Monday, March 19, 2007

దియా పుట్టింది


మార్చ్ 15 గురువారం రోజున సాయంత్రం 6:29 కి దియా పుట్టింది. మామూలు కానుపే, షాలిని, దియా ఇద్దరూ బాగనే ఉన్నారు.
షాలిని నాకు గురువారం ఉదయం 9.30, 10 మద్యలో ఫోను చేసి హాస్పిటల్ కి వెళ్ళాలనింది. ఇంటికి వచ్చి నేను, షాలిని, వాళ్ళ అమ్మ ఇంకా నిఖిల్ తయారయ్యి 11 కి హాస్పిటల్ చేరాము. అక్కడ దాక్టరు షాలిని లేబర్ ఉందని చెప్పాడు. నొప్పులు ఎక్కువ కావడం మొదలయ్యాయి. మధ్యాహ్నం 2కి epidural ఇచ్చారు, దానివల్ల నొప్పి తగ్గింది. 4.30 నుండి డెలివరి కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి, డాక్టరు మోలిన్స్ కి పిలుపు అందించాము. ఆయన వచ్చి షాలిని చేత pushing excersizes చేపించమన్నాడు. అప్పటివరకు duty లొ ఉన్న నర్సు చాలా ఓపిగ్గా చేపించింది, 6కి ఆమె shift అయిపోయింది, అప్పుడే duty లొకి ఎక్కిన నర్సు షాలిని వంక ఓరకంటితో చూసి, ఎమిటి సంగతి అని పాత నర్సు దగ్గర వివరాలు కనుక్కుంది. అప్పుడు మొదలయింది అసలు సినిమా, అమె షాలిని చేత ఒకసారి పుష్ చేపించి, ఇంకొక 10 నిముషాల్లో నీకు డెలివరీ అయిపోతుంది అని చెప్పి డాక్టరును పిలిపించుకు వచ్చింది. డాక్టరు గవును వేసుకుని దియా, "welcome to light" అన్నాడు. నిజంగానే 6:29కి దియా ఈ ప్రపంచంలోకి వచ్చేసింది. పక్కన ఉండే ఫొటో శుక్రవారం సాయంత్రం తీసినది.

9 comments:

రాధిక said...

మీకు ముందే పండుగ వచ్చేసిందన్న మాట.పాప పేరు బాగుంది.శుభాకాంక్షలు.

Naga said...

శుభాకాంక్షలు.

farook said...

congrats

spandana said...

శుభాకాంక్షలు.

--ప్రసాద్
http://blog.charasala.com

Murali Nandula said...

బసూగారూ: మీకూ, శాలినిగారికీ అభినందనలు.

v_tel001 said...

శుభాకాంక్షలు !

శ్రీ said...

అందరికి థాంక్స్! అలాగే నూతన సంవత్సర సుభ్హకాంక్షలు!

Anonymous said...

మీకు ఉగా..దియా శుభాకాంక్షలు.


విహారి

శ్రీ said...

బాగుంది విహారి, వికటకవి లాగా చెప్పారు