Monday, May 7, 2007

అడవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే


సినిమా విడుదల కాకముందు పాటలు విని సినిమా అడుతుందా? లేదా అనిపించింది. ఇక దర్శకుడు ఇంతకుమునుపు నిర్మించిన చిత్రం 7G బ్రందావన కాలనీ! ఇందులో బాగా ఏడుపుగొట్టు సన్నివేశాలు ఉన్నాయి. ఈసారి AMAV (అడవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే) ఎలా ఉంటుందో అనుకున్న! నా అంచనాలకు భిన్నంగా చాలా చక్కగా ఉంది సినిమా. వెంకటేష్ చాలా బాగా నటించాడు, ఇక పాటలు అయితే గుచ్చుకొనేటట్లుగా ఉన్నాయి. కథ కూడా హడవిడి లేకుండా చాలా హాయిగా కొంచెం బరువుగా సాగింది. ఎన్ని సంవత్సరాలైనా ఉద్యోగం రాని వెంకటేష్ ని ఇక నిన్ను భరించడం నా వల్ల కాదంటూ తండ్రి కోట శ్రీనివాసరావు జోడి చాలా బాగా ఉనింది. వెంకటేష్ కి ఉద్యోగం వచ్చాక త్రిషతో ప్రేమలో పడి విఫలం అవుతాడు. ఈలోపల కోట కన్నుమూయడం, త్రిషకి తన స్నేహితుడితో పెళ్ళి నిశ్చయమవడం కధని రసపట్టులోకి తీసుకువెడుతుంది. చివరికి త్రిష మనసు ఎలా గెలుచుకున్నడు అనేది బాగా ఉంటుంది.

"ఏమైందో ఈ వేళ..." పాట చాలా బగుంది. ఇంకా అందాల ఓ తారకా..." పాట కుడా చాలా బాగుంది. త్రిషని, అలాగే అన్ని సన్నివేశలని చాలా అందంగా చిత్రీకరించారు.

5 comments:

రాధిక said...

మనకున్న మంచి చిత్రాలలో [ఉన్నంతలో మంచి,ఫామిలీ మొత్తం చూసే చిత్రాలు అనొచ్చేమో] వెంకటేష్ సినిమాలు తప్పకుండావుంటాయి.ఇదీ ఆ కోవలోకె వస్తుందని నేను టైటిల్ చూసే అనుకున్నాను.

శ్రీ said...

నిజమే రాధిక గారు! వెంకటేష్ సినిమాలు ఇంట్లో అందరూ చూడగలరు.

Srini said...

Anduke kada venkatesh fans lo ladies ekkuva =ga untaaru..

Anonymous said...

I felt exactly the same after watching this movie. We should appreciate this kinda clean movies.

Find my review at http://www.janakiramm.net/blog/PermaLink.aspx?guid=4f18b59c-f9af-422d-90d2-02542a79ee5d

Hari Mallepally said...

baagundandi mee poastu.