెయ్యగలడేమో కూడా !

-- తాడేపల్లి

శ్రీ said...

@ తెలుగు అభిమాని, తెలుగు అభిమాని అని పేరు పెట్టుకుని వేరే భాషలో ఎందుకు రాసారో?

@ తాడేపల్లి, అవును. సుమంత్ కి కొన్ని మంచి సినిమాలే ఉన్నాయి.

Anonymous said...

excellent

శ్రీ said...

థాంక్స్ నాగోడు

Unknown said...

Super

Unknown said...

Super 👍

Unknown said...

Super