Saturday, June 28, 2008

దేవేందర్ గౌడ్ - ఎన్నికల ముందు ఎత్తుగడ

ఉప ఎన్నికల తరువాత నుండి అసమ్మతి రాగాలని పలికిస్తున్న దేవేందర్ గౌడ్ తెలుగుదేశం నుండి బయట పడ్డాడు.చంద్రబాబు తో ఉంటే ఎప్పటికీ పైకి రానీయడు అని ఇప్పటికి అర్ధమయిందనుకున్నారు చాలా మంది నా లాగే!కానీ జరుగుతున్న పరిణామాలు ఒక పధకం ప్రకారం జరుగుతున్నాయని నా అనుమానం.
మొన్నటి వరకు రెండు పార్టీలతో రాష్ట్రాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్,తెలుగుదేశం కి ఈసారి తెరాస పంటి కింద రాయి అయి కూర్చుంది.కాంగ్రెస్ అధికారంలో ఉంది,మళ్ళీ ఈసారి ఎన్నికలలో డబ్బులు వెదజల్లగలదు.యెటొచ్చీ తెలుగుదేశం కే కొంచెం ఇబ్బంది,మామగారిని ఎలాగూ వాడుకుంటాడు.కానీ బాబు వాంట్స్ మోర్! ఇటువంటి సమయంలో మంచి చాణక్యుడి బుర్రతో అలోచించి గౌడని బరిలోకి దించాడు.ఈ గౌడ పని ఏమిటంటే తెలంగాణా ఉద్యమాన్ని అందరూ వాడుకున్నాట్టే వాడడం.మీకు అన్యాయం జరిగింది అని మనల్ని మభ్యపెట్టి తెరాస కి పడే వోట్లని చీల్చడం!ఎన్నికలయ్యాక పెన్నా నది బంగాళాఖాతంలో కలిసినట్టు మన గౌడ తెలుగుదేశం లో కలిసిపోతాడు.
ఇక నా పని పెన్న మీద ఒక కన్ను వేయడమే!

4 comments:

ఏకాంతపు దిలీప్ said...

@ కాలాస్త్రి గారు

మీకు కనిపిస్తున్న "జరుగుతున్న పరిణామాలు" ఎంటో వివరిస్తే బాగుండేది. అప్పుడు ఇది కేవలం మీ అనుమానం కాకుండా విశ్లేషణగా అందరికీ అర్ధమవుతుందేమో. ఒక వేళ ఆ జరుగుతున్న పరిణామాలు మీరు వివరించదలచుకోకపోతే, వెంటనే మీరు జర్నలిజం లోకి దూకెయ్యండి. మీరు సూపర్ సక్సెస్ అవుతారు ఆ రంగంలో :-)

Anonymous said...

ఆసక్తికరం. yet a bit far fetched

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

"చంద్రబాబు తో ఉంటే ఎప్పటికీ పైకి రానీయడు... "

మీరిలా రాయడం చాలా విచారకరం. నాయుడుగారు పిలిచేదాకా అసలు దేవేందర్ గౌడ్ అంటే ఎవరు ? అతనొక చిన్న కిరాణాకొట్టు నడుపుకునే చిఱువ్యాపారి మాత్రమే. నాయుడుగారు అతన్ని పైకి తీసుకొచ్చినట్లు ఎవరినీ తీసుకురాలేదు. మిత్రుడుగా అభిమానించారు. తెలుగుదేశంలో తన తరువాత తనంతటివాడుగా తీర్చిదిద్దారు. ప్రభుత్వంలో సుమారు ఒక దశాబ్దకాలంపాటు మంత్రిని చేశారు. సహచరుడుగా ఎన్నో ఆపదల నుంచి గట్టెక్కించారు కూడా. ఉదాహరణకు - సినీనటి ప్రత్యూష మానభంగం, హత్య కేసులో దేవేందర్ గౌడ్ కు అత్యంత సన్నిహితు డొకడున్నాడని అప్పట్లో లోకం కోడై కూసింది. కానీ దేవేందర్ తప్పించుకోగలిగాడు, ఎవరి చలవ ? ఎవరైనా ఇంతకంటే ఏం చెయ్యగలరు ?

దేవేందర్ రక్తంలో నెనరూ, నీతీ ఏ కోశానా లేకపోతే అది కూడా చంద్రబాబు తప్పేనా ? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడా ఆయన దూకేసేది ? ఏం, కేవలం నాలుగేళ్ళపాటు అధికారంలో లేకపోవడాన్ని అంత జీర్ణించుకోలేకపోతున్నాడా ? యు.కె.లో గత పదేళ్ళుగా కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో లేదు. అంతమాత్రాన కన్జర్వేటివులు ఫిరాయింపులకు పాల్పడుతున్నారా ? మన దేశంవాళ్ళకు నీతి జాతీ లేదంతే !

శ్రీ said...

మొదటగా పరిమాణాలు అని రాసినందుకు క్షమించండి,దిలీప్ గారు చెప్పినట్లుగా పరిణామాలు అని చదువుకోండి.

ఇక దిలీప్ గారికి,జరుగుతున్న పరిణామాలు అంటే నా ఉద్దేశం గౌడ ఇపుడు వివిధ గ్రూపులని సమీకరించడం,ప్రజల అభిమానాన్ని పొందడానికి చేస్తున్న ప్రకటనలు వగైర.ఇవన్నీ నా ఊహలు,అనుమానాలు మాత్రమే!మీ అభిమానానికి చాలా సంతోషం!

అనానిమస్ గారికి,వేచి చూద్దాం!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారికి,

మీరన్నది నిజమే!పైకి రానీయడు అనడం కన్నా,బాబు కన్నా పైకి రానీయడు అని రాసి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను.

కాకపొతే ఇక్కడ గౌడ నీతి తప్పి బయటకి వెళ్ళలేదు అని నా ఉద్దేశం.బాబే ఇలా గౌడ ని బయటకి పంపి తెలంగాణలో వోట్లు చీలుద్దామని వ్యూహం రచించి ఉండచ్చు.గౌడ గెలిచే కొన్ని సీట్లను పట్టుకుని ఎలాగూ అధికారంలోకి వెళ్ళలేడు.ఈ సీట్లు అమ్ముకోవడం వల్ల గౌడకి,అధికారంలోకి రావడానికి బాబుకి ఇద్దరికీ లాభం!