Wednesday, July 21, 2010

పులి ఆడియో కబుర్లు


స్థలం: ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.జే.సూర్య కార్యాలయం, చెన్నై


సూర్య: తాంబరం ? ఒక సారి ఉల్ల వా


బయట కూర్చున్న మేనేజరు లోపలకి పరిగెత్తుకుని వచ్చాడు.


సూర్య: "మన సినిమా పులికి పాటలు దా కొట్టాలి, నల్ల ఆడియో వేణ్ణుం! యారు కొడతారు?" అలోచిస్తూ అన్నాడు.


మేనేజరు: "మనకి ఖుషి చేసారు కదా మణిశర్మ! ఆయన చేత చేపిద్దాం. మీకు ఫరవాలేదా ?" వినయంగా అడిగాడు.


సూర్య: ఒద్దప్పా..మళ్ళీ అదే పాటలు కొడతాడప్పా తాంబరం.

మేనేజరు: కీరవాణిని పిలవమంటారా ? ఈ మధ్య బాగా కొడుతున్నాడు.


సూర్య: వేండా..వేండా... నాకు తమిళ్ డైరక్టర్ కావాలి. రెహ్మాన్ ని తీసుకుందాం. రెహ్మాన్ని కూప్పుడు తాంబరం!

మేనేజరు: "అరం డైరక్టర్ అంటే పాటలు ఎలా ? తెలుగు సినిమాకి బాగుండవేమో సార్!" అనుమానం వెల్లబుచ్చాడు


సూర్య: పరవాఇల్ల తాంబరం! రెహ్మాన్ ట్యూన్ ఇస్తాడు, చంద్ర బోసు దా పాటలు రాస్తాడు

మేనేజరు: "సరే సార్" అని బయట వెళ్ళబోతూ "సార్! నా పేరు పీతాంబరం సార్! మీరు నన్ను ఊరికే తాంబరం అని పిలుస్తున్నారు" అని నసిగాడు

****

ఒక ఆరు నెలలు గడిచాయి, పాటలు రాయడం అయిపోయింది. అలాగే రికార్డింగ్ కూడా అయిపోయింది. ఆడియో మార్కెట్లోకి విడుదల అయింది.


****


సూర్య కొత్తగా విడుదల అయిన పాటలు వింటూ పరవశంతో ఊగుతూ ఉన్నాడు


సూర్య: "షషి ముఖే..ఓ..షషి ముఖే" అబ్బా...సూపర్ గా ఉన్నాయి పాటలు. విపరీతంగా ఫీల్ అయిపోయి ఇంకో పాట వినడం మొదలు పెట్టాడు.


"మారాలంటే" అని ఇంకో పాట మొదలయింది.

సూర్య: "అబ్బ..మారాలంటా.....నువ్వే..."


మూడు నిముషాలయ్యాక ఇంకో పాట మొదలయ్యింది. ఎదో అరబిక్ రాగం లాగుంది "తూనే మారా గయే ఒనే ఒయ్యే మనవే!"

అలవాటు ప్రకారం "నాకు ముక్కా...నాకు ముక్కా" స్టెప్స్ వేస్తూ డాన్స్ చేస్తున్నాడు సూర్య.


****

కాలాస్త్రి: పాటల్లో అరం వాసన గుప్పున కొడుతుంది. ఎంత విన్నా ఎక్కడం లేదు, ఇక పులికి నరబలే!


9 comments:

bhaskars blog said...

వేటూరి గారు అయితే రహమాన్ పాటలకు సరిపోయేదేమో! కాని ఏమి చేస్తాం ఆయన లేరు. ఇంకా చంద్రబోసు అలవాటుపడాలి రహమాన్ ట్యూన్లకి.

శ్రీ said...

తప్పు చంద్రబోస్ ది కాదు.


రెహ్మాన్ హిందీ పాటలు చేసినపుడు హిందీ నేటివిటీ చూపిస్తాడు.

తెలుగు పాటలకి ఎందుకు తెలుగుదనం లేదు ?

భావన said...

:-)

Rama Prasad said...

Maastaaru,

Chaalaa Baagaa Cheppaaru !!

Kaani Mee Blog Puli Fans choostaaremo Jaagratta !!

శ్రీ said...

నేనూ ఫాన్ కాబట్టే అంత ఫీల్ అయ్యాను మాష్టారూ!

Deva Seeta said...

basu,

How do you it is narabali.. you predicted perfectly.. congratulations for correct pridiction but it is unfortunate

శ్రీ said...

నిజమే దేవా. ఇంతకు ముందు కూడా దేవేందర్ గౌడ్ మీద ఇలాగే చెప్పిన జోస్యం నిజమయింది.

http://kalas3.blogspot.com/2009/07/blog-post.html

thrill said...

devender goud meeda cheppindi , puli meeda cheppindi antaa correct ainappudu .. nuvvu enchakka oka "jyotishyalayam" start cheyyaka poyava dabbedabbu ....nuvvu nee bidarimatalu marava nuvvu....

శ్రీ said...

చిలక జోస్యం ఒకటి మొదలుపెడదామనుకుంటున్నా.

మంచి చిలక ఉంటే పంపు బ్రదర్!

నీ వేమన బ్లాగు చూసా తమ్ముడూ! నువ్వూ ఎదో ఒకటి రాయకపోయావా ?