ఈ మధ్య చూసిన దిక్కుమాలిన సినిమాలు కంత్రి, బుజ్జిగాడు. ఇవి చూసి అవేశంగా చిత్ర సమీక్షలు చేసేసాను. పరుగు చూసిన తర్వాత ఎందుకో రాయలేకపొయాను. పరుగు ప్రీమియర్ షో చూడడానికి వీలులేక నిదానంగా వెళ్ళడమే దీనికి కారణం అనుకుంటా. అదీ కాక అంతర్జాలంలో "అంతగా పరిగెట్టలేక పొయాడు" అని రాసారు. ఇది నాపై కొంత ప్రభావాన్ని చూపి నా ఆసక్తిని తగ్గించింది. ఎవరు ఎలా రాసినా మనకి సినిమా చూసే సరదా (దీనినే కొంత మంది "దూల" అని కూడా అంటారు) ఉండడంవల్ల ధైర్యంగా వెళ్ళాను.
లేచిపోయిన కూతురు కోసం ఒక తండ్రి పెట్టే పరుగే ఇది. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన కూతురు పెళ్ళి పీటల మీద నుండి లేచిపోతే తండ్రి పడే బాధ చూపించడంలో ప్రకాష్ రాజ్ ని మెచ్చుకోవచ్చు. అలాగే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సినిమాని ఒక లేచిపోయిన పెళ్ళితో మొదలయ్యి ఇంకొకసారి లేచిపోవాలా , వద్దా ? అన్న మీమాంశలో ప్రేక్షకుడిని పెడతాడు.
రామచంద్రపురం ని చాలా చక్కగా, తాజాగా చూపించాడు. ఇక సినిమాలో గ్లామర్ రంగం దెబ్బ తినడంవల్ల వ్యాపారపరంగా అంత గిట్టుబాటు చేయలేకపొయిందని నా అభిప్రాయం. లేచిపోదామనుకున్న ప్రేమికులు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఒకసారి అలోచిస్తే ఈ సినిమా తీసిన బొమ్మరిల్లు భాస్కర్, దిల్ రాజు ధన్యులయినట్టే.
8 comments:
పరుగు ఒక తండ్రి కూతురు కోసం పడే తపనకు ప్రతిరూపం, ఒక అమాయకురాలి ప్రేమావేశం, భాద్యత కలిగిన ప్రేమికుడి హృదయ స్పందన. సినిమా ఫక్కీకి కాస్త దూరంగా ఉన్న విలక్షణమైన, అర్జున్ అభిమనుల అంచనాలకు భిన్నంగా ఉన్న ప్రేమ కథ. భావావేశానికి కాకుండ భావ పరిణితికి ప్రాధన్యం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ప్రజాదరణ కొద్దిగ తగ్గింది.
ప్రేమించే ప్రతి మనసూ (అమ్మ, నాన్న, అబ్బాయి, అమ్మాయి) తప్పక చూడవలసిన చిత్రం.
చాలా బాగా చెప్పారు.
కాలాస్త్రి అన్నాయ్! మీరోసారి http://navatarangam.com/?p=447 లంకెచూసి కామెంటాలి. ఇందులో మనమూ ‘పరుగు’ సినిమా గురించి కృషిచేస్తునాం.
అట్టే తమ్ముడూ! మొన్నే రెండో సారి "పరుగు" సినిమా చూసా. నా అభిప్రాయాన్ని "నవతరంగం" లో గుప్పిస్తా.
Boss..
ప్రస్తుతం తమరెక్కడున్నారు? వచ్చే సోమవారం తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను.
చిరునామా వంటివి ఎవైనా ఇస్తే .. కలవడానికి ప్రయత్నిస్తా
ప్రస్తుతం డెట్రాయిట్ లో ఉన్నానండీ! ఇండియాకి వచ్చేటపుడు చెపుతాను, కలుద్దాం.
సినిమాను వేరే కోణం లోంచి పరిశీలించిన తీరు బాగుంది. తల్లి తండ్రుల్ని ఒప్పించ లేక పొవడం ఒక సమస్య. ఇంత కాలం తల్లి తండ్రులు పిల్లల్ని ఒప్పించే వారు. ఈ మార్పు ని తట్టు కోలేని వాళ్ళు దానిని లేచిపోవడంగా మట్లాడుకుంటున్నరు. దృక్పధం తొ బాటు భాష కూడా మారాలి. ఏది ఏమయిన మీ ఆలొచన విధానం బావుంది. ఇలాగే కొనసాగించండి.
బుజ్జిగాడు, కంత్రి గురించి మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తాను.
ధన్యవాదాలు gks raja గారు.
Post a Comment