Friday, October 24, 2008

వైకుంఠంలో కలిసిన కైలాసం!

తిరుపతి గ్రేటర్ కార్పోరేషన్ గా మారబోతొంది! గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ విశాఖపట్నం సరసన గ్రేటర్ తిరుపతి చేరనుంది.


తిరుపతి కార్పోరేషన్లో ఇక నుండి రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, వడమాలపేట, చంద్రగిరి కలవబోతున్నాయి. రేనిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు విడుదల చేస్తుందిష! ఆ విస్తరణలో భాగంగా తిరుపతి నుండి శ్రీకాళహస్తికి మెట్రో రైలు సౌకర్యం కుడా రాబోతుంది. ప్రతి అరగంటకి ఒక రైలు నడిచే ఏర్పాట్లు జరుగుతాయష! తిరుపతి రైల్వే స్టేషన్ కుడా 500 కోట్ల నిధులతో అధునీకరణ జరగబడుతుందిష!

రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలంటే తిరుపతి ఉన్న పరపతి చాలదట! అందుకే తిరుపతిని విస్తరించి గ్రేటర్ తిరుపతిగా చేస్తే నిధులు విడుదలవుతాయని ఇలా చేయడం జరిగింది. ఇది నిజంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మంచి శుభవార్త! తిరుపతి ఇప్పటికే రేణిగుంట వరకు విస్తరించి కాలాస్త్రి వైపు వస్తూ ఉంది. ఈ మధ్యలో లాంకో హిల్స్ లాగా మరి కొన్ని పరిశ్రమలు వస్తే చుట్టుపక్కల వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది. ఇక అంతర్జాతీయ విమానాశ్రయం అంటే చుట్టుపక్కల అభివృద్ధి బాగా ఉంటుంది. తిరుపతి,శ్రీకాళహస్తి,పుత్తూరు నుండి ప్రజలు ఉపాధికి చెన్నై,హైదరాబాదు,బెంగళూరు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుంది.

రాష్త్రంలో ఒక్క హైదరాబాదునే మీదనే పెట్టుబడులు పెట్టకుండా మిగతా పట్టణాలని అభివృద్ధి చేద్దామని తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా హర్షణీయం!

2 comments:

Anonymous said...

You mean by year 2086? The way the three party politiks are playing, do not expect anything soon (aka read bureaurocracy - India ishtyle)

శ్రీ said...

మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొందరలోనే చెయ్యచ్చు, అంటే ఒక 10 సంవత్సరాలు అనుకుంటున్నాను.