Monday, June 29, 2009

చక్కిలిగింతలు ఎలా పుడతాయి ?

నిన్న రాత్రి దియా గొడవ చేస్తూ ఉన్నపుడు ఒక కొత్త ఆట నేర్పిస్తాను అని పిలిచాను. దియా బుడ్డి చేతులు చేతిలోకి తీసుకుని నా చేతి వేళ్ళతో దియా చేతి మీద నడిపిస్తూ "కొండకి పోయే దారేది" అంటూ చక్కిలిగిలి పెట్టాను. విపరీతంగా నవ్వింది, "మళ్ళీ...మళ్ళీ" అంటూ చాలా సార్లు చక్కిలిగిలి పెట్టించుకుంది. "నాన్నా! చక్కిలిగింతలు ఎలా పుడతాయి?" అని దియా అనలేదు, ఎందుకంటే ఇంకా ఆ వయసు రాలేదు. డియా అడిగేలోపల తెలుసుకోవాలని గూగుల్లో వెతికాను. వీకీపీడియాలో మంచి సమాచారమే దొరికింది. నాకు తెలిసింది మీతో కూడా పంచుకుంటాను.




1897 లో ఇద్దరు శాస్త్రవేత్తలు చక్కిలిగింతల మీద పరిశోధన చేసారట. చక్కిలిగింతలు రెండు రకాలుగా ఉంటాయట. చర్మం మీద చిన్న కదలిక వల్ల కలిగే చక్కిలిగింత మొదటి రకానికి చెందింది. దీని వలన నవ్వు రాకపోగా చిరాకు కలగచ్చు. చక్కిలిగింతలు పుట్టే చోట పదే పదే సున్నితంగా తాకడం వల్ల బాగా నవ్వు రావచ్చు, ఇవి రెండవ రకానికి చెందిన చెక్కిలిగింతలు.
ఇంకా చాలా విషయాలే ఉన్నాయి, మీకు ఇంకా చదవాలంటే ఇక్కడ చూడండి.

No comments: