Monday, February 4, 2008

వానలో తడిసి జలుబు చేసింది


2 వారాల క్రితం చూసాను ఈ సినిమా "వాన". ఇది కన్నడంలో బ్రమ్హాండంగా ఆడిన "ముంగారు మల్లె" కి అనువాదం. ఈ సినిమాతో M.S రాజు దర్శకుడిగా ఆరంగేట్రం చేసాడు. ఇక కధలోకి వస్తే కధానాయకుడు (విజయ్) గాలికి తిరుగుతూ ఉంటాడు. అతనికి ఒక అందమయిన అమ్మాయి (మీరా చోప్రా) కనిపించి మాయమైపొతుంది. అనుకోకుండా ఆ మీరా మళ్ళీ ఇతనికి తారసపడుతుంది. మీరా ఆట పట్టిస్తూ ఉన్న సమయంలో అసలు నిజం తెలుస్తుంది, ఏమిటంటే మీరాకి ఇంకొక వారంలో పెళ్ళి అని. ఈ లోపల మీరాకి కుడా విజయ్ అంటే ప్రేమ మొదలవుతుంది. ఇలా మొదలయి చివర్లో అంతుచిక్కని మలుపుతో సినిమా ముగుస్తుంది.

సినిమాలో పాటలు చాలా బాగున్నయి. ఆకాశ గంగా..దూకావే పెంకితనంగా, ఇంక "ఎదుట నిలిచింది చూడు" పాటలు మనల్ని సినిమా వదిలినా వెంటాడుతూనే ఉంటాయి. పాత సినిమలో పాట "కురిసింది వాన" ని "సిరిమల్లె వాన" గ సరదాగ మార్చారు.

No comments: