Saturday, August 1, 2009

మగధీర - కాలాస్త్రి పరిశీలనరాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ హిట్టే! మగధీర సినిమాని రిలీజ్ చెయ్యడానికి ఇంచుమించు రెండు సంవత్సరాలు పట్టింది. ఆడియో రిలీజ్ అవగానే పాటలు వింటే మామూలుగానే ఉన్నాయి, ఒక్క "పంచదార" పాట తప్ప. లంచ్ టైములో రాజమౌళి మీద డిస్కషన్ వచ్చినపుడు ఎవరో అన్నారు "ఆర్ నారాయణ మూర్తి రక్తంతో రిక్షా తొక్కుతాడు! రాజమౌళి బ్లడ్ పెట్టి సినిమా తీస్తాడు!!" అని. నిజమే,ఇతని టీం ని దగ్గరగా పరిశీలిస్తే మంచి పట్టు ఉన్న కథ,అందమయిన కెమెరా పనితనం,వీనుల విందయిన సంగీతం,కొంచెం ఘాటయిన హింస ఉంటాయి. ఇప్పటివరకు రాజమౌళి తీసిన సినిమాలన్నింటికీ విజయేంద్ర వర్మ(రాజమౌళి తండ్రి) కథ అందించగా,కెమెరా కి సెంథిల్ నమ్మకంగా పని చేస్తూ వచ్చాడు.సంగీతం గురించి మనకందరికీ తెలిసిందే,చిన్నాన్న కీరవాణి భాద్యతగా తుక్కులేపే ట్యూన్స్ అందిస్తూ ఉన్నాడు.వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా రమా రాజమౌళి కాస్ట్యూంస్ కి పని చేస్తూ ఉంది.ఏ సినిమాకన్నా సక్సెస్ కావాలంటే మంచి టేం వర్క్ ఉండాలి,అది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది!


చిరుత తర్వాత రాం చరణ్ తేజకి ఇది రెండో సినిమా. చిరంజీవి కి కొడుకుగా పుట్టడం రాం చరణ్ తేజ చేసుకున్న అదృష్టం,రెండవ సినిమాకే 40 కోట్లకి పైగా పెట్టుబడి పెట్టించుకునే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది? చరణ్ స్కిల్స్ చూస్తే డాన్సులు బాగా చేస్తాడు,వాయిస్ లో మంచి బేస్ ఉంది.చిన్నపుడు తమిళ నటుడు ప్రభు ఫాం హౌస్ లో హార్స్ రైడింగ్ బాగా చేసేవాడట!మొహం ఒక్కటే కొంచెం తేడాగా ఉంటుంది.ఇవన్నీ పనికివచ్చేలా చరణ్ కి ఎటువంటి వేషం సరిపోతుంది? అని రాజమౌళి బాగా హోంవర్క్ చేసి కాళభైరవ వేషం ఎంచుకున్నట్టున్నాడు!


ఇప్పటికే అందరికి తెలుసు కాబట్టి కథ గురించి ఇక్కడ మాట్లాడుకోవడం అనవసరం.రాం చరణ్ డాన్సులు చిరుత లాగే బాగా చేసాడు.రాజమౌళి బంగారు కోడి పెట్ట పాట ఈ సినిమాకి వాడుకుని బాగా హైప్ క్రియేట్ చేసాడు.ఇది ఇతని పాత టెక్నిక్కే!యమదొంగలో ఎంటీ.రామారావు పాట పెట్టడం మనకందరికీ తెలిసిందే!సినిమాలో కాజల్ బాగా అందంగా కనిపించింది,ఈ సినిమాతో ఈమె రేటింగ్స్ పెరిగినట్టే!రాజమౌళి ప్రతి సినిమాలొ చూపించినట్టు ఫ్లాష్ బాక్ మీద ఉత్కంఠ బాగా చూపించాడు.ఫ్లాష్ బాక్ చూస్తూ ఉంటే గ్లాడియేటర్,300 సినిమాలు గుర్తుకురాక మానవు.కాళభైరవుడి పాత్రకి 300 లోని స్పార్టన్స్ స్ఫూర్తి అనుకుంటా!భైరవ కోన సీన్లు మాత్రం చందమామ కథలని గుర్తుకు తీసుకువచ్చాయి.భైరవ కోన,కొండ అంచుకి బ్రిడ్జి గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉంది.ఈ సినిమాకి ఇదే హైలెట్!సైతాన్ కీ ఫోజ్ తో యుద్ధం భీభత్సంగా ఉంది,బాక్ గ్రౌండ్ లో సంగీతం మాత్రమే వినిపించి హింస పాళ్ళు కొంచెం తగ్గించడానికి కృషి చేసారు.


ఈ సినిమాలో శ్రీహరిది మంచి సపోర్టింగ్ రోల్.షేర్ ఖాన్ డైలాగులు చాలా బాగున్నాయి,షేర్ ఖాన్ తో కాళభైరవుడికి ఎక్కువ డైలాగులు ఉంటే బాగుండనిపించింది.సాల్మాన్ రాజు పాత్ర కూడా చాలా సరదాగా ఉంది.రావ్ రమేష్ కి అఘోరగా మంచి అవకాశం లభించింది,వాయిస్ కొంచెం మెరుగుగా ఉంటే ఇంకా బాగుండేదనిపించింది.రాజస్తాన్ ఎడారిని బాగా చూపించారు,ఇసకనంతా గ్రాఫిక్స్ లో మార్చి తెల్లగా స్నో లాగా భలే చూపించారు.తెలుగువాడు గర్వించే విధంగా మగధీర సినిమా తీసినందుకు రాజమౌళిని అభినందించాల్సిందే!

11 comments:

రవి said...

కాలానికి తగినట్లు సినిమాలు తీసి, హిట్ చేయిస్తున్నాడు రాజమౌళి. మొన్న శనివారం టికెట్లు దొరకలే. తొందర్లో చూడాలి.

ఈ మధ్య చిరంజీవి చాదస్తం ఎక్కువయ్యింది. టీవీలో ఓవర్ చేస్తున్నాడు, సినిమా ప్రసక్తి వచ్చినప్పుడల్లా.

మురళి said...

"రాజమౌళి ఒక్కో సినిమా ఫ్లాష్ బ్యాక్ కీ ఒక్కో స్టేట్ ఎంచుకుంటున్నాడు.. 'సింహాద్రి' కి కేరళ, 'విక్రమార్కుడు' కి బీహార్ ఇప్పుడు 'మగధీర; కి రాజస్తాన్.." సినిమా చూసొచ్చిన ఓ మిత్రుడి వ్యాఖ్య ఇది..

శ్రీ said...

@ రవి, నిదానంగా చూడండి,తొందర ఏమీ లేదు.

సినిమాలో కూడా చిరు కొంచెం ఓవర్ చేసాడు.పుత్రోత్సాహం అలాగే ఉంటుందేమో!

@ మురళి, కరక్టే! చత్రపతిలో శ్రీలంక ఫ్లాష్ బాక్! స్టూడెంట్ నం.1 మొదటి సినిమా కాబట్టి ఆంధ్రాలోనే ఫ్లాష్ బాక్ అనుకుంటా!

Anonymous said...

babu kalastri..eppudu..nuvuu... manaku telisinde ani vadutav.. tesindi .. nuvuu tippitippi cheppadam deniki babu..
okka magadu

శ్రీ said...

@ అనానిమస్, ఓ..నీకు తెలీదా?
తిప్పి,తిప్పి చెప్పినా ఎక్కినట్టు లేదు!

aSirA said...

శ్రీ, సినిమాలో తెల్లగా కనిపిచిందంతా ఇసుక కాదంట. గుజరాత్ లోని ఉప్పు నేల. (Rann or Kutch)

శ్రీ said...

@ అసిర, అవునా! మంచి విషయం చెప్పారు.

భాస్కర్ రామరాజు said...

శ్రీ భాయ్
నమస్తే
మీ కొత్త టెంప్లెట్ బాగుంది కానీ...కొన్ని కొన్ని హైపర్ లింక్స్ అంత వీజీగా కనిపించట్లా..
:):)
ఇక్కడ నాదొక అసందర్భ ప్రేలాపన -
మళ్ళి మొదలైంది సందడి. ఏందదీ? అనద్దు - అంత్యాక్షరీ!! మళ్ళీ ఓ చెయ్యి వేయండి ఇక్కడ http://paatapaatalu.blogspot.com/2009/01/blog-post.html

aSirA said...

శ్రీ మగధీర - నా రివ్యూ ఇక్కడ చూడండి.
http://www.gaddipuvvu.blogspot.com/

హరే కృష్ణ . said...

gud1..mee review choosi nenoo oka review raasanu

Anonymous said...

రాజమౌళి కూడా పూరి లాగ మంచి కథకుడు. సినిమా ని చాల గ్రిప్పింగ్ గా తీస్తారు. ఎటొచ్చి ఇద్దరి సినిమా ల్లొ మూస ధోరణి ఎక్కువ కనపడుతుంది. రాను రాను ఒకేవిధమైన stories తీసి విసిగించరని అనుకొంటున్నాను.