Friday, December 26, 2008

నేనింతే - కృష్ణా నగర్ కథలు


స్థలం: డెట్రాయిట్ 
సమయం: సోమవారం సాయంత్రం 6 గంటల 7 నిముషాలు 
బయటి ఉష్ణోగ్రత:3 డిగీల ఫారన్ హైట్(ఇంచుమించు -16 డిగ్రీల సెల్సియస్)


క్రిస్మస్ సెలవల వల్ల ఇంట్లొనే గోళ్ళు గిల్లుకుంటున్న సమయంలో ఊర్లోకి పాత మిత్రుడు వచ్చాడన్న విషయం తెలిసింది. ఇద్దరం సినిమా పిచ్చోళ్ళమే,కాసేపు కబుర్లు చెప్పుకుని సినిమాకి వెళ్దామని అనుకున్నాం. 8 గంటలకి సినిమా,హాలుకి వెళ్ళేసరికి నేను,మిత్రుడు,ఇంకొక ఉమ్మడి మిత్రుడితో కలిసి ముగ్గురమే హాల్లో. మంచి ఏకాంతం దొరికిందని సంబరపడ్డాం.  


పూరీ సినిమాలాగా కాకుండా కొంచెం సెంటిమెంటు ఎక్కువ ఉండడం ఆశ్చర్యం కలిగించింది.విరామం తర్వాత, ఇప్పటి వరకు బాగనే ఉంది అని అనుకున్నాం.

సినిమా కష్టాలతో పూరీ మామ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసాడు అనిపించింది.పెద్ద దర్శకులు జూనియర్లని ఎలా హింస పెడుతారో చూపించాడు.అభిమాన హీరో కోసం ఫాన్స్ అతి-వీరాభిమానం చాలా బాగా చూపించాడు.పోకిరి సినిమా సిమ్హాద్రి 175 రోజుల రికార్డ్ ని దాటాలని థియేటర్ కి డబ్బులు ఇచ్చిన ఫాన్స్ గురించి నాకు తెలుసు. అభిమాన్ హీరో మీద వీరాభిమానంతో ఇల్లు గుల్ల చేసుకుంటున్న ఎందరో అభిమానులకి ఇది ఒక కనువిప్పు కలిగితే సినిమా హిట్టయినట్టే!


క్లైమాక్స్ వచ్చేసరికి కథ మీద పట్టు వదిలించి సినీ మసాలా తగిలించాడు.దీనితో కొంచెం నిరుత్సాహం కలుగింది నాకయితే! ఏమోలే పూరీ ఇంతే!! సినిమాలో పాటలు పెద్దగా కాచీగా అనిపించలేదు,అన్ని పాటలు సిల్లీగా "బుర్ర గ్లవుస్" నుండి మిస్సయ్యాయి. రంగీలాలో ఊర్మిళ కుడా సినిమాల్లో తన ఉనికి కోసం ఇంచుమించు ఇలాగే పాకులాడింది.రవితేజ కళ్ళలో ఆ తపన తీవ్రత బాగా తగ్గింది.సుబ్బరాజు,సాయిరాం పాత్రని పోషించడంలో సఫలమయ్యారు.రవితేజ,సియా నటన సంతృప్తికరంగా లేదు.


సినిమాకి "కృష్ణానగర్ కథలు" అని పెట్టి ఉంటే టైటిల్ కి న్యాయం జరిగి ఉంటుందని నా అభిప్రాయం!

9 comments:

Kathi Mahesh Kumar said...

మొత్తానికి చూడొచ్చంటారా?

Anonymous said...

katti gAru... chUDochchanTarA ani aDigAru. reviews chUsi, cinema veLLAla vaddA anukunE typical NRIs mIda nirmAta gA, shAyaji shinDE paDi EdchE scene undi..

"ఎనిమిది డాలర్ల కోసం కక్కుర్తిపడి, ఎవడొ డబ్బులు తీసుకుని రివ్యూ వ్రాస్తే, దానిమీద ఆధారపడి సినిమా చుస్తారు. మా మ్యుసిక్ వినండి, ట్రైలర్ చూడండి, చూడాలనిపిస్తే, సినిమ చూడండి. అంతే కాని, రివ్యూ చూసి సినిమ చూడాలో వద్దో నిర్ణయించుకోకండి." అని తెగ ఆవేశపడిపోతాడు. అదేంటో, "సినిమ చూసి రివ్యూ చదవాలంట, రివ్యూ చదివి సినిమ చూడకూడదంట" మొత్తం అంతా చదివేస్తే, ఇక చూడటనికి ఏముంది అని point

cbrao said...

వచ్చే ఆదివారం మా ఊళ్లో చూద్దామంటే అప్పుడే వెళ్లిపోయింది. మేము అద్రుష్టవంతులమా?

-cbrao
San Jose, CA

శ్రీ said...

మహేష్ గారు,ఒక మోస్తరు సినిమా అండీ,చూడకపొయినా నష్టం ఉండదు.

రివ్యూలు మనల్ని చాలా వరకు కాపాడుతాయండీ తెలుగోడు గారూ!సినిమా పరమ చెత్తగ ఉందనుకోండి,మనం రివ్యూ చూసి సైడు అయిపోవచ్చు.

ముమ్మాటికీ అదృష్టవంతులే సీ బీ రావు గారూ!

Anonymous said...

ఈ పూరి గాడేదో ఏడ్చాడాని, మనం feel అయిపోయి, reviews చదవటం మాని, suicidal గా సినిమాలు చూడటం మొదలెడతామా ఏంటి. కభీ నహీ!!!

శ్రీ said...

అవును,మన జాగ్రత్తలో మనం ఉండాలి.

Anonymous said...

ఎందుకో తెలీదు, ఈ సినిమా లాగే మీ సమీక్ష లో పస తగ్గినట్టనపించింది. లేదూ, ఈ సినిమా ప్రభావం మీ మీద పడ్డదేమో :-) .. పూరీ కొంచెం overconfidence చూపిస్తున్నాడేమో అని నాకనిపిస్తుంది.

ఈ సినిమా చూడని అదృష్టవంతుల్లో నేనొకణ్ణి.

శ్రీ said...

నా సమీక్షలలో నా అనుభవాలు,అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి.అంతకంటే ఎక్కువ కోరుకోవద్దండి,ఈ సినిమా మీరు చూడకపోయినా పరవాలేదు.

Anonymous said...

director dry ayi poyyada, visigi poyyada ilanti chetta cinema thisadanukunna antha choosi.