భారత దేశ చరిత్ర లో స్త్రీ కి ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. పురణాల్లో స్త్రీ ఒక దేవత గా పూజింపబడుతూ ఉంటుంది. కాని నిజ జీవితంలో స్త్రీని ఒక అట వస్తువుగా, మగవాడి కి బానిసగా ఉండబడుతుంది. ఇటువంటి కధనే నేపథ్యంగా తీసుకుని నిర్మించినటువంటి సినిమానే రాఖీ.
NTR తన సహజ శైలి లొ నటించాడు. ఇలియాన ఎపపటి లాగే ఏడుపు మొహంతో నటించింది. రాఖీ..రాఖీ అన్న పాట బాగా ఉంది, మిగిలినవి పరవాలేదు అన్నట్టున్నాయి. కథ లో పట్టు ఉండేసరికి ఎక్కడా బోరు కొట్టలేదు.
చివరగా అసలు మాట, భారతీయుడు సినిమా వచ్చినపుడు ఆహా..ఇంక ఇండియా లో లంచగొండితనం పోతుందేమొ అని అనుకున్నా! అలాగే ఒకే ఒక్కడు చూసినపుడు ఇక రాజకీయనాయకులు మారిపొతరెమో అనుకున్న! కొంచెం నిలకడతో అలోచిస్తే తెలిసింది, ఇవన్నీ జనాన్ని సినిమకు పోగు చేయడం కొసం తప్పితే ఎందుకూ పనికి రావు. సినిమా చూసి చప్పట్ట్లు కొట్టి ఇంటికి వెల్లడమే.
No comments:
Post a Comment