Friday, April 4, 2008

జల్సా - మీతో చేయిస్తుంది సల్సా


2 సంవత్సరాలనుండీ నిర్మణంలో ఉన్న జల్సా ఎట్టకేలకు ఏప్రిల్ 1 న విడుదల అయింది. పాటలు ఇప్పటికే నోట్లో బాగా నాని పొయి సినిమా ఎలా తీసాడో అన్న సంఘర్షణ నాలాంటి సగటు ప్రేక్షకుడిలో ఉత్సుకతను పెంచింది. అప్పటికే త్రివిక్రం మీద మమకారం పెంచుకున్న తెలుగు ప్రేక్షకుడిలో నేను కుడా ఒకడిని. దీఇకి తోడూ సినిమా ఒక 3,4 రోజులు ఆలస్యంగా విడుదల అవుతుందని తెలిసి నా విరహాన్ని మరింత పెంచింది. మొత్తానికి 2న "జల్సా" దర్శన భాగ్యం కలిగింది.


మొదట సగం చూస్తున్నంతసేపు త్రివిక్రం కలం నుండి రాలినటువంటి పదునుతేలిన హాస్య సంభాషణలు ఊపిరి పీల్చుకోనివ్వలేదు. ఖుషి తర్వాత చాలా సంవత్సరాల తర్వాత పవన్ కి మంచి సినిమా దొరికింది. పవన్ డైలాగుల్ని చీల్చి చెండాడాడు. ఇలియానా కుడా అందంగా కనిపించింది. సునీల్ సీక్వెన్సు సన్నివేశాలు రొటీన్ కి భిన్నంగా ఉన్నాయి. సినిమాలో వయొలెన్స్ వణికించింది.


ఇంటెర్వల్ తర్వాత ఇక కథ మొదలవుతుందేమో అనుకున్నా, చుస్తూ ఉండగానే సినిమా అయిపొయింది. అపుడర్థమయింది దీకి "జల్సా" టైటిల్ ఎందుకు పెట్టారో అని? సినిమా మొదలయ్యి 2 గంటలు గడిచినా మొదట్లో మొదలయిన కామెడీ అయిపొయేంతవరకు ఆ ఊపు ఆగలేదు.


ఎమిటిది ఎంతసేపు పులిహార సంభాషణలేనా ? కథ ఉండదా అని సగటు తెలుగు ప్రేక్షకుడిలాగ నాకు అర్ధం కాలేదు! ఈ మాత్రం సినిమా తీయడానికి 2 సంవత్సరాలు ఎందుకు పట్టిందబ్బా? అని పక్కనోడి బుర్ర బాగా గోకా!

సరే, నాకు అర్థం కాలేదు కదా మన "జీవి రివ్యు" ఎలాగుందో అని ఉదయాన్నే చదివితే ఇంచుమించు నాలాంటి అభిప్రాయేన్నే వ్యక్తం చేసాడు. కాకపొతే ఫస్టు-హాఫులోని డైలాగులు ఇంకా నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.


సరే తాడో, పేడో తేల్చుకుందామని మళ్ళీ పక్కరోజు చూసా.

నాలాగే చాలామంది వచ్చారు సినిమాకి, మళ్ళీ కమెడీ సీన్లకి తుళ్ళి పడ్డా! వయొలెన్స్ కి ఉలికి పడ్డా!! ఫష్టు హాఫు అయింది..సెకండు హాఫు మొదలయ్యింది, సినిమానే అయిపొయింది. అప్పటికి నాకు అర్థమయిన విషయం యెమిటంటే "తెలుగు సినిమా చరిత్రలో ఇటువంటి సినిమా వస్తుందని మనం ఎప్పుడూ ఊహించి కుడా ఉండం!" సినిమా ఇలా కుడా తీస్తారు అని చెప్పినటువంటి త్రివిక్రం శ్రీనివాస్ ని అభినందించకుండా ఉండలేకపొయాను. పవన్ కల్యాణ్ నట జీవిత చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. త్రివిక్రం సెటైరు డైలాగులు జిల్లుగా ఉన్న సమాజం చెంప ఛెల్లుమనిపించాయి.

3 comments:

Anonymous said...

Em babu!! Meeru Pavan ki veerabhimani ayi untaru lekapothe"jalsa mimmalni Sala cheyinchadam entandi:"

maa varaku matuku Trivikram gari idhi varaki cinemale chala bagunnayanipinchi ..Endhukante deenlo meeku Trivikram direction kanna Pavan direction ekkuava kanapadaledha? mukhyamga second half lo

శ్రీ said...

మీరు ఇంకొక సారి చూసి చెప్పండి! ఎందుకంటే ఈ సినిమా ఒకసారి చూసి జడ్జి చేయడం చాలా కష్టం! ఇంకొక విషయం యెమిటంటే సెకండ్ హాఫు ఇంకా చాలా బాగుంటుంది.

PRADEEP said...

Excellent. Titles are not clear. Try to type the title again in the box where we type our story.