Saturday, October 25, 2008

కేక - ఒక దిక్కు మాలిన సినిమా!


కేక సినిమా ముందు ఇడిల్ బ్రైను లో తేజతో లైవ్ చాట్ ఉనింది. వరుస ఫ్లాపులతో సతమవుతున్న తేజ చాలా ఆత్మవిశ్వాసంతో అందరికీ సమాధానాలిచ్చాడు. కేక సినిమా మీరందరూ చూసాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం అని కుడా అన్నాడు. సినిమా విడుదల అయ్యాక పొలి కేక అందరి పొలికేకలు తేజకి వినిపించాయో లేదో?
  1. సినిమా మొదలయ్యాక పది నిముషాలకి నా పక్కన కూర్చున్న మిత్రుడు చెప్పాడు "అడుగో! ఆ జుట్టుపోళి గాడే హీరో!" అని. దానితో మొదలయింది నా మొదటి కేక.
  2. తర్వాత హీరో లవ్ గురించి ఫ్లాష్ బాక్ మొదలయ్యాక హీరోయిన్ కుడా ఎంటరవుతుంది. నాకు పెద్దగ అనిపించలేదు కాని, హీరో మాత్రం ఆమెను చూసి కేక పెడుతాడు.
  3. దెయ్యం ఇల్లు చూసి తిరుగుముఖం పట్టేటపుడు పాట ఒక్కటే నేను ఆనందంతో పెట్టిన కేక. ఈ పాట చిత్రీకరణ మాత్రం అత్యద్భుతం! వానలో హీరోయిన్ తడుస్తూ హీరో తో దోబూచులు అదిరాయి. పీ సీ శ్రీరాం వాన చాలా బాగా చూపించాడు. ఈ పాటకి పెట్టిన నా కేక శ్రీరాం కి అంకితమిస్తున్నా!
  4. ఈ హీరొయిన్ కి కాబోయే వాడు హీరోకి బెస్ట్ ఫ్రెండట. ఇది పెద్ద కేక పెట్టే విషయం కాదనిపించింది. ఈ మద్య కాలంలో ప్రతి ఒక్కరూ పెట్టే కేకే ఇది.
  5. ఒకడితో పెళ్ళి సెటిలయి పాత ప్రేమికుడితో జరిపే సరసం నా చేత వెగటు కేక పెట్టించింది.
  6. హీరో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ చేసిన కామెడీ చాలా చండాలంగా ఉంది, నిజంగా చావు కేక!
  7. ఇంకొక పాట చిత్రీకరణ బాగుంది. ట్యూను పెద్దగా క్యాచీగా లేకపోయేసరికి గుర్తు లేదు. ఈ పాటలో ఈవెంట్స్ ముందుకి, వెనక్కీ జరుగుతూ ఉంటాయి.
  8. ఇక క్లైమాక్స్ లో పిల్లల చేత తన ప్రతి సినిమాలో లాగే తీసాడు. ఇక చివరలో ట్విస్ట్ పెద్ద కేక అని తేజ చెప్పుకున్నాడు. నాకయితే తేజ ఇంకా ఎదగాలి అనిపించింది.
ఈ సినిమా లో ఒక ప్లస్ పాయింట్ ఉంటే అది పీ.సీ.శ్రీరాం అనే చెప్పుకోవాలి. కథ ఎవరినన్నా అడిగిఉంటే బాగుండేది, "నేనే పొడిచేస్తాను" అనుకుంటే ఇలాగే ఉంటుంది. నేను "సీతయ్యను, ఎవడి మాట వినను" అనకుండా మంచి కథ తీసుకుని తీస్తే ఈసారి కొంచెం ఆవరేజ్ సినిమా తీయచ్చు! లేకపొతే అది కుడా దీనిలాగే "పొలికేక" అవుతుంది!

18 comments:

చైతన్య క్రిష్ణ పాటూరు said...

ఇప్పటి వరకు ఈ సినిమా చూసిన వాళ్ళంతా కేకలే పెట్టారు. నిన్న టీవీ9లో తేజ ఇంకో కేక పెట్టించే విషయం చెప్పాడు. తన సినిమాలకు, వాటి పేర్లకు ఏమీ సంబందం లేదంట. ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి పెడతాడంట. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. కథ ప్రకారం అయితే చిత్రం సినిమాకు "వయసు కాటేసింది" అని పెట్టాలంట. అలా పెడితే బాగుండదని ఇలా పెట్టాడంట. జయం సినిమాలో జయమేముంది జనాల కైపు కాకపోతే అన్నట్టు చెప్పుకొచ్చాడు. తన రేంజ్ ఎంటో తేజాకి బాగా తెలుసు, మనమే తెలుసుకోవట్లా.

Naveen Garla said...

ఇంకా తెలు(గు)లు సినిమాలు చూడటమేంటండీ, అస్సయ్యంగానూ. ఏమైనా ఆశావాదులంటే మనోళ్ళే. మంచి సినిమా చూడక పోతామా అని దశాభ్దాలుగా ఎదురు చూస్తూన్నారు.

SATYA said...

మీ కేక సంగతి ఎలా ఉన్నా ....ఇక్కడ పూనా లొ నేను నా తమ్ముడు...హిరో....అనే హినం అయ్యిన సినిమా కి బాగా దొరికి పొయం....అసలా సినిమా అందుకు తిసాడో....ఎదొ తెలుగు సినిమా వచ్చింది కదా అని వెలితే.....200 టికెట్ డబ్బులు సుద్ద దండగ....సినిమా లో ఒక కధ లేదు....ఒక పాత్ర లేదు....ఎవడొ black money ని white చేయడానికి సినిమా తీసాడు...ఇంటెర్వెల్....అవ్వకుడానే...బయట పడ్ద....

శ్రీ said...

చైతన్య క్రిష్ణ పాటూరు, ఇప్పటికి నాకు పూర్తిగా అర్థమయ్యాడు తేజ.

నవీన్ గారు, నాకు కొంత ఎంటర్ టైన్మెంట్ ఉంటే చాలండీ! నేను అంతకంటే పెద్దగా ఆశించను. కొత్త బంగారు లోకం నాకు బాగా నచ్చింది, ఒక 10 సార్లు చూసి ఉంటాను.

సత్య గారు, హీరో సినిమా మా దగ్గర ఇంకా రిలీజ్ అవలేదు, కాబట్టి బతికిపోయా. పోలీస్ అకాడమీ ని కాపీ కొట్టి తీసారని చదివాను.

కొత్త పాళీ said...

కేకాయ నమహ!!!
శ్రీ, ఏవైనా, మీకు ఓపికెక్కువండి.:)

శ్రీ said...

డెట్రాయిట్లో ఈ సినిమాని ఎవరూ కొనలేదు కొత్తపాళీ గారు. జగదీశ్వర్ రెడ్డి (కేక సినిమాకి కో-ప్రొడ్యుసర్) సినిమాని మా డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. దానితో నేను తప్పక చూడవలసి వచ్చింది. తేజకి తప్పకుండా నా ఫీడ్ బాక్ పంపుతాను.

బొల్లోజు బాబా said...

టపా అదిరింది
చిన్న డౌటు అమెరికాలో పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువా? నిజమా?

సుజాత said...

చైతన్య కృష్ణ గారు,
బాగా చెప్పారు. తేజ రేంజ్ ఏమిటో తేజకు బాగానే తెలుసు. మనమే తెలుసుకోవట్లా! దానికి తేజ ఏం చేస్తాడు పాపం! ఒక విచిత్రం అనే విచిత్రమైన సినిమా చూశారా..తేజ దే!

అబ్రకదబ్ర said...

నే చూసిన ఒకే ఒక తేజ సినిమా 'జయం'. అప్పట్లో పెద్ద హిట్ కాబట్టి బాగుంటుందని చూశా; నాకేమీ నచ్చలా. దాంతో తేజ పెట్టించే కేకల నుండి తప్పించుకున్నా :-)

బాబాగారు,

మామూలుగానయితే పెట్రోలుకీ, డీజిలుకీ అటూ ఇటూగా ఒకటే ధర ఉంటుంది. డీజిల్ మీద భారద్దేశంలో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అక్కడ దాని ధర తక్కువ. ఇప్పుడు మెల్లి మెల్లిగా ఆ సబ్సిడీ ఎత్తేస్తున్నారనుకుంటా.

శ్రీ said...

నెనర్లు బొల్లెజు బాబా గారు. డీజెల్ ఇంజిన్ వాతావరణాన్ని బాగా కలుషితం చేస్తుంది కదా,పెట్రొలు కంటే! డీజెల్ వాడకం తగ్గించడానికి దాని మీద సుంకం పెంచింది ఇక్కడి ప్రభుత్వం.

శ్రీ said...

తేజకి "సీతయ్య జబ్బు" ఉందండీ సుజాత గారు.
బాగా చెప్పారు అబ్రకదబ్ర గారు.

కొత్త పాళీ said...

అవును బాబా గారూ, ఇక్కడ దీజెల్ ఖరీదు పెట్రోలు కంటే గేలనుకి కనీసం పావలా ఐనా ఎక్కువుంటుంది.
సబ్సిడీ ఇవ్వడం కాదనుకుంటా. పెట్రోలుక్కానీ డీజెలుక్కానీ పంపు దగ్గర మనం చెల్లించే వెలలో సగానికి సగం (ఇండియాలో ఐతే సగానికంటే ఎక్కువే బహుశా) రకరకాల పన్నులు. దేని మీద పన్ను తక్కువుంటే దాని ధర తక్కువుంటుంది.
ఇక్కడ ఒక మోస్తరు సైజు ట్రక్కులు కూడా పెట్రోలు ఇంజన్లతోనే నడుస్తాయి. కంటెయినర్లని మోసే ట్రక్కులు మాత్రమే డీజెల్ తో నడుస్తాయి.

సీను గాడు said...

కేక సినిమా చూసి "బలి" అయిపోయిన మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందం మరియు భాధ కలిసి వస్తున్నాయి. నా భాధ మీరు ఆ సినిమా చూసినందుకు... ఆనందం నేను "బలి" అవ్వకుండా ఈ టపా రాసినందుకు. "ఒక V చిత్రం" సినిమా చూసిన తరువాతే తేజ టాలెంటు నేను అర్థం చేసుకున్నా. వాడి బాగు కోసం వాడి "తిక్క" సినిమాలు చూస్తే నేను "ఆర్థికంగా" నాశనం అవుతానని మానేశా.

శ్రీ said...

సీను కి, నేను "ఒక విచిత్రం" చూడలేదు. ఈ సినిమాతో మళ్ళీ తేజ పుంజుకుంటాడు అంటే నమ్మా!

gopalaKRISHNA said...

krishna
keka is not a original movie it not at movie its drama chetha drama

శ్రీ said...

బాగా చెప్పారు కృష్ణ గారు.

Anonymous said...

ఏ సినిమా దేనికి కాపీనో టాక్కున పట్టేసే మీరు దీన్ని ఎలా వదిలేసారండీ... Watch "The Classic" - 2003.

Frame to frame ditto...

శ్రీ said...

అవునా? నేడే చూస్తాను, థాంక్స్!