Friday, July 31, 2009

కాలాస్త్రి జోస్యం ఫలించింది

సరిగ్గా సంవత్సరం ముందు దేవేందర్ గౌడ్ తెలుగుదేశం వదిలి బయటకి వచ్చాడు. ఆ సమయంలో నేను రాసిన టపా ఇక్కడ చూడండి. నా టపా ప్రకారం ఎన్నికల తర్వాత గౌడ్ తెలుగుదేశంలోకి చేరుకుంటాడని. అది ఇప్పుడు నిజం కాబోతుంది.


ఎన్నికల సమయంలో గౌడ్ తన టిక్కెట్లని కాంగ్రెస్ కి అమ్ముకున్నాడని గుసగుసలు మనకి బాగానే వినిపించాయి. ఒక సంవత్సరం బయట ఉన్నందుకు డబ్బులు బాగానే గిట్టుబాటయ్యాయి. తెలుగుదేశంలో ఉండి ఉంటే ఆ డబ్బులు కూడా దొరకక తనే జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండేదేమో?

19 comments:

శరత్ 'కాలమ్' said...

:)

మారతాడా said...

జోస్యాలు అన్ని సార్లు నిజం కావు , జోస్యాన్ని నమ్ముకుంటే దరిద్రుడు కధలో యానాది రెడ్డికి పట్టిన గతే మీకూ పడుతుంది :)

శ్రీ said...

@ శరత్ కాలం --)

@ యానాది రెడ్డి, మీ పరిస్థితి మెరుగయిందనుకుంటాను.

శరత్ 'కాలమ్' said...

@ యానాది రెడ్డి

!@#$%^&*()_+

Anonymous said...

మూరతాడు

lol

కొత్త పాళీ said...

టెంప్లేటు అదిరింది శ్రీ.
యానాది రెడ్డి, హ హ హ.
అవునూ, అనామకులకి ప్రవేశం లేకుండా చెయ్యొచ్చుగా ..
అన్నట్టు మన శివగారు బ్లాగు మొదలట్టేశారు చూశారా?

శ్రీ said...

నెనర్లు కొత్తపాళీ గారు. మీ టెంప్లేట్ చూసే నాది కూడా మార్చాను.

అనామకులతో సరసాలు బాగుంటున్నాయి. --)

శివగారి బ్లాగు ఇంకా చూడలేదు.

Mauli said...

Hi

mee old post chadivanu ...akkada mee reasons 100% wrong ani ippudu andariki telusu ...goud naidu ki serious ga against vellaru ...
naidu goud ni pampinchi, TRS tho velladu kabatti meeku appatiki mee post lo assumtions wrong ani telisi untundi ...

so ,ippudu mee abhiyogam malli congress ku ammukunnaru ani ....cheppalemu ....meeru okka saari fail ayyaru kabatti guess cheyyakandi,yevaro cheppinatlu mee josyam ki ardham ledu ...goud TDP vadili ravadam anedi aayana self confidence ...kani politics kooda business ayina ee rojullo rules/principles adagatam mana amaayakatvam ...kaadantaraaaa ...am TDP supporter...so not sure, how biased I am in writing this ....

Mauli said...
This comment has been removed by the author.
Anonymous said...

జోస్యం అన్న మాట వాడారా !!! భలే వారే !
ఏదైనా ఐతే,మేముంటాం లెండి !
అందరు అనామకుల్ని ఒకే గాటన కట్టి, విలన్లలా చూసే విష? సంస్కృతి ఎప్పుడు పోతుందో ఏంటో ! ప్చ్ ! కనీసం శ్రీ గారు, మీరైనా మమ్మల్ని అర్థం చేస్కున్నారు !

పుట్టినప్పుడు అందరం అనామకులమే కదా ! ఎందుకంత కోపం ! అంతా విష్ణు మాయ !

శ్రీ said...

మౌళిగారు, మీ అభిప్రాయాలకు నెనర్లు! ఈసారి తెలుగులోకి రాయడానికి ప్రయత్నించండి,సరదాగా ఉంటుంది.

Anonymous said...

ఈ శివ గారి బ్లాగ్ ఏంటో చెప్తే, మేమూ చూసి సంతోషిస్తాం, దీవిస్తాం కదా !

శ్రీ said...

@ అనానిమస్, ఇందుకే నాకు అనానిమస్ అంతే ఇష్టం!

ఇంకో అనానిమస్, నాకు తెలిసిన తర్వాత పోస్ట్ చేస్తానులెండి.

Anonymous said...

చాలా రోజులనుంచీ సందేహం, అడిగితే బాగోదేమో అని సందేహిస్తున్నా ! సరే, అడిగేస్తా, ఒక పనైపోతుంది ! కాలాస్త్రి అంటే ఏంటండీ ? మీ జోస్యం సూపరు !

శ్రీ said...

భలేవాళ్ళే!దీనికి ఇంత సందేహం ఎందుకండీ?

కాలాస్త్రి అంటే కాళహస్తి అని. మా ఊరు కాళహస్తిని లోకల్ వాళ్ళు వాడుకలో కాలాస్త్రి అంటారు. అదీ సంగతి!

జోస్యం నచ్చినందుకు నెనర్లు!!

Anonymous said...

ఓహో ! ఒక విషయం తెలిసింది.అప్పట్లో ఏదో తెలియని ప్రశ్న అడిగితే, ఇది కూడా తెలియదా అనేసారు, I hurted,అప్పట్లో నేల్లోరు పెద్దారెడ్డి కూడా బిజీ.:-( అందుకే కొంత సందేహం ! --) కాళహస్తిలో పెరగటం మీ అద్రుష్టం,చాల అందమైన ప్రదేశం, ఆ గుడితో(పర్యాటకులుగా) ఎన్నో తీపి గుర్తులున్నాయి మాకు.

శ్రీ said...

థాంక్స్!

మీకు కూడా కాళహస్తి తీపి జ్ఞాపకాలని మిగిల్చినందుకు సంతోషం!!

Anonymous said...

ఏదో తెలియని ప్రశ్న అడిగితే, ఇది కూడా తెలియదా అనేసారు

btw,అలా చేసింది మీరు కాదు సుమీ ! మీ ఊరు విశేషాలు కొంచెం పోస్టించండి మరి.

శ్రీ said...

నేను అనలేదు కాబట్టి నాకు కూడా తెలుసు లేండి!

కాలాస్త్రి గురించి రాయాలనే ఉంది! ఒకసారి మా ఊరెళ్ళాక అక్కడ విశేషాలతో చాలా రాయాలనుకుంటున్నాను.