Sunday, April 17, 2011

తీన్ మార్ - నాన్ స్టాప్ బాదుడు
నిన్న నెల్లూరుకి వచ్చాను. నెల్లూరులో సినిమా చూసి చాలా సంవత్సరాలయింది కదా అని పవర్ స్టార్ సినిమాకి మా ఫ్రెండు నెల్లూరు పెద్దారెడ్డిని బలవంతంగా తీసుకువెళ్ళాను. నర్తకిలో సినిమా మొదలయిపోయింది. ఎదురుగా మాధవ్ లో ఇంకా తలుపులు ముయ్యలేదు, అటు దూరితే టిక్కెట్లు కాస్తా అయిపోయాయి. మనకి బ్లాక్ అలవాటే కాబట్టి పెద్దగా సిగ్గుపడకుండా 25 రూపాయల టిక్కెట్లు రెండు తీసుకుని హాల్లోకి పరిగెత్తాను. 25 రూపాయలు టిక్కెట్టు అనేసరికి నెల్లూరు పెద్దారెడ్డికి నామోషి అయింది.


"ముందు కూర్చోవడం అమెరికాలో అలవాటయింది అబ్బాయ్! " అని సర్ది చెప్పేసరికి నా ప్రాణం అతని తోకకి వచ్చింది (నాకు తోక లేదుగా!).

ఈ సినిమా హిందీ వర్షన్ చూసాను, ఓకే అనిపించింది. తెలుగులో తీస్తున్నారంటే "ఎందుకబ్బా? వేస్ట్" అనుకున్నా. ముందుగా హిందీ చూడకుండా ఉంటే సినిమాలో ట్విస్ట్ ఎంజాయ్ చేసి ఉండేవాడినేమో! సినిమాలో పాటలు పెద్దగా ఎక్కలేదు! త్రిషని ఇంతకు ముందే నేను ఖండించిన విషయం నా ప్రియ బ్లాగర్లకు గుర్తుండి ఉంటుంది. ఇంకా త్రిషని పట్టుకుని ఎందుకు ఊగుతున్నారో నాకు అయితే అర్ధం కావడం లేదు. అలహాబాదులో ఫిగర్ కూడా అలాగే ఏడిచింది. ఒక లండన్ పాప మాత్రం కొంచెం ముద్దుగా అనిపించింది, దూరపు కొండల సిండ్రోం అనుకుంటా!


ఇక్కడ సినిమా కబుర్ల కంటే నా ముందు కూర్చున్న నలుగురు తమిళ పిలకాయల గురించి చెపుతా. ఆ నలుగురూ తాగి వచ్చారు. మొదట పది నిముషాలు పవర్ స్టార్ ఇటాలియన్ భాషలో మాట్లాడుతుంటే వీళ్ళు బూతుల పంచాంగం విప్పారు. మొదటి అరగంట మాత్రమే వీళ్ళ పోరాటం జరిగింది, ఆ తరువాత లొంగి పోయారు. ఈ సందడి ముగిసాక నాకు బోరు కొట్టి నిద్ర లోకి జారుకున్నా. గంట తర్వాత ఏసీ ఆపేసాక లేచి చూస్తే పెద్దారెడ్డి ఇంకా నిద్రలోనే ఉన్నాడు.


"ఏసీ ఆపేసాడు, ఇంక సినిమా చూడు" అని పెద్దారెడ్డిని బలవంతంగా లేపి మిగిలిన సినిమా చూపించా.


సినిమా అయిపోయి బయటకి వచ్చాక "సినిమా ఎలా ఉంది" అని పెద్దారెడ్డిని అడిగితే సినిమాకి ప్రాస కుదిరేలా ఒక టాగ్ లైన్ (సభ్య సమాజం దీన్ని హర్షించదు కనుక ఇక్కడ వ్రాయలేకపోతున్నాను) చెప్పాడు. నాకయితే జెమినీ మ్యూజిక్ చానెల్లో వస్తున్న "తీన్ మార్ - నాన్ స్టాప్ బాదుడు" సరిగ్గా ఉందనిపించింది.
7 comments:

రవి said...

హిందీ చూడనోళ్ళు పర్వాలేదని టాకు.

శివ said...

ఇప్పటి కుర్రాళ్ళ కోసం తీస్తున్నామనుకుని మరీ ఇంత చెత్త తీస్తే ఎలా.

మీరు చెప్పిన తమిళ కుర్రాళ్ళకి మల్లె నేను కూడా మొదట్లో ఆ ఇటాలియన్ (సౌత్ ఆఫ్రికాలో ఇటాలియన్ ఎందుకు వాగుతాడో అర్ధంకాదు, వాళ్ళు అఫ్రికానారో మరింకేదో మాట్లాడతారు) గోల చూసి ఝడుసుకున్నాను. ఆ సినిమా దర్శకుడి స్థాయి తెలిసి అంతవరకూ దిగజారి ఎలోగాలో సినిమా చూస్తుంటే బాగుందే అనిపించకపోలేదు. కానీ హిందీ వెర్షన్ చూసిన మా అబ్బాయిమటుక్కు పెదవి విరిచి పారేసాడు.

అసలా హిందీ వాళ్ళు కొరియా సినిమానుంచి కొట్టుకుకోచ్చారుటగా!

తెలుగు అభిమాని said...

ఫన్ టాస్టిక్ కాలాస్త్రి గారు.

శ్రీ said...

@ రవి,చాలా మంది రివ్యూలలో అలాగే రాసారు!

@ శివ, బాగా చెప్పారండీ శివ గారు.

సినిమా కొరియా నుండి కాపీ అని నాకు మీరు చెపితేనే తెలిసింది.

శ్రీ said...

నెనర్లు తెలుగు అభిమాని

siva said...

నేను నా మిత్రులతో కలసి చూడటానికి మరే సినిమా లేక ఎ/సి లో కొంచెంసేపు సేద తీరుదామని నర్తకిలో చాంతాడంత క్యూ చూసి బయపడి లీలామహల్ లో ఈ సినిమా చూడటం జరిగింది. మా వాళ్ళు తీన్ మార్ నాతో కలసి మరో మారు చూసారు. మా ఫ్రెండ్ వయ్యారాల జాబిల్లి పాట కోసం ఇంకోసారి చూడొచ్చని ఎలాగో చివరి వరకు చూసాడు.

శ్రీ said...

ఓ..నెల్లూరులోనే! మాధవ్ లో సినిమా మారిపోయిందా అపుడే?

తీన్ మార్ మళ్ళీ చూసారా ? మీ స్నేహితులు నిజంగా కాలభైరవులే!