Thursday, September 3, 2009

ఎడుగూరి సంధింటి రాజశేఖర్ రెడ్డికి నివాళి

అరోగ్యశ్రీ,ఇందిరమ్మ పధకాలతో ప్రజల గుండెల్లో నిద్రించిన వైఎస్ నల్లమల అడవుల్లో ప్రయాణిస్తూ హెలికాప్టర్ కూలడంతో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.వై ఎస్ హెలికాప్టర్ నిన్నటినుండి కనపడకపోవడం నుండి ఈ విషాద వార్త వరకు మా ఆఫీసులో ఒకటే చర్చలు.హెలికాప్టర్ ఏమయింది? ఎక్కడయైనా అత్యవసరంగా దించి,అక్కద నుండి అడవిలో నడుచుకుంటూ వస్తున్నారా?ఒకవేళ అలా నడుస్తూ ఉంటే నక్సలైట్స్ కానీ కిడ్నాప్ చెయ్యరు కదా?లేకపోతే నక్సలైట్స్ హెలికాప్టర్ ని పేల్చేసారా? ఇలాంటి అలోచనలతో నిన్నంతా గడిచిపోయింది. సాయంత్రమయ్యేసరికి కొందరు జాలర్లు చెప్పిన ప్రకారం "ఎదో పేలిన శబ్దం వినిపించింది" అలాగే నీళ్ళలో ఆయిల్ మరకలు కనిపించాయని చెప్పారంట. రాస్ట్రంలో కెల్లా ముఖ్య వ్యక్తిని వెతకడానికి ఇన్ని గంటలా? అని కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేసారు. కాలం చెల్లిన హెలికాప్టర్ ని ఎందుకు వాడాడు? అని ఇంకొంత మంది. సరే వాడాడు, శాటిలైటు ఫోను ఎందుకు తీసుకు వెళ్ళలేదు అని ఇంకొందరు. మరి కొంత మంది అయితే "వైఎస్ చనిపోయాడని ప్రభుత్వానికి తెలిసినా రాజకీయ సంక్షోభం,భద్రత దృష్ట్యా వార్తని పక్క రోజు వరకు ఆపారు" అని. ఇలా ఊహాగానాలతో,చర్చలతో నిన్న గడిచింది.


ఈరోజు మధ్యాహ్నం ఒక సంతాప సభ లాంటిది పెడితే ఎలా ఉంటుంది అన్న అలోచన వచ్చింది. వచ్చిందే తడవు స్నేహితులందరికి కబురు పంపి, 4 గంటలకు అందరూ కలిసేలా తీర్మానించాం. వైఎస్ గురించి మాట్లాడడానికి మంచి మెటీరియల్ కోసం నేను బ్లాగులు,సాక్షి,ఈనాడు,ఆంధ్రజ్యోతి వెతికా. వైఎస్ జీవిత విశేషాలు సేకరిస్తే బాగుంటుందని అనుకున్నా,మళ్ళీ అందరూ ఈపాటికి అవి చదివి ఉంటారని మంచి నివాళి బ్లాగులు ఏమన్నా ఉన్నాయేమోనని బ్లాగులు గాలించా. అన్నిట్లోకీ మేఘనా బ్లాగులోని "నిండు మనిషీ ....నీకు సలాం" అన్న టపా చాలా నచ్చింది. మేఘనా సంజయ్ (ఇది పేరనుకుంటా) టీవీ జర్నలిస్టుగా పని చేస్తూ ఉన్నారంట. పేరు చూసి అమ్మాయేమో అనుకున్నా, ప్రొఫైల్ లో అబ్బాయి అని రాసుంది. కవిత చాలా నచ్చి ఇది సభలో చదివితే బాగుంటుందని ఆ కవిత ప్రింట్ చేసి జేబులో పెట్టుకుని సభకి వెళ్ళా.


ఎక్కువ నోటీస్ లేకుండానే ముప్పయ్ మంది మీటింగ్ కి వచ్చారు. వచ్చిన వారందరూ వైఎస్ గురించి రెండు మాటలు మాట్లాడాలని నిర్ణయించుకున్నాము. ఒక పార్టీకి చెందిన మీటింగ్ లాగ కాకుండా మనందరికీ తెలిసిన వ్యక్తిగా అందరూ కొన్ని మాటలు మాట్లాడారు. నేను చదివిన కవితకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేఘనా సంజయ్ గారికి ఈ టపా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వై ఎస్ తో ప్రత్యక్షంగా,పరోక్షంగా పరిచయం ఉన్న కొంతమంది తమ అనుభవాలని మాతో పంచుకున్నారు. అరోగ్యశ్రీ,ఇందిరమ్మ పధకం,అంబులన్స్ సదుపాయల గురించి కొంతమంది వైఎస్ ని పొగిడారు. తన వాళ్ళని బాగా గుర్తు పెట్టుకుని పేరు, పేరునా పలకరించి అవసరమయితే బాగా సహాయం చేసాడని చెప్పారు.


ఇపుడు జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే జగన్ మన తదుపరి ముఖ్యమంత్రి అయ్యేటట్లు కనబడుతున్నాడు.అదే జరిగితే అతి చిన్న వయసులో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి రికార్డ్ సృష్టిస్తాడు. వైఎస్ కి వెనక నుండి సపోర్ట్ చేసినట్టే జగన్ కి కూడా కెవీపీ సహాయం చేస్తాడు ఎలాగూ. తండ్రి తలపెట్టిన కార్యాలని కొడుకు పూర్తి చేస్తాడని ఆశిద్ద్దాం. నాగార్జున కొడుకు నాగచైతన్య హీరోగా వస్తే మనం ఆదరిస్తాం.వైఎస్ కొడుకు జగన్ సీ.ఎం అవుతానంటే మనం ఆపుతామా ఏంది?


60 ఏళ్ళు జీవితం సాగించి ఇక సెలవు తీసుకున్న రాజశేఖరుడి ఆత్మకి శాంతి కలుగుతుందని ఆశిద్దాం. అతడి కుటుంబ సభ్యులకి తగినంత ధైర్యం ప్రసాదించమని పై వాడిని వేడుకుందాం.

7 comments:

raj said...

Bagundandi ..thandri pothe kodukuki imani baaga cheparu ... idhi rastam anukuntunnara ... ysr gari company vyavaharam ani kani anukunnara

Praveen Sarma said...

మామ పేరు చెప్పుకుని రాజకీయాలలోకి వచ్చిన చంద్రబాబు ఎలాంటి నీచమైన పనులు చేశాడో తెలియదా? వారసత్వంగా పదవులు ఇస్తే ఇలాగే అవుతుంది. కనుక ముఖ్యమంత్రి పదవి రోశయ్యకి ఇవ్వడమే మంచిది.

శ్రీ said...

@ రాజ్,నేను ఇవ్వమనడం లేదండీ! జరుగుతున్న విషయం రాస్తున్నా.

@ ప్రవీన్ శర్మ, రోశయ్యకి అంత సీన్ లేదండీ!

Anonymous said...

బాగా చెప్పారు..
ఈరోజు శ్రద్దంజలి ఘతిస్తున్న సోనియానూ, రాహుల్ ని చూసారా?? అస్సలు విశ్వాసం గానీ, స్పందన గానీ లేదు వెధవలకి...
మొక్కుబడి ఎలాగో కానిచ్చేసి డిల్లీకి వెళ్ళిపోయారు....

ఇక ఈ రాష్ట్రానికి ఆదేవుదే దిక్కు ...!!!
కాంగ్రేస్ పతనం ప్రారంభమైంది...

శ్రీ said...

@ అనానిమస్, కాంగ్రెస్ కి ఇది నిజంగా కష్టకాలం. మళ్ళీ పాత కాంగ్రెస్ అవడానికి ఎక్కువ సేపు పట్టదు. ముఖ్యమంత్రిగా ఎవరొచ్చినా ఈ టెర్మ్ కొంచెం రఫ్ గానే ఉంటుంది.

పరిమళం said...

ఆయనకు , ఆయనతోపాటూ చనిపోయిన వారికీ ఆత్మశాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నా !

kotha kamalakaram said...

ఎప్పుడూ ఆ రెండుకులాలేనా? అంటూ బాధపడుతూన్నవారి సంతృప్తి కోసం (ఈ విషయమై ఒక పార్టీ కూడా పుట్టుకొచ్చింది కదా?), ఒక విధంగా మైనార్టీ కులస్థుడు, అనుభవజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు, పాతతరానికి చెంది ఏవిధమైన అవినీతి ఆరోపణలు లేని (మచ్చలేని, కాకపోతే నోరు మాత్రం...) రోశయ్యనే ముఖ్య మంత్రిగా కొనసాగించడం - అటు కాంగ్రెస్ పార్టికి, ఇటు రాష్ట్ర ప్రజలకు మేలు..