Friday, February 29, 2008

పెంచలకోన



ఈరోజు అంతర్జాలంలో చక్కర్లు కొడుతూఉన్నపుడు "పెంచలకోన" కనిపించింది. ఈ సుందర ప్రదేశాన్ని తోటి బ్లాగర్లకు పరిచయం చేసేద్దామనిపించింది. ఈ పుణ్యక్షేత్రం నెల్లూరులో రాపూరు మండలంకి 35 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మద్య పెనుశిల నరసిమ్హ స్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెంచలస్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మద్యలో బ్రమ్హోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ. తిరుమల బ్రమ్హోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు కుడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసారని అంటూఉంటారు. మాములు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది, వేసవిలో మాత్రం కిటకిట లాడుతుంది. చుట్టుపక్క గ్రామాలవాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టర్కి, లేకపొతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు. నా చిన్నప్పటినుండీ ప్రతి సంవత్సరం మా కుటుంబమంతా ఇక్కడకు వస్తూనే ఉంటాం! మొదటసారి నేను 2వ తరగతి పొదలకూరులో చదువుతున్నపుడు మా స్కూలు నుండి పిల్లలందర్ని మా ఉపాధ్యాయురాలు తీసుకొచ్చారు. ఇక్కడకి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు మరియు నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి. ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి కాని అంత అనువుగా ఉండవు. కాకపొతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడుతారు. ఈసారి మీరెప్పుడయినా నెల్లూరు వైపు వస్తే పెంచలకోన తప్పకుండా చూడండి.

2 comments:

కొత్త పాళీ said...

కాలాస్త్రి మిత్ర కేసరీ ..ఈ వచ్చే మీటింగుకి మేస్టారొస్తున్నారు .. హాజరేయించుకో పోతే డేంజరు! :)తప్పక రండి !!

శ్రీ said...

తప్పకుండా వస్తానండీ! నాతో పాటు ఒక అతిథిని కుడా తీసుకువస్తాను.