Tuesday, May 4, 2010

మా నాటకం - హై-ధరా-బాదుగడచిన సంవత్సరం దీపావళికి నరకాసుర వథ నాటకం వేసినప్పటి నుండి మళ్ళీ అవకాశం ఎపుడు వస్తుందా? అని ఎదురు చూసిన మాకు ఉగాది వేడుకలు వేదికగా దొరికాయి. నాటకానికి పేర్లు ఇచ్చేసి కథ కూడా వెతికేసాం. ఈ నాటకాన్ని స్నేహితుల మధ్య ప్రదర్శించిన పవన్ మిత్రులు ఉత్సాహాన్ని చూపగా నాతో పాటు ఇంకొక ముగ్గురు కళాకారులు కలిసి రిహార్సల్స్ మొదలుపెట్టాం.
ప్రతి వారాంతం ఒక 2, 3 గంటలు మా ఇంట్లో అందరం కలిసి నాటకం వేసే వాళ్ళం. కథలోకి వస్తే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బూం లో ఉన్నపుడు బిల్డర్ ఇళ్ళ ధరలు బాగా ఎక్కువ చేసి చెపుతూ ఉంటాడనమాట. బేరాలు కూడా ఏమి ఆడకుండా ఎన్నారై కస్టమర్లకే అమ్ముతానంటాడు. లోకల్ గా ఎవరు కొందామని వచ్చినా వాళ్ళ మీద చిరాకుని ప్రదర్శిస్తూ గొడవ పడుతూ ఉంటాడు. మార్కెట్ పడిపోయినప్పుడు బిల్డర్ రోడ్డు మీద పడి అందరినీ ఇళ్ళు కొనుక్కోమని అడుక్కుంటూ ఉంటాడు. ఒకటి కొంటే ఇంకో ఇళ్ళు ఫ్రీ అని డీల్స్ ఇస్తూ ఉంటాడు. ఇంతకు ముందు చిరాకు పడిన కస్టమ కస్టమర్ల దగ్గర కెళ్ళి వాళ్ళ దగ్గర తిట్లు తింటూ ఉంటారనమాట. చివరకి ఎవరో మాటల్లో జేబులో నుండి పర్సు తీయబోతే చిల్లర కింద పడుతుంది. ఆ చిల్లర ఏరుకుని ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేసారు అంటూ డాన్స్ చేస్తూ ఉండగా నాటకం ముగుస్తుంది.

ఇందులో నాది బిల్డర్ పక్కన గూండా పాత్ర అనమాట. నేను బిల్డర్ కి విస్కీ కలుపుతూ మాలిష్ చేస్తూ ఉంటాననమాట. అందరి మీద కోప పడుతూ ఉంటాను. బిల్డర్ కను సైగలతో కస్టమర్లని బయటకి తోసేస్తూ ఉంటాను. కొన్ని సాంకేతిక ఇబ్బందులు తప్పితే నాటకం చాలా సరదాగా జరిగింది. అందరూ అనుకున్నదాని కంటే బాగా నటించారు. ప్రస్తుతం కొన్ని ఫోటొలు ఉన్నాయి. వీడియో కూడా దొరికాక లింకు తప్పకుండా పెడతాను.


4 comments:

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

కాన్సెప్టు చాలా బాగుంది. నేటి వ్యాపార థృక్పథానికి అద్దం పడుతూ హాస్యరస ప్రధానంగా చెప్పటం బాగుంది.

Prasad Samantapudi said...

మరోసారి అందరకి అభినందనలు.

మీ బిల్డర్ కి రెకమెండ్ చేసి ఏదైనా ఫ్లాట్ చవకలో ఇప్పించాలి. :-)

* * *

డాలర్లు ఖర్చుపెట్టి ఇండియానుండి సెలిబ్రిటీస్ ని తీసుకువచ్చి వారికి హారతులివ్వడం తగ్గించి,మనాళ్ళు కొద్దిగానైనా లోకల్ టేలంట్ ని ప్రోత్సహిస్తే బావుంటుంది.

శ్రీ said...

రవిచంద్ర, మా నాటకం రాసిన పవన్ సంక గారికి అభినందనలు.

ప్రసాద్, తప్పకుండా. మీ అభిమానంతో మళ్ళీ ఒక మంచి నాటకం వెయ్యగలం.

హారం ప్రచారకులు said...

శ్రీ గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.