Thursday, August 9, 2012

జులాయి - రెండు మూరల కథ, మూడు మూరల పం(చ్)చెలు


తారాగణం: అల్లు అర్జున్, ఇలియానా, సోనూ సూద్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు
నిర్మాత: దానయ్య
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
దర్శకత్వం: త్రివిక్రం శ్రీనివాసరావు

క్లుప్తంగా కథ: పైడి వరదరాజులు (కోట శ్రీనివాస రావు) బిట్టు (సోనూ సూద్) తో కలిసి కో-ఆపరేటివ్ బ్యాంకుని బాంకుని దోచుకుందామని ప్లాన్ వేసి సగం  పని పూర్తి చేస్తారు.  జులాయిగా తిరుగుతూ ఉండే రవి (అల్లు అర్జున్) బిట్టు దోపిడికి అడ్డు తగులుతాడు.  బిట్టు, వరదరాజులు పధకం ప్రకారం బ్యాంకు డబ్బులు ఇంటికి తీసుకువెళ్తారా? జులాయి రవి వీళ్ళిద్దరినీ ఆపగలిగాడా?  ఇంతే, సినిమాలో ఇంతకు మించి కథ పెద్దగా లేదు.

రెండు మూరల కథ, మూడు మూరల పం(చ్)చ డైలాగులతో సినిమా నడిపించేసాడు త్రివిక్రం. శీను దర్శకత్వంలో ఆల్లు అర్జున్ నటించడం మొదటిసారి.  యధాతధంగా అర్జున్ స్టెప్పులేసేసి కూసంత కామెడీ చేసేసి చేతులు కడిగేసుకున్నాడు. పాటల్లేని సినిమాల్లో ఇతగాడు ఏమి చేస్తాడో, ఏమిటో? సినిమాని మొయ్యడానికి బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ బాగనే కష్టపడ్డారు. ఆలీ ఒకటి, రెండు సార్లు చమక్కుమని మెరిసి వెళ్ళిపోతాడు. ఇలియానా ఇంకొంచెం సన్నగా అయింది, ఈమె నడుము రోజు, రోజుకీ గురుత్వాకర్షణ శక్తిని సవాల్ చేసేలా మారుతోంది. 

దేవిశ్రీ సంగీతం అంత బాగాలేదు, కొన్ని పాటలు బోర్ కొట్టాయి. సినిమాలో హీరోకి, విలనుకి అంతుపట్టని తెలివితేటలు ఉంటాయి. ఒకరి మీద ఒకరు ఎత్తుకు, పై ఎత్తులు వేస్తూ మనల్ని అలరిస్తూ ఉంటారు. త్రివిక్రం మాటలు ఎప్పటి లాగే బాగున్నాయి. నాయకుడు, ప్రతినాయకుడి చేత మంచి పంచులే కురిపించాడు. ఈ సినిమాని త్రివిక్రం తొందరగానే తీసాడు (తీయడానికి ఇక్కడ ఏమి ఏడిచి చచ్చింది...?).

విశ్రాంతి ముందు చేజింగ్ సీన్ లీథల్ వెపన్ ఒకానొక పార్టు నుండి గ్రహించారు. సినిమా విశ్రాంతికి రాగానే మనకి కథ పూర్తిగా తెలిసిపోతుంది. అందుకే రెండో సగంలో కిక్కు లేదు. కాకపోతే అల్లు అర్జున్ రేంజికి ఇది సరిపోతుందేమో? ఇలియానాని చివరలో మర్చి పోయారు, అమ్మడు సినిమా షూటింగ్ ఒక వారం ముందే ముగించుకుని గోవా వెళ్ళిపోయినట్టుంది.

కట్ చేస్తే ఒక సాధారణ సినిమా, కొంచెం సరదాగా సక్సెస్ టూరేసుకుని హడావిడి చేస్తే అమాయకప్రజలు ఒకసారి చూసుకోవచ్చు.  
  

6 comments:

Anonymous said...

మీరు మెగా సినిమాని బాగుంది అన్నారంటే, అది సూపర్ హిట్ అని ఫిక్సయిపోవచ్చన్నమాట!

రవి said...

హహ్హహ్హ, సమీక్ష అదుర్స్. సకెస్ టూరు రేపో, ఎల్లుండో మొదలవుతుంది లెండి. ఇప్పటికే మా మ్యూజిక్ లో కనబడిన వాళ్ళందరితో భజన చేయిస్తున్నారు. అప్పుడే సినిమా ఏవరేజీ అని తెలిసింది. ఎనీవే ఒకసారి చూసొస్తా.

శ్రీ said...

ఒకసారి చూడచ్చమ్మా...

శ్రీ said...

థాంక్స్, తప్పక చూడండి.

Rahul Dev said...

mee review ni REVIEW chesa... "అల్లు అర్జున్ రేంజికి ఇది సరిపోతుందేమో?" ee type of personal abuse tappithe review bagundhi...

శ్రీ said...

థాంక్స్