డెట్రాయిట్ లిటరరీ క్లబ్ మొదటి సభ 10 సంవత్సరాల కిందట కొందరు తెలుగు భాషభిమానులు ఒక చోట చేరి తమకు తోచిన,నచ్చిన పద్యాలు చదవడంతో మొదలయిందిట. అలా మొదలయిన సభ ప్రతి నెలా ఒక పుస్తకం సమీక్ష వరకు ఎదిగింది.ఈ పుస్తకం కథ కావచ్చు, లేదా అందమయిన కవిత కావచ్చు,లేదా ఒక నిండు నవల కావచ్చు. ప్రతి సంవత్సరం చదవబోయే పుస్తకాలను సభ్యులే నిర్ణయించి విజయవాడకు చెందిన నవోదయ పబ్లిషర్ కు సమాచారం పంపుతారు.నవోదయా పబ్లిషింగ్ కి చెందిన రామ్మోహన్ గారు సభ్యులందరికీ పుస్తకాలని "సీ మెయిల్" లో అందరికీ చేరేలా చూస్తారు.ముందుగా అనుకున్న ప్రకారం ఆ నెలకి చదవబోయే పుస్తకాన్ని సభులందరూ చదివి చర్చకి హాజరవుతారు. ఈ ఆనవాయితీ గత 10 సంవత్సరాలుగా కొనసాగించడానికి మందపాటి కృష్ణారావు గారు, ఆరి సీతారామయ్య గారు,మన కొత్తపాళీ గారు చేసిన కృషి అమోఘం! నాకు ఈ సభతో గత 5 సంవత్సరాలుగా పరిచయం! అటువంటి ఈ క్లబ్ కి 10 సంవత్సరాలు నిండి ఇలా చక్కగా పండగ జరుపుకోవడం చాలా మంచి విషయం. డెట్రాయిట్ లిటరరీ క్లబ్ ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచమంతటా ఉన్న తెలుగు సాహిత్య అభిమానులు తెలుగు భాష అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాను.
ఈ సమావేశాలగురించి ఇప్పటికే శరత్ "లైవ్ బ్లాగింగ్" ద్వారా మంచి విశేషాలు అందించారు. అలాగే కొత్తపాళీ గారు బ్లాగర్ల సమావేశాం ఫోటోలతో సహా బ్లాగారు. జేప్స్ తన బ్లాగులో బ్లాగర్లని 'ఏకం కండీ అని మంచి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా రవి వైజాసత్య గారిని, జేప్స్ గారిని, సీబీ రావు గారిని, శరత్ గారిని కలుసుకునే అవకాశం కలిగింది.
చివరగా, విహారి గారు నాకు కొత్తగా మా అమ్మాయి "దియా" బుగ్గలు వచ్చాయి అన్నారు. అసలు విషయం ఏమిటంటే బ్లాగులో ఉన్న పోటో పాతది! --)
4 comments:
ఈ టపా ఎప్పుడు రాశారు? తేదీ 23 అని వుంది ఈ మధ్య కాలం లో దీన్ని చూడలేదు.
ఇప్పటికి నలుగురు రాశారు కానీ ఒక్కళ్ళూ పూర్తిగా బ్లాగుల గురించి ఏమి చెప్పారో రాయలేదు. కొత్తపాళికి పది ప్రశ్న లేస్తే ఒక్క సమాధానం వచ్చింది. ఇక మిగిలింది రావు గారు, వైజా సత్య. వాళ్ళేం రాస్తారో చూడాలి.
మీ ఫోటో కొత్తది పెట్టండి మరి. :-)
-- విహారి
వైజాసత్య, రావు గారు రాయకపోతే నేనే రాసేస్తాలెండి!
మీ కోరిక మీద కొత్త ఫోటో పెడతాలెండి!
విహారి,,
వదిలేయ్.. ఇక్కడ ఇంతమంది బ్లాగర్లు ఎదురుచూస్తున్నారని తెలిసి కూడా ఆ సమావేశానికి హాజరైన వాళ్లు పట్టించుకోవడంలేదు. కేర్‍లెస్.. అందరూ బిజీగా వున్నారు. మనమే ఈగలు , దోమలు కొట్టుకుంటున్నాము కదా..
శ్రీ,
రాసేస్తాలెండి అంటే ఏంటి?? మీలో ఎవరో ఒకరు రాస్తారుగదా అని ఎదురుచూడాలా?? ఆయ్..
జ్యొతి గారు,
లైవ్ బ్లాగింగ్ లో మన శరత్ అంతా రాసేసాడు అనిపించింది నాకు. ఇక మీరు ఇంత అప్యాయంగా అడిగితే తప్పక రాస్తాను విశేషాలతో.
Post a Comment